Dead bodies found in a parked car in Delhi

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. పార్కింగ్ చేసిన కారులో  మూడు మృతదేహాలు లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాలు ఎవరియా? అక్కడికి ఎలా వచ్చాయా? ఇవి ఆత్మహత్యలా లేక హత్యలా అన్న కోణంలో  దర్యాప్తు చేస్తున్నారు.  ఘటనా స్థలానికి చెందిన సీసీటీవీ ఫుటేజ్‌ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. 

ఘటనా ‍స్థలానికి ఫోరెన్సిక్ బృందాలు చేరుకొని నమూనాలు స్వీకరించాయి. మృతదేహాలు లభించిన కారు పీరాగఢి  ఓవర్ వద్ద పార్కు చేసి ఉంది. అయితే చనిపోయిన వారిలో ఒకరు యువతి కాగా  మరోకరు యువకుడు,  ఓ పెద్దాయన  ఉన్నారు. రణ్‌ధీర్‌(52), శివనరేష్‌(42)   లక్ష్మీ(41)లుగా గుర్తించారు.