
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. పార్కింగ్ చేసిన కారులో మూడు మృతదేహాలు లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాలు ఎవరియా? అక్కడికి ఎలా వచ్చాయా? ఇవి ఆత్మహత్యలా లేక హత్యలా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చెందిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందాలు చేరుకొని నమూనాలు స్వీకరించాయి. మృతదేహాలు లభించిన కారు పీరాగఢి ఓవర్ వద్ద పార్కు చేసి ఉంది. అయితే చనిపోయిన వారిలో ఒకరు యువతి కాగా మరోకరు యువకుడు, ఓ పెద్దాయన ఉన్నారు. రణ్‌ధీర్(52), శివనరేష్(42) లక్ష్మీ(41)లుగా గుర్తించారు.
English Translation

Atrocity happened in Delhi, the capital of the country. Three dead bodies were found in a parked car and there was a commotion in the locality. The police reached there and started an investigation. Who are the dead bodies? How did you get there? They are investigating whether it is suicide or murder. The CCTV footage of the incident is being examined.
Forensic teams reached the spot and collected samples. The car where the dead bodies were found was parked at Piragadhi Over. But one of the dead was a young woman and the other was a young man and an old man. Randhir(52), Shivanaresh(42) and Lakshmi(41) have been identified.