Crime News: రూ.400 కోట్ల కంటైనర్ దోపిడీ.. స్పందించిన కర్ణాటక హోంమంత్రి

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

బెంగళూరు: గోవా-కర్ణాటక సరిహద్దుల్లోని చర్లకొండ మార్గంలో రూ.400 కోట్లను తరలిస్తున్న కంటైనర్‌ను దోపిడీ దొంగలు దారి మళ్లించిన వ్యవహారంపై కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర స్పందించారు. బాధితులు కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేయడానికి సిద్ధమని.. ఈ ఘటనలో వాస్తవాలు వెలుగు చూస్తాయని వెల్లడించారు.
ఏం జరిగిందంటే..
గోవా-కర్ణాటక సరిహద్దుల్లోని చర్లకొండ మార్గంలో రూ.400 కోట్లను తరలిస్తున్న కంటైనర్‌ను దోపిడీ దొంగలు దారి మళ్లించారు. గుజరాత్ నుంచి మహారాష్ట్ర, గోవా మీదుగా కర్ణాటకలో ప్రవేశించి తిరుపతికి చేరాల్సిన ఆ వాహనాన్ని ఎవరు దారి మళ్లించారనే విషయంపై మహారాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఆరా తీస్తోంది. కర్ణాటకలోని బెలగావిలో ఈ దోపిడీ జరిగినట్లు భావిస్తుండగా.. మహారాష్ట్రలోని నాసిక్‌లో కేసు నమోదైంది. కొన్ని రాష్ట్రాల్లో త్వరలో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికలకు ఈ సొమ్ము కాంగ్రెస్ పార్టీ తరలిస్తోందంటూ భాజపా ఆరోపించగా.. అవన్నీ తప్పుడు ఆరోపణలని కర్ణాటక మంత్రులు సతీష్ జార్కి హోలీ, ప్రియాంక్ ఖర్గే కొట్టి పారేశారు. గుజరాత్, మహారాష్ట్ర, గోవాల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందో గుర్తించాలని సవాల్ విసిరారు. ఈ కేసులో దర్యాప్తు అధికారులు నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 14:46 IST