Ursula von der Leyen: విజయవంతమైన భారత్‌తో.. ప్రపంచం మరింత సుస్థిరం: ఉర్సులా

Eenadu icon
By International News Team Updated : 26 Jan 2026 20:31 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్: విజయవంతమైన భారత్‌ ప్రపంచాన్ని మరింత సుస్థిరంగా మారుస్తుందని యురోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్‌ అన్నారు. భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావడాన్ని జీవితకాల గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. దిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించిన పరేడ్‌కు సంబంధించిన వీడియోను ఆమె ‘ఎక్స్‌’ వేదికగా పంచుకుంటూ ఈమేరకు ట్వీట్‌ చేశారు.

‘‘విజయవంతమైన భారత్‌.. ప్రపంచాన్ని మరింత సుస్థిరంగా, సుసంపన్నంగా, సురక్షితంగా మారుస్తుంది. దీంతో అందరూ ప్రయోజనం పొందుతారు’’ అని ఉర్సులా వ్యాఖ్యానించారు. యురోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో కలిసి ఉర్సులా ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న విషయం తెలిసిందే. ఐరోపా సమాఖ్య (European Union)కు చెందిన అగ్రనేతలు భారత రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరవడం ఇదే మొదటిసారి.

ఈయూ నేతలు తమ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కలిసి మంగళవారం ప్రధాని మోదీ ( Narendra Modi)తో చర్చలు జరపనున్నారు. చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా భారత్‌- ఈయూలు పయనిస్తున్నట్లు ఉర్సులా ఇటీవల దావోస్‌ వేదికగా వెల్లడించారు. ఈ ఒప్పందంతో కోట్లాదిమంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని, ప్రపంచ జీడీపీలో ఇది 25 శాతానికి సమానమని తెలిపారు.

ఇరుదేశాలది చారిత్రక బంధం: ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. ‘‘గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వానికి, ప్రజలకు అమెరికా తరఫున హృదయపూర్వక అభినందనలు. ప్రపంచంలో పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా అమెరికా, భారత్‌లు చారిత్రక బంధాన్ని కలిగి ఉన్నాయి’’ అని ట్రంప్‌ పేర్కొన్నట్లు యూఎస్‌ ఎంబసీ తెలిపింది.

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 15:47 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • నావల్నీ మృతి కేసు.. అది విష ప్రయోగమే - ఐరోపా దేశాలు రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ రెండేళ్ల క్రితం జైల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.
  • విజయం తర్వాత తొలి ప్రసంగం.. భారత్ గురించి రెహమాన్ ఏమన్నారంటే..? Tarique Rahman: భారత్‌తో సంబంధాలను ఉద్దేశించి తారిఖ్ స్పందించారు. 
  • ట్రంప్‌ ‘పొలిటికల్‌ ప్రేమ’.. వైట్‌హౌస్‌ వాలంటైన్స్‌ డే మెసేజ్‌ ప్రేమికుల రోజు సందర్భంగా అమెరికా అధ్యక్ష భవనం కొన్ని డిజిటల్‌ కార్డ్స్‌ను విడుదల చేసింది.
  • అమెరికాలో భారత విద్యార్థి అదృశ్యం అమెరికాలో ఓ భారతీయ విద్యార్థి అదృశ్యమయ్యాడు (Indian Student Missing in USA). కర్ణాటకకు చెందిన సాకేత్‌ శ్రీనివాసయ్య (22) ఫిబ్రవరి 9 నుంచి కన్పించకుండా పోయాడు.
  • త్వరలో ఇరాన్‌ పాలనలో మార్పులు జరిగే అవకాశం: ట్రంప్‌ ఇరాన్‌-అమెరికా మధ్య మళ్లీ ఉద్రికత్తలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌లో కొత్త పాలక వర్గం అంశాన్ని లేవనెత్తారు. 
  • పన్నూ హత్యకు కుట్ర.. నేరాన్ని అంగీకరించిన భారతీయుడు..! ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర పన్నారనే కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భారత్‌కు చెందిన నిఖిల్‌ గుప్తా.. తాజాగా నేరాన్ని అంగీకరించాడు. 
  • బంగ్లా పీఠంపై బీఎన్‌పీ బంగ్లాదేశ్‌లో దాదాపు ఏడాదిన్నరగా కొనసాగుతున్న రాజకీయ అస్థిరతకు తెరపడింది. దేశ 13వ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బీఎన్‌పీ) ఘన విజయం సాధించింది.
  • ‘డార్క్‌ ప్రిన్స్‌’కు బంగ్లా పగ్గాలు ఒకప్పుడు విమర్శకుల చేత ‘డార్క్‌ ప్రిన్స్‌’గా మాటలు పడిన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బీఎన్‌పీ) నేత తారిఖ్‌ రెహమాన్‌ ఇప్పుడు బంగ్లా పగ్గాలు చేపట్టబోతున్నారు.
  • ఐఎస్‌ఎస్‌కు పయనమైన నలుగురు వ్యోమగాములు వైద్యపరమైన అత్యవసర కారణాల వల్ల నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి అర్ధాంతరంగా భూమికి తిరిగొచ్చిన నేపథ్యంలో వారి స్థానాన్ని భర్తీ చేయడానికి తాజాగా మరో బృందం నింగిలోకి పయనమైంది.
  • ఎప్‌స్టీన్‌తో బంధంపై కలకలం.. గోల్డ్‌మాన్‌ సాక్స్‌ న్యాయవాది రాజీనామా అంతర్జాతీయ లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
  • పర్యవసానాలు బాధాకరంగా ఉంటాయి అణు ఒప్పందానికి అంగీకరించకుంటే ఇరాన్‌ అత్యంత బాధాకరమైన పర్యవసానాలు చవి చూడాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పునరుద్ఘాటించారు.
  • వచ్చేవారం మళ్లీ రష్యా-ఉక్రెయిన్‌ చర్చలు యుద్ధం ముగింపు దిశగా రష్యా, ఉక్రెయిన్‌ మధ్య వచ్చేవారం జెనీవాలో మరో దఫా చర్చలు జరగనున్నాయి. 17, 18 తేదీల్లో ఈ చర్చలు జరుగుతాయని రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ శుక్రవారం వెల్లడించారు.
  • సంక్షిప్త వార్తలు (3) సోవియట్‌ రష్యాలో స్టాలిన్‌ విధానాలను, కృశ్చెవ్, బ్రెజ్నెవ్‌ల హయాంలో రష్యా కమ్యూనిస్టు పార్టీ అనుసరించిన మార్క్సిజాన్నీ ప్రశ్నించిన విమర్శకుడు రాయ్‌ మెద్వెదేవ్‌ శుక్రవారం నూరేళ్ల వయసులో కన్నుమూశారు.
  • గాజా శాంతి బోర్డుపై ఇండోనేసియాలో వ్యతిరేకత గాజా కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన శాంతి సంస్థాపన బోర్డులో చేరిన ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబువో సుబియాంతో, అక్కడ నియోగించే అంతర్జాతీయ భద్రతా దళం (ఐఎస్‌ఎఫ్‌) కోసం 8 వేల మంది సైనికులకు శిక్షణ కార్యక్రమం చేపట్టారు.
  • కృత్రిమ మేధ ప్రభావం, ముప్పుపై ఐరాస నిపుణుల కమిటీ ఏర్పాటు అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో...కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం, దాని ముప్పును అంచనా వేయడానికి ప్రపంచ స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటయ్యింది.
  • హసీనా అప్పగింతను కోరతాం: బీఎన్‌పీ Sheikh Hasina: షేక్ హసీనా అప్పగింత గురించి భారత్‌ను కోరతామని బీఎన్‌పీ వెల్లడించింది. 
  • అమెరికా బహిష్కరణ.. ఒక్కో వలసదారుడిపై రూ.కోటి ఖర్చు! అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. భారీ సంఖ్యలో విదేశీయులను వెనక్కి పంపిస్తున్నారు.
  • బంగ్లా పీఠంపై ‘డార్క్‌ ప్రిన్స్‌’.. భారత్‌తో స్నేహమా? రణమా? Tarique Rahman: బంగ్లాదేశ్‌లో దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత బంగ్లాదేశ్ నేషనల్‌ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. తాజాగా జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మూడొంతుల మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.