Andhra News: కర్నూలు బస్సు ప్రమాదం తరహాలో.. రాయచోటిలో మరో దుర్ఘటన

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని గాలివీడు రింగ్‌రోడ్డు కూడలిలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి కడపవైపు వెళుతున్న కంటైనర్ వాహనం ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కంటైనర్ ముందు భాగంలో ద్విచక్ర వాహనం ఇరుక్కు పోయి.. 20 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంక్ పగిలి కంటైనర్ వాహనానికి మంటలు అంటుకున్నాయి. ద్విచక్ర వాహనంపై వెళుతున్న శ్రీనివాసులు (48) అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఐరన్ లోడ్‌తో వెళుతున్న కంటైనర్ ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. ఇటీవల కర్నూలులో జరిగిన బస్సు ప్రమాద ఘటన తరహాలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. మృతి చెందిన శ్రీనివాసులు.. స్వస్థలం రాయచోటి మండలం కంచరపల్లెగా పోలీసులు గుర్తించారు. మృతుడి భార్య ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లింది. ముగ్గురు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు దుర్మరణం కుటుంబీకులను విషాదంలోకి నెట్టింది. ప్రమాద ఘటనపై పట్టణ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
► Read latest Ysr kadapa Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 09 Jan 2026 16:02 IST
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- వ్యక్తి హత్య.. పరారైన దుండగులు [ 17-02-2026] అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో మంగళవారం ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు.
- మదనపల్లెలో విషాదం.. అదృశ్యమైన బాలిక మృతదేహం గుర్తింపు [ 17-02-2026] అన్నమయ్య జిల్లా మదనపల్లెలో విషాదం చోటుచేసుకుంది. అదృశ్యమైన ఏడేళ్ల బాలిక మృతదేహాన్ని ఎదురుగా ఉన్న కులవర్ధన్ అనే వ్యక్తి ఇంట్లోనే గుర్తించారు.
- పేదరాలి ఇంటిపై వైకాపా నేతల దాష్టీకం [ 17-02-2026] అధికారం కోల్పోయినప్పటికీ వైకాపా నేతల ఆగడాలు ఆగడం లేదు. పేదరాలు చేపట్టిన ఇంటిని జేసీబీ యంత్రంతో సోమవారం కూల్చివేశారు. నందలూరు మండలం నల్లతిమ్మయ్యగారిపల్లె పంచాయతీ కొత్త తిమ్మరాజుపల్లి సర్వే నంబరు 163(ఎ)లో 1.59 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.
- గుట్ట గుల్లవుతుంటే.. గుడ్లప్పగించి చూస్తారేం! [ 17-02-2026] మదనపల్లె జిల్లా కేంద్రంగా మారిన తర్వాత స్థలాలకు డిమాండ్ పెరిగింది. దీంతో ఖాళీగా కనిపించే గుట్టలను కొందరు గుల్ల చేస్తున్నారు. బండరాళ్లను సైతం తొలగించి కొండలను చదును చేసి ఆక్రమిస్తున్నారు.
- అదరం.. బెదరం.. తెచ్చి అమ్మేస్తాం [ 17-02-2026] డబ్బు సంపాదనే ధ్యేయంగా కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అందులో మద్యం అక్రమ రవాణా ఒకటి. పొరుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తెస్తున్నారు.
- ఆ నివాసం.. అరుదైన స్టాంప్‌ల మ్యూజియం [ 17-02-2026] ఆంగ్లేయుల కాలంలోని నాన్ జుడీషియల్ స్టాంప్ పత్రాలు ఎలా ఉంటాయో చాలామందికి తెలియవు. అప్పట్లో 25 పైసల నుంచి రూ.200 విలువైన స్టాంప్ పత్రాలూ వినియోగంలో ఉండేవి. ప్రస్తుతం మనుగడలో లేకపోవడంతో కనుమరుగై అరుదుగా లభ్యమవుతున్నాయి.
- ఇంటికెళ్దాం లే.. నాన్నా! [ 17-02-2026] ఆ దంపతులిద్దరూ కుమార్తెను చూసేందుకు సంతోషంగా ద్విచక్ర వాహనంలో బయల్దేరి వెళ్లారు. కొద్దిసేపట్లో కుమార్తె ఇంటికి చేరుకుంటారనేలోపు ఒకరిని మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో వచ్చి కబలించింది.
- జేఈఈలో మోగించారు జేగంట [ 17-02-2026] జేఈఈ మెయిన్స్ తొలి విడత ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు మెరిశారు. ఎన్‌టీఏ సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో అఖిత భారత స్థాయిలో ఉత్తమ పర్సెంటైల్ సాధించి సత్తా చాటారు.
- శివరాత్రి వేళ చెలరేగిన చోరులు [ 17-02-2026] నాలుగు ఇళ్లల్లో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడి.. సుమారు 27 తులాల బంగారం, రూ.2.6లక్షల నగదు ఎత్తుకెళ్లిన ఘటన చెన్నూరు మండల పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.
- ‘భూ’చోళ్లను దాస్తున్నారు! [ 17-02-2026] బ్రహ్మంగారిమఠం మండలంలో కొందరు భూబకాసురుల అవతారమెత్తారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో చేరి తమ అక్రమాన్ని కొనసాగిస్తున్నారు.