పుర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించండి: మంత్రి పొంగులేటి

Eenadu icon
By Telangana Dist. Team Published : 09 Jan 2026 16:14 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇల్లందు: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను దీవించినట్లే.. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఇల్లందు పట్టణంలో నూతన రహదారులు, కాలువల నిర్మాణాలకు శుక్రవారం  మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. పట్టణంలోని సింగరేణి పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గంలోని నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందన్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో పర్యటించి,  జీవో 76కు సంబంధించిన క్రమబద్ధీకరణ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కోరం కనకయ్య, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బానోత్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

► Read latest Khammam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ‘వ్యర్థం’ చేస్తున్నారు! [ 18-02-2026] ఖమ్మం నగరంలో 2021లో పూర్తయిన మానవ ఘనవ్యర్థాల శుద్ధీకరణ కర్మాగారం మూడేళ్లు బాగానే నడిచింది. 2024 సెప్టెంబర్‌లో వచ్చిన మున్నేరు వరద నీటిలో చిక్కి మూలనపడింది. ఏళ్లు గడుస్తున్నా ఇది పునరుద్ధరణకు నోచుకోకపోవటంతో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి.
  • పంటల సర్వే పట్టాలెక్కేనా? [ 18-02-2026] వ్యవసాయ రంగంలో పారదర్శకత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న ‘డిజిటల్‌ పంట సర్వే’ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. క్షేత్రస్థాయిలో ఎదురైన అడ్డంకుల కారణంగా ఏడాదిన్నరగా నత్తనడకన సాగుతున్న పంటల సర్వేపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది.
  • టన్నులకొద్దీ నిర్లక్ష్యం! [ 18-02-2026] ఈ ఏడాది జనవరి 5న కేఓసీ నుంచి మహారాష్ట్ర వనికి బొగ్గు లోడ్‌తో ఓ లారీ వెళ్లింది. కేఓసీ వేబ్రిడ్జి వద్ద 43.25 టన్నుల బొగ్గును లోడ్‌ చేశారు. అన్‌లోడ్‌ పాయింట్‌ వద్ద 44.72 టన్నుల తూకం వచ్చింది. అంటే 1.47 టన్నులు ఎక్కువ అన్నమాట.
  • ఉద్యోగులు తప్పుచేస్తే కఠిన చర్యలు [ 18-02-2026] ఆర్టీఏ కార్యాలయాల్లో పారదర్శకంగా సేవలందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి (డీటీఓ) ధరంపురి జగదీశ్‌ తెలిపారు. ఇటీవల ఆర్టీఏ కార్యాలయంపై అనిశా దాడుల నేపథ్యంలో భవిష్యత్తులో ఆరోపణలు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
  • ప్రతి విద్యార్థి చదివేలా బోధన ఉండాలి: శ్రీజ [ 18-02-2026] ప్రతి విద్యార్థి చదివేలా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బోధన ప్రక్రియలు నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ అన్నారు.   ఏడు మండలాల ఎంఈఓలు, పీఎస్‌ ప్రధానోపాధ్యాయులతో కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.
  • ఏఐ సమిట్‌లో నగర యువకుడు [ 18-02-2026] దిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో 2026’ సమిట్‌లో పాల్గొనే అవకాశం నగరానికి చెందిన యువకుడు సత్యజిత్‌చారికి దక్కింది. ఖమ్మంలోనే పాఠశాల, కళాశాల చదువు పూర్తి చేసుకున్న సత్యజిత్‌ ఐఐటీ,
  • పదవులు కాదు.. చేసిన పనులే శాశ్వతం: తుమ్మల [ 18-02-2026] ‘రాజకీయ జీవితంలో పదవులు శాశ్వతం కావు.. చేసిన అభివృద్ధి శాశ్వతమ’ని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గండుగులపల్లిలో సత్తుపల్లి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రెహానాబేగం, వైస్‌ ఛైర్‌పర్సన్‌ బొంతు సుమలత,
  • రూ.2 కోట్ల బీమా చేయించి హత్యాయత్నం [ 18-02-2026] తల్లిదండ్రులు లేని యువకుడి పేరిట బీమా చేయించి సొమ్ముల కోసం అతణ్ని అంతమొందించాలని పథకం రూపొందించారు. తీవ్రంగా కొట్టి రహదారి ప్రమాదంగా చిత్రీకరించాలనుకొన్నారు. విచారణలో ఇది ప్రమాదం కాదని ప్రణాళిక ప్రకారం చేసిన ఘాతుకమని పోలీసులు నిర్ధారించారు.
  • కొలువు వచ్చి మూడు నెలలు.. అంతలోనే అకాల మరణం [ 18-02-2026] ఓ యువకుడు గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతిచెందాడు. కారేపల్లి మండల కేంద్రానికి చెందిన దేవాదాయశాఖ ఉద్యోగి గణితి నారాయణ కుమారుడు సాయిచంద్ర(24) బీఫార్మసీ పూర్తి చేసి,