Sharmila Tagore: ఆ నటి వాదన వాస్తవ దూరంగా ఉంది.. వీధి కుక్కల అంశంపై సుప్రీం కోర్టు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్‌డెస్క్: వీధి శునకాల (Stray Dogs)అంశంపై కొన్నిరోజులుగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. తాజా విచారణలో బాలీవుడ్ అలనాటి నటి షర్మిలా ఠాగూర్ వాదనను అత్యున్నత న్యాయస్థానం ఆక్షేపించింది. ఆమె వివరణ వాస్తవానికి దూరంగా ఉందని వ్యాఖ్యానించింది.
దేశంలో కుక్క కాటు ఘటనలు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్న నేపథ్యంలో పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ( Supreme Court) విచారిస్తోంది. ఈ వీధికుక్కల్లో కొన్ని దాడి చేసేవి ఉంటాయి.. మరికొన్ని విశ్వాసం చూపేవి ఉంటాయని, అన్నింటినీ ఒకేలా పరిగణించి పరిష్కారం చూపడాన్ని ప్రశ్నిస్తూ నటి షర్మిలా ఠాగూర్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో దాడిచేసే కుక్కలను ఒక ప్రత్యేక కమిటీ ద్వారా గుర్తించాలని నటి తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. దిల్లీ ఎయిమ్స్‌లో ‘గోల్డీ’ అనే శునకం ఎన్నో ఏళ్లుగా అక్కడే ఉంటోందని, అది ఎప్పుడూ ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే కరిచేవాటికి కలర్ కోడింగ్ కాలర్స్ వాడాలని సూచించారు.
‘‘వీధుల్లో తిరిగే కుక్కల నుంచి శుభ్రతను ఆశించలేం. అలాంటివి ఆసుపత్రిలో ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మీరు వాదిస్తున్నది పూర్తిగా వాస్తవానికి దూరంగా ఉంది. ఆసుపత్రుల్లో ఉన్న కుక్కల గురించి గొప్పగా చెప్పకండి. అలాగే, కలర్ కోడింగ్ కాలర్స్ మనకు సాధ్యమవుతాయా? వాటిని అనుసరిస్తున్న దేశాల జనాభా ఎంత?’’ అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 09 Jan 2026 16:51 IST