Sharmila Tagore: ఆ నటి వాదన వాస్తవ దూరంగా ఉంది.. వీధి కుక్కల అంశంపై సుప్రీం కోర్టు

Eenadu icon
By National News Team Updated : 09 Jan 2026 20:34 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: వీధి శునకాల (Stray Dogs)అంశంపై కొన్నిరోజులుగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. తాజా విచారణలో బాలీవుడ్‌ అలనాటి నటి షర్మిలా ఠాగూర్‌ వాదనను అత్యున్నత న్యాయస్థానం ఆక్షేపించింది. ఆమె వివరణ వాస్తవానికి దూరంగా ఉందని వ్యాఖ్యానించింది.

దేశంలో కుక్క కాటు ఘటనలు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్న నేపథ్యంలో పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ( Supreme Court) విచారిస్తోంది. ఈ వీధికుక్కల్లో కొన్ని దాడి చేసేవి ఉంటాయి.. మరికొన్ని విశ్వాసం చూపేవి ఉంటాయని, అన్నింటినీ ఒకేలా పరిగణించి పరిష్కారం చూపడాన్ని ప్రశ్నిస్తూ నటి షర్మిలా ఠాగూర్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో దాడిచేసే కుక్కలను ఒక ప్రత్యేక కమిటీ ద్వారా గుర్తించాలని నటి తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. దిల్లీ ఎయిమ్స్‌లో ‘గోల్డీ’ అనే శునకం ఎన్నో ఏళ్లుగా అక్కడే ఉంటోందని, అది ఎప్పుడూ ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే కరిచేవాటికి కలర్ కోడింగ్ కాలర్స్ వాడాలని సూచించారు.

‘‘వీధుల్లో తిరిగే కుక్కల నుంచి శుభ్రతను ఆశించలేం. అలాంటివి ఆసుపత్రిలో ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మీరు వాదిస్తున్నది పూర్తిగా వాస్తవానికి దూరంగా ఉంది. ఆసుపత్రుల్లో ఉన్న కుక్కల గురించి గొప్పగా చెప్పకండి. అలాగే, కలర్ కోడింగ్ కాలర్స్‌ మనకు సాధ్యమవుతాయా? వాటిని అనుసరిస్తున్న దేశాల జనాభా ఎంత?’’ అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 09 Jan 2026 16:51 IST

English Translation

Sharmila Tagore: That actress' claim is far from reality..Supreme court on stray dogs issue

Eenadu icon
By National News Team Updated : 09 Jan 2026 20:34 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Internet Desk: Stray Dogs Dogs) is being investigated in the Supreme Court for a few days. In the latest trial, the Supreme Court objected to the argument of Bollywood's yesteryear actress Sharmila Tagore. She commented that her explanation is far from reality.

Supreme Court (Supreme Court) is hearing several petitions in the wake of an alarming increase in dog bite incidents in the country. Actress Sharmila Tagore approached the court questioning the decision to treat all of these stray dogs as aggressive. In this context, the lawyer for the actress argued in the court that the attack dogs should be identified by a special committee. It was mentioned on this occasion that a dog named 'Goldie' has been staying there for many years in Delhi AIIMS and it has never troubled the people. It is also advised to use color coding collars for biting dogs. If such a thing happens in the hospital, the consequences can be serious. What you are arguing is completely far from reality. Don't brag about dogs in hospitals. Also, are color coding collars possible for us? What is the population of countries that follow them?'' asked the Supreme Court.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 09 Jan 2026 16:51 IST