Andhra news: తితిదే బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 09 Jan 2026 17:26 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు, తితిదే బోర్డు ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడికి పంపించినట్లు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ‘‘2005లో తిరుమల బాలాజీనగర్‌లో ప్లాట్‌ నెంబరు-2ను డొనేషన్‌ స్కీం కింద 500 గజాల స్థలం కేటాయించారు. ఇందులో 12 గదులతో అతిధి గృహం నిర్మించేందుకు ట్రస్టు ఏర్పాటు చేశా. ఒక గది మినహా మిగిలిన 11 గదులు భక్తులకు ఇచ్చేందుకు, నిర్వహణ ట్రస్టు చూసేలా.. ఒక గది ట్రస్టుకు ఉండేలా ప్రణాళిక రూపొందించాం. అప్పట్లో డబ్బులు సర్దుబాటు కాక నిర్మాణం ప్రారంభించలేకపోయా. డొనేషన్‌ చెల్లింపునకు గడువు పెంచాలని కోరా.. ఆ మేరకు జీవో కూడా జారీ అయింది.

ఈవోగా ధర్మారెడ్డి ఉన్న సమయంలో రూ.60 లక్షల వరకు డొనేషన్‌ చెల్లించా. అప్పట్లో నేను తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో.. నా డొనేషన్‌ వెనక్కి ఇచ్చేసి, ప్రతిపాదన తిరస్కరించారని చెప్పారు. బోర్డు సభ్యుడిగా నాకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు, భక్తి భావంతో స్థలం తనకు రీ ఎలాట్‌ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశా. ఈ విషయాన్ని పరిశీలన కోసం తితిదే బోర్డుకు పంపారు. బోర్డులో.. భానుప్రకాష్‌రెడ్డి మినహా మిగతా సభ్యులంతా సమ్మతించారు. ఈ తీర్మానం ప్రభుత్వానికి పంపించారు. బోర్డు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. బోర్డులో అంతర్గతంగా జరుగుతున్న చర్చపై ఓ పత్రికలో నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కథనం రావడంతో మనస్తాపం చెందా. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఇబ్బంది రాకూడదనే రాజీనామా చేశా. స్థలం రీఎలాట్‌ విషయంలో మంత్రివర్గ సమావేశంలో ఏం చర్చ జరిగిందో నాకు తెలియదు’’ అని జంగా కృష్ణమూర్తి తెలిపారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :