MEA on USA: మోదీ - ట్రంప్‌ ఎనిమిది సార్లు మాట్లాడుకున్నారు: భారత్‌

Eenadu icon
By National News Team Published : 09 Jan 2026 17:31 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi) నేరుగా మాట్లాడకపోవడమే వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చకపోవడానికి కారణమని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌ చేసిన వ్యాఖ్యలపై భారత్‌ స్పందించింది. ఇరుదేశాలకు సంబంధించి వివిధ అంశాల్లో గతేడాది ప్రధాని మోదీ, ట్రంప్‌ ( Donald Trump) ఎనిమిది సార్లు ఫోన్‌లో సంభాషించుకున్నారని భారత విదేశాంగ శాఖ (MEA) స్పష్టం చేసింది. రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా అదనపు ఆంక్షలు విధించే బిల్లుపైనా అవగాహన ఉందని, పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది.

కట్టుబడి ఉన్నాం..

‘‘అమెరికా వాణిజ్య మంత్రి వ్యాఖ్యలు చూశాం. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు గతేడాది ఫిబ్రవరి 13 నాటికే ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయి. అప్పటి నుంచి పరస్పర ప్రయోజనం చేకూరే వాణిజ్య ఒప్పందం కోసం ఇరుపక్షాలు పలుమార్లు సంప్రదింపులు జరిపాయి. వీటి గురించి అమెరికా వాణిజ్య మంత్రి వ్యాఖ్యల్లో స్పష్టత లేదు. అనేకసార్లు ఒప్పందానికి దగ్గరగా వచ్చాం. ఇప్పటికీ దీనిపై ముందుకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నాం. గతేడాది  ఎనిమిది సందర్భాల్లో ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌ ఫోన్‌లో సంభాషించుకున్నారు’’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ పేర్కొన్నారు.

మైనార్టీల్లో మరింత భయం..

‘‘బంగ్లాదేశ్‌లో మైనార్టీలు, వారి ఇళ్లు, వ్యాపారాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఈ అంశాన్ని గతంలోనే ప్రస్తావించాం. వీటిని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత లేదా రాజకీయ వివాదాలుగా కొట్టిపారేసే ప్రయత్నాలు చేస్తే నేరస్థులు మరింత రెచ్చిపోయేందుకు కారణమవుతాయి. మైనార్టీల్లో మరింత భయాన్ని, అభద్రతా భావాన్ని పెంచుతాయి’’ అని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.

ఇంధన భద్రతే ముఖ్యం..

అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టనున్న 500 శాతం సుంకాల విధింపు బిల్లు గురించి అవగాహన ఉందని, ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని భారత్‌ వెల్లడించింది. చమురు అంశంపై తమ వైఖరి అందరికీ తెలిసిందేనని పేర్కొంది. ప్రపంచ మార్కెట్ల పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తున్నట్లు తెలిపింది. భారతీయుల ఇంధన భద్రత కాపాడటం తమ బాధ్యత అని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఈశాన్య భారతంలో చరిత్రాత్మక ఘట్టం దేశ రక్షణ వ్యూహంతో పాటు బహుళ ప్రయోజనాలు ఇమిడి ఉన్న ఒక చరిత్రాత్మక ఘట్టం శనివారం ఆవిష్కృతమైంది.
  • ఇక జనరల్‌ బోగీల్లోనూ నిరంతరం శుభ్రత రైల్వే శాఖలో కొత్త సంస్కరణల్లో భాగంగా ఇకమీదట రిజర్వ్‌ బోగీలతోపాటు జనరల్‌ బోగీల్లోనూ ప్రతి గంటకోసారి శుభ్రత కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.
  • రూపాయి డాక్టర్‌శంకరం రూపాయి ఇస్తే చిన్నపిల్లలు కూడా తీసుకోని ఈ రోజుల్లో.. ఒడిశాకు చెందిన డాక్టర్‌ శంకర్‌ రామచందాని కేవలం ఒక్క రూపాయి ఫీజుతో పేదలకు ఆరోగ్య పరీక్షలతోపాటు వైద్యసేవలు అందిస్తున్నారు.
  • పదినెలల ఈ చిన్నారి.. నలుగురికి జీవనదాత కేరళకు చెందిన ఈ చిన్నారి చిరుప్రాయంలోనే నలుగురికి జీవనదాతగా మారింది.
  • రాహుల్‌కు ఆర్థికవ్యవస్థపై అవగాహన లేదు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి భారత ఆర్థికవ్యవస్థపై అవగాహన లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఎద్దేవా చేశారు.
  • ‘ఎన్సీపీ’ల విలీనం లేనట్లే వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ పోటీచేసే యోచనలో ఉన్నట్లు శివసేన(యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ వెల్లడించారు.
  • నగరాలకు అభివృద్ధి కవచం నగరాలు, పట్టణాల్లో సదుపాయాల అభివృద్ధికి కేంద్రం ప్రకటించిన కొత్త పథకం కింద చేపట్టే ప్రాజెక్టుల వ్యయంలో కనీసం 50% మొత్తాన్ని మార్కెట్‌ నుంచి సేకరించాల్సి ఉంటుంది.
  • మేడతో పోటీగా ఎదిగిన బెండ సాధారణంగా బెండ మొక్క నాలుగైదు అడుగుల ఎత్తు ఎదుగుతుంది. పశ్చిమబెంగాల్‌లో బీర్‌భూం జిల్లా బోల్‌పుర్‌లోని మహమ్మద్‌ జమీరుల్‌ హక్‌ అనే న్యాయవాది ఇంటి ఆవరణలో అనూహ్యంగా పెరిగింది.
  • ఉద్యోగి అంటే కట్టుబానిస కాదు ఉద్యోగ నియామక ఒప్పందంలో ఏవైనా షరతులు ఉండి అడ్డుపడితే మినహా ఉద్యోగి రాజీనామా లేఖను యాజమాన్యం ఆమోదించాల్సిందేననీ కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.
  • మీరు ఎలాంటి వారితో గడపాలంటే.. గొప్ప లక్ష్యం ఉన్నవారితో సన్నిహితంగా మెలిగితే మీలోనూ ఆ స్ఫూర్తి రగులుతుంది. అందుకే ఎల్లప్పుడూ మీకన్నా పెద్ద లక్ష్యాలు ఉన్నవారితోనే ఎక్కువగా గడపండి.
  • ఏఐపై రేపటి నుంచి శిఖరాగ్ర సదస్సు దక్షిణార్థగోళ దేశాలకు కృత్రిమ మేధ (ఏఐ) అందుబాటులోకి తీసుకురావడం, ఉన్నతస్థాయి సాంకేతికతల్ని ప్రజాస్వామ్యీకరించేందుకు మార్గాలు అన్వేషించడం ధ్యేయంగా ఐదు రోజులపాటు జరిగే శిఖరాగ్ర సదస్సు సోమవారం దిల్లీలో ప్రారంభం కానుంది.
  • ఫీజు వాపసు ప్రకటించిన ఫిట్‌జీ ఫీజు వాపసు ప్రకటించిన ఫిట్‌జీ
  • అమెరికాతో వాణిజ్య ఒప్పందం మన పత్తి రైతులకు నష్టమే అమెరికాతో నరేంద్ర మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న మధ్యంతర వాణిజ్య ఒప్పందం భారత దేశ పత్తి రైతులను, జౌళి పరిశ్రమను నిలువునా ముంచేస్తుందని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ శనివారం ఆందోళన వ్యక్తం చేశారు.
  • పీఎం రాహత్‌ పథకం ప్రారంభం రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించే లక్ష్యంతో తీసుకువచ్చిన ప్రధానమంత్రి రోడ్డు ప్రమాద బాధితుల ఆసుపత్రి, చికిత్స భరోసా(పీఎం రాహత్‌) పథకాన్ని  కేంద్రం శనివారం అధికారికంగా ప్రారంభించింది.
  • సంక్షిప్త వార్తలు (9) బుకర్‌ ప్రైజ్‌ విజేత, రచయిత్రి అరుంధతీ రాయ్‌ బెర్లిన్‌ చలన చిత్రోత్సవం నుంచి తప్పుకొన్నారు.
  • నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/02/2026) ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
  • పది నెలల చిన్నారి.. ఐదుగురికి ప్రాణదాత కేరళకు చెందిన ఓ పది నెలల చిన్నారి.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను వైద్యులు బ్రెయిన్‌ డెడ్‌గా ప్రకటించారు.
  • అవాస్తవాలను ప్రచారం చేయడమే రాహుల్‌ సిద్ధాంతం: అమిత్‌ షా అవాస్తవాలను ప్రచారం చేయడమే ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) సిద్ధాంతమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah) విమర్శించారు.