వందేభారత్‌లా నిధులు.. పాసింజర్‌లా పనులు

Eenadu icon
By Andhra Pradesh Dist. Desk Updated : 04 Jan 2026 06:45 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు కేంద్ర ప్రభుత్వం అమృత్‌ భారత్‌  పథకాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా 2023 డిసెంబరులో ఏలూరు రైల్వే స్టేషన్‌ పనులు చేపట్టారు. రెండేళ్లు దాటినా ఇంత వరకు పూర్తి కాలేదు. దీని వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏలూరు రైల్వే స్టేషన్‌ నుంచి నిత్యం సగటున 8,761 మంది వరకు ప్రయాణిస్తుంటారు. 61 రైళ్లు ఈ స్టేషన్‌ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి చేసేందుకు కేంద్రం రూ.21.30 కోట్లు విడుదల చేసింది. విజయవాడ సర్కిల్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పనులు ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. 

అభివృద్ధి ఇలా..

రైల్వేస్టేషన్‌ లోపల ప్లాట్‌ఫాంలు నవీకరిస్తారు. బయట సువిశాలమైన స్థలంలో వాహనాల పార్కింగ్‌ షెడ్లతో పాటు ప్రవేశ ద్వారాన్ని సుందరంగా నిర్మిస్తారు. ప్రయాణికులు వేచి ఉండే విశ్రాంతి గదుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తారు. ప్లాట్‌ఫాంల నవీకరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రవేశ ద్వారం అసంపూర్తిగా ఉంది. పార్కింగ్‌ షెడ్ల నిర్మాణం పూర్తికాలేదు. రెండో విడతలో ఎస్కలేటర్, రైల్వే ఆసుపత్రి, పార్శిల్‌ కార్యాలయం నిర్మిస్తారు. తొలి విడత పనులు పూర్తయితేనే వీటికి నిధులు వస్తాయి. రైల్వేస్టేషన్‌ ఇన్‌ఛార్జి రమేశ్‌ మాట్లాడుతూ ఫిబ్రవరి నెలాఖరు నాటికి తొలి విడత పనులు పూర్తవుతాయని తెలిపారు. 

► Read latest West godavari Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 04 Jan 2026 06:41 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • అందాల గోదారి.. చిత్రీకరణలకు పూలదారి! [ 18-02-2026] ‘30 ఇయర్స్‌ ఇండస్ట్రీ ఇక్కడ’ అంటూ వెండితెరపై తన హాస్యపు ఖడ్గం దూసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు బాలిరెడ్డి పృథ్వీరాజ్‌.
  • మార్గం సుగమం.. పశ్చిమకు మణిహారం [ 18-02-2026] జిల్లాలో జాతీయ రహదారి 216 రహదారికి ఉన్న అవరోధాలు తొలగాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసేందుకు వశిష్ఠ గోదావరిపై దశాబ్దాల కిందట తలపెట్టిన వంతెన నిర్మాణానికి న్యాయపరమైన చిక్కులు వీడాయి.
  • అడ్డంగా వస్తాయ్‌.. ప్రమాదంలో పడేస్తాయ్‌ [ 18-02-2026] రహదారిపై అకస్మాత్తుగా వచ్చే కుక్కలను తప్పించబోయి ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. సమస్య చిన్నదిగా అనిపించినా... వాటిని తప్పించే క్రమంలో నియంత్రణ కోల్పోయి కిందపడి కొందరు గాయాల పాలవుతుంటే..
  • ప్రేమికుడి ఇంటి ఎదుట నిరసన [ 18-02-2026] ఫేస్‌బుక్‌తో పరిచయమైన ఓ జంట ప్రేమ నిశ్చితార్థం వరకు చేరుకుంది. కట్నకానుకలను జేబులో వేసుకొని.. తీరా పెళ్లికి నిరాకరించాడు ఆ ప్రేమికుడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.
  • అద్దెకు శేషమహల్‌ రహదారి [ 18-02-2026] తాడేపల్లిగూడెం పట్టణంలో అత్యంత ప్రధానమైన ప్రాంతాల్లో శేష్‌మహల్‌ రోడ్డు ఒకటి. కీలకమైన ఈ మార్గాన్ని ఎక్కడికక్కడ ఆక్రమించేస్తుండడంతో రోజురోజుకూ కుచించుకుపోతోంది. ఉదయం 9 నుంచి 11, సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్య ఆ రోడ్డులో రాకపోకలకు వాహనదారులు హడలిపోతున్నారు.
  • రొయ్యా.. రైతు మీసం మెలేయాలి [ 18-02-2026] ఉమ్మడి జిల్లాలో రొయ్యల రైతులు వేసవి పంటపై ఆశలు పెంచుకున్నారు. కొన్నిరోజులుగా మంచు, చలిగాలుల ప్రభావం తగ్గుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
  • ఆసుపత్రులకు ప్రాణదాతలు కావలెను [ 18-02-2026] తణుకు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆర్‌.ఎం.వో డాక్టర్‌ ఎ.వి.ఆర్‌.ఎస్‌ తాతారావు విధుల్లో ఉండగానే అస్వస్థతకు గురయ్యారు. ఈసీజీ తీయించుకున్నారు. ఇంటికి వెళ్తుండగా గుండెపోటుతో మార్గమధ్యలోనే మృతి చెందారు.
  • ఆదివారమండి.. ఆనందించండి! [ 18-02-2026] గత తెదేపా ప్రభుత్వ హయాంలో నగర, పట్టణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యం, ఆహ్లాదం పంచడానికి ‘ఆనంద లహరి’ అమలు చేశారు. అప్పట్లో కార్యక్రమానికి ఏలూరు నగరవాసుల నుంచి ఆదరణ లభించింది. వైకాపా ప్రభుత్వం దీన్ని నిలిపేసింది.
  • రైతన్నా.. ఇదిగో నీకో యాప్‌! [ 18-02-2026] రైతులకు తక్షణ సేవలు సమర్ధంగా అందించడానికి వ్యవసాయశాఖ ఆంధ్రప్రదేశ్‌ అగ్రికల్చర్‌ ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఏపీఏఐఎంఎస్‌ 2.0 APAMIS 2.0) పేరుతో చరవాణి యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.