Visakhapatnam: అందరూ చూస్తుండగా రైలు కింద పడి ఆత్మహత్య

Eenadu icon
By Crime News Desk Updated : 04 Jan 2026 06:12 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

విశాఖపట్నం (కూర్మన్నపాలెం), న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ మాజీ సైనికుడు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు చూస్తుండగా రైలు కింద ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రమాదం ధాటికి తమ కళ్ల ముందే ఆ వ్యక్తి మొండెం, తల వేరయిపోవడంతో అందరూ భయంతో వణికిపోయారు. విశాఖ సమీప దువ్వాడ రైల్వేస్టేషన్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధ్యాహ్నం 1.10 గంటల సమయంలో హావ్‌డా-బెంగళూరు ప్రత్యేక రైలు ఒకటో ప్లాట్‌ఫాం మీదకు వస్తోంది. ఇంతలో ఫ్లాట్‌ఫాంపైన కూర్చున్న ఓ వ్యక్తి గబగబా వెళ్లి పట్టాలపై తల పెట్టి పడుకోవడంతో రైలు అతడి మీద నుంచి వెళ్లిపోయింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుణ్ని విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నెల్లిముక్కుకు చెందిన నీలాపు వెంకటరమణారెడ్డి (65) అలియాస్‌ సైనికుడిగా గుర్తించారు. కొంతకాలం సైన్యంలో పనిచేసిన ఆయన.. పదవీ విరమణ తర్వాత ఉక్కు కర్మాగారంలో ఉద్యోగం చేశారు. గతంలో తెదేపా సైనికుల విభాగం అధ్యక్షుడిగానూ సేవలందించారు. ప్రస్తుతం కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, వివాహితులైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శనివారం మధ్యాహ్నం వరకు కిరాణా దుకాణం నిర్వహించిన వెంకటరమణారెడ్డి.. తర్వాత రైల్వేస్టేషన్‌కు వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గత కొన్నాళ్లుగా ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా.. ఆ ఒత్తిడితోనే ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.

► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 04 Jan 2026 05:25 IST

English Translation

Visakhapatnam: Suicide by falling under train while everyone was watching

Eenadu icon
By Crime News Desk : 04 Jan 2026 06:12 IST Updated Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Visakhapatnam (Kurmannapalem). Newstoday: An ex-serviceman, who was facing financial difficulties, committed suicide under a train at a railway station while passengers were watching. Everyone trembled with fear as the man's torso and head were separated in front of their eyes due to the accident. The incident took place on Saturday at Duvwada railway station near Visakhapatnam. According to the details of the Railway Police, the Havda-Bangalore special train is coming to the platform at 1.10 pm. Meanwhile, a man sitting on the platform went mad and lay down with his head on the rails, and the train ran over him. He died on the spot.

The deceased was identified as Neelapu Venkataramana Reddy (65) alias Sainik from Nellimukku of Pedagantyada mandal of Visakha district. He served in the army for some time. After retirement, he worked in a steel factory. Earlier he also served as the president of TDP soldiers' wing. Currently running a grocery store. He has a wife and two married daughters. Venkataramana Reddy, who ran the grocery shop till Saturday afternoon, then came to the railway station and committed this crime. While he was in financial trouble for the past few years, it is believed that he committed suicide under that pressure.

► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 04 Jan 2026 05:25 IST