ఆసుపత్రిలో స్నానమంటే వణుకే..

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

శీతాకాలం ప్రభావంతో ఉదయం 10 గంటలు దాటినా చలి వణికిసో్తంది. సాయంత్రం 5గంటల నుంచే వణుకు మొదలవుతోంది. సాధారణ ప్రజలే ప్రస్తుతం చన్నీళ్లతో స్నానం చేయలేని పరిస్థితి. అలాంటిది బాలింతలు, పసికందుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలవుతున్న పేద బాలింతలు వణికి పోతున్నారు.
- అమలాపురం ఏరియా ఆసుపత్రిలో నెలకు సరాసరి 80 నుంచి 90 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రసూతి వార్డులో నిత్యం 25 నుంచి 30 మంది చికిత్స పొందుతున్నారు. ప్రసవాల సమయంలో పసికందులకు శస్త్రచికిత్స గదిలో ఉన్న గీజర్ నుంచి కొద్దిగా వేడినీళ్లు తీసుకొచ్చి శుభ్రం చేసి కుటంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. మళ్లీ వారు ఇంటికి వెళ్లే వరకు ఆ మాటే ఉండట్లేదు.
- రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో నెలకు 80 నుంచి 100 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. సోలార్ వ్యవస్థ ద్వారా గీజర్లు పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. కానీ వారంలో రెండు రోజులు మాత్రమే పని చేస్తుంది. మిగిలిన రోజుల్లో బాలింతలకు ఇక్కట్లు తప్పట్లేదు.
జిల్లాలో రెండు ఏరియా ఆసుపత్రులు, 9 సీహెచ్‌సీలు, 53 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఏరియా ఆసుపత్రుల్లో రోజుకు 5 నుంచి 6 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. సాధారణ ప్రసవమైనా, శస్త్రచికిత్స చేసినా కనీసం మూడు రోజులు బాలింతల వార్డులో ఉంచుతారు. వీరికి సాధారణ అవసరాలకు కూడా వేడినీరు అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. రెండుచోట్ల వేడి నీళ్లు అందించేందుకు ఏర్పాటు చేసిన గీజర్లు పాడయ్యాయి. సీహెచ్‌సీల్లో కూడా ఇదే పరిస్థితి.
వీటిపై దృష్టిసారిస్తేనే..
ఏరియా ఆసుపత్రుల్లో ప్రసవాలు జరుగుతున్న బాలింతల అవసరాలకు వేడినీరు కోసం ఆసుపత్రి బయట ఉన్న హోటళ్లు, ఇతర చోట్ల నుంచి నగదు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. దీనికోసం రోజుకు రూ.50 నుంచి రూ.100 వరకు ఖర్చు చేస్తున్నారు. అది ఖర్చు చేయలేని వారు చన్నీళ్లతోనే సరిపెట్టుకుంటున్నారు.
మరమ్మతులు చేయిస్తాం..
బాలింతల వార్డుకు సంబంధించి వేడినీళ్లు అందించే యంత్రాలకు మరమ్మతులు చేయిస్తాం. ఇక్కడ చికిత్స పొందుతున్న వారికి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.
వివరాలు
ఏరియా ఆసుపత్రులు: 02 సీహెచ్‌సీలు: 7 పీహెచ్‌సీలు: 47 నెలవారీ ప్రసవాలు: 350 నుంచి 400 వరకు
► Read latest East godavari Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- రక్షణ కళ్లు.. విస్మరిస్తే సంకెళ్లు..! [ 18-02-2026] నగరం రోజురోజుకు ట్రాఫిక్ పద్మవ్యూహం అవుతోంది. మరోవైపు నేరాలు సైతం పెరుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయడానికి పోలీసుశాఖ సాంకేతికత సాయంతో వినూత్న అడుగులు వేస్తోంది.
- స్త్రీ శక్తి.. అనుబంధాల మజిలీ..! [ 18-02-2026] పండగకు తప్ప మిగతా రోజుల్లో పుట్టింటికి వెళ్లాలన్నా.. బంధువుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు హాజరుకావాలన్నా గతంలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లోని మహిళలు కాస్తా ఆలోచించే పరిస్థితి ఉండేది.
- 11 రోజులు రూ.19 కోట్లు.. [ 18-02-2026] జాతీయ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి ఇంకా 11 రోజులే గడువుంది. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేసి మార్చి 15లోగా బిల్లులు అప్‌లోడ్ చేయాల్సి ఉంది.
- గట్లు గుల్ల.. పర్యవేక్షణ డొల్ల [ 18-02-2026] ప్రకృతి వనరులు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. 30 అడుగుల కాలువ గట్లను సైతం మాయం చేస్తున్నారు. గుట్టలను గుల్ల చేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదనే విమర్శలు ఉన్నాయి.
- చుట్టుముట్టిన గోదావరి [ 18-02-2026] పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ (వెనుక జలాలు) కారణంగా వారం రోజులుగా గోదావరి పెరుగుతూనే ఉంది. మంగళవారం సాయంత్రానికి అడుగు మేర నీటి మట్టం పెరగడంతో గండిపోశమ్మ ఆలయాన్ని వరద చుట్టుముట్టింది.
- రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ప్రసవం [ 18-02-2026] రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్‌లో నిండు గర్భిణి అయిన ఒక ప్రయాణికురాలు ఆడబిడ్డను ప్రసవించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వే వెద్యసిబ్బంది ఆమెకు ప్లాట్‌ఫామ్‌పైనే వైద్యసేవలు అందించి తల్లీబిడ్డ క్షేమంగా ఉండేలా చూశారు.
- స్వయం ఉపాధికి ఊపిరి [ 18-02-2026] వైకాపా పాలనలో వివిధ కులాలకు సంబంధించిన కార్పొరేషన్లను అలంకార ప్రాయంగా మార్చేశారు. నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేశారు. నిరుద్యోగ యువత ఉపాధి పొందేలా రుణాలు కల్పించేందుకు పైసా విదల్చలేదు.
- విమానాశ్రయం.. అడుగులెటు! [ 18-02-2026] జిల్లాలో అన్నవరం-తుని మధ్య గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణంపై ఊగిసలాట కొనసాగుతోంది. గతంలో ఇక్కడ ప్రతిపాదనకు స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. భూములు ఇవ్వలేమని ఆందోళనలు చేపట్టారు.
- పాఠశాలా.. పాట్లు చాలా..! [ 18-02-2026] జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేయడానికి ఉపాధ్యాయులు, చదువుకునేందుకు విద్యార్థులు భయాందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. శిథిల భవనాలు, ప్రమాదకర ప్రాంతాల్లో పాఠశాలలు ఉండడంతో తమ పిల్లలకు.