‘ఈశాన్యం’.. ఎంతో విశేషం!

Eenadu icon
By Andhra Pradesh Dist. Desk Published : 04 Jan 2026 03:36 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: దేశంలో భిన్న భాషలు, సంస్కృతులు ఉన్నా అంతా ఒక్కటే అన్న భావన నేటి తరాలకు కల్పించాలని కేంద్ర ప్రభుత్వంలోని ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ అభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్ణయించింది. గత నెల 15 నుంచి 28వ తేదీ వరకు అసోం రాజధాని గువాహటి ఐఐటీలో ‘యూత్‌ ఎక్స్ఛేంజ్‌’ కార్యక్రమం నిర్వహించింది. దీనికి మన రాష్ట్రం నుంచి ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని ఆహ్వానించింది. ఏయూ పరిధిలోని ఏడు కళాశాలల నుంచి వాక్‌చాతుర్యం కలిగి, ఎన్‌ఎస్‌ఎస్‌లో ఉత్తమ ప్రతిభ చూపిన 20మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో ముగ్గురు పాడేరు ప్రాంత గిరిజన విద్యార్థులున్నారు. వీరితోపాటు వెళ్లిన సమన్వయకర్తలకు విమాన ప్రయాణ సౌకర్యం కల్పించారు.

గవర్నర్‌తో సమావేశం

అసోం రాష్ట్రానికి మన రాష్ట్రంతో పాటు హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి మరో 20మంది విద్యార్థులు కలిసి మొత్తం 40మంది వెళ్లారు. మన రాష్ట్ర విద్యార్థులు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా దుస్తులు ధరించి, థింసా నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. అసోం గవర్నర్‌ లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య విద్యార్థులను సత్కరించి జ్ఞాపికలు, తాను సంతకం చేసిన ‘ద పవర్‌ ఆఫ్‌ యువర్‌ సబ్‌కాన్సియస్‌ మైండ్‌’ అనే పుస్తకాన్ని బహూకరించారు.

నగరం నుంచి ఆదిత్య బిజినెస్‌ స్కూల్‌ బీబీఏ విద్యార్థిని అల్లు వెంటనాగసాయి, ఆ-సిబ్‌ బీబీఏ విద్యార్థి ద్వారపురెడ్డి బుచ్చయ్యనాయుడు,  ఏయూ ఫార్మా విద్యార్థులు ఎం.ఎస్‌.ఎల్‌.వి.సృజన, విశ్వనాథపల్లి రవి, ఏవీఎన్‌ కళాశాల బీఏ విద్యార్థిని ఎం.భువనేశ్వరి పాల్గొన్నారు.

పరిశీలించినవి.. నేర్చుకున్నవి ఇలా..

  • అసోం రాష్ట్ర అధికార భాష ఆంగ్లం. బ్రిటీష్‌ పాలనకు పూర్వం ఆ ప్రాంతం అహోం రాచరికంలో ఉండేది.
  • భావ ప్రకటన నైపుణ్యం, ఆత్మ విశ్వాసం పెరిగింది.
  • మేఘాలయలో జంటకు వివాహమైతే భార్య ఇంటి పేరు భర్తకు వర్తిస్తుంది. అలాగే తల్లిదండ్రుల ఆస్తి ఆడపిల్లకు చెందుతుంది.
  • హిమాచల్‌ప్రదేశ్‌ విద్యార్థులతో కలిసి వంటకం (థాలి) తయారు చేశారు.
  • ఒకరోజు మధ్యాహ్నం బ్రహ్మపుత్ర నదిలో పడవపై భోజనం చేయడం అద్భుత అనుభూతి ఇచ్చింది.
  • అక్కడి ప్రజలు 70 నుంచి 80శాతం వెదురు ఉత్పత్తులు వినియోగిస్తున్నారు. వెదురును హెర్బల్‌ మెడిసిన్‌గా వాడుతున్నారు. పొబితోరా అభయారణ్యంలో ఖడ్గమృగం, రెడ్‌ పాండా వంటి జంతువులు ఆకట్టు కుంటున్నాయి. 
► Read latest Visakhapatnam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ‘నౌకా’ సంరంభం..సాగర సంభ్రమం..! [ 18-02-2026] అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ(ఐఎఫ్‌ఆర్‌)లో భాగంగా ఆర్కేబీచ్‌ కేంద్రంగా నిర్వహించే సిటీ పరేడ్, నౌకాదళం విన్యాసాలు, ఫైర్, డ్రోన్‌ షోల నిర్వహణకు రంగం సిద్ధమైంది. బుధవారం నమూనా విన్యాసాలు నిర్వహించి, గురువారం పూర్తిస్థాయి ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
  • శ్రమించారు.. సాధించారు! [ 18-02-2026]  జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. మంచి ప్రణాళిక.. ఉపాధ్యాయుల మార్గదర్శనం.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయం సాధించామని విద్యార్థులు తెలిపారు. ఐఐటీ లక్ష్యంగా చదువుతున్నామని చెప్తున్నారు. 
  • సంద్రంలో ‘బలగం’.. శత్రు దుర్భేద్యం...! [ 18-02-2026] గాలిలో.. నీటిపైన.. సముద్రం అడుగున రక్షణ కవచంలా పనిచేసే ఆయుధ సంపత్తి తూర్పు నౌకాదళం ప్రత్యేకం. అందులో యుద్ధనౌకలతోపాటు జలాంతర్గాములు, ఫ్రిగేట్లు, డిస్ట్రాయర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి
  • ఉన్నత చదువులకు అండగా.. ‘విద్యా లక్ష్మి’! [ 18-02-2026] ఉన్నత చదువులకు వెళ్లాలని ఉన్నా.. ఆర్థిక సమస్యల కారణంగా పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి. అలాంటి వారికి ‘ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి’ పథకం ఆసరాగా నిలుస్తోంది.
  • ‘మలుపు’ల్లో..అడుగడుగునా అక్రమాలు! [ 18-02-2026] రుషికొండ వద్ద నేరుగా వెళ్లాల్సిన రోడ్డు ఓ రిసార్టు, కన్వెన్షన్‌ సెంటర్‌ వద్దకు వెళ్లేసరికి మెలికలు తెరిగింది. వైకాపా నేతల ఒత్తిళ్లకు తలొగ్గి సామాన్యుల ఆస్తుల మీదుగా అలైన్‌మెంట్‌ వెళ్లేలా చేశారు.
  • ఇక తరగతులకు డుమ్మా కొట్టలేరు..! [ 18-02-2026] అనుబంధ కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకులు సక్రమంగా తరగతులు, విధులకు హాజరయ్యేలా ఆంధ్రవిశ్వవిద్యాలయం చర్యలకు ఉపక్రమించింది
  • నాణ్యత డొల్ల.. రోడ్డు గుల్ల [ 18-02-2026] గత ప్రభుత్వంలో నాయకులు అందిన కాడికి జేబులు నింపుకొనే ప్రయత్నాల్లో భాగంగా రోడ్ల నిర్మాణాల్లో అధికారులతో కలిసి నాణ్యతకు నీళ్లొదిలేశారు. దాని ఫలితం ఇప్పుడు కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది.
  • పరిశ్రమల ప్రవాహం.. ఉపాధికి ప్రోత్సాహం [ 18-02-2026] కూటమి పాలనలో జిల్లాకు పారిశ్రామిక కళ వచ్చింది. అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం పరిశ్రమలు, ఉపాధిపై దృష్టిసారించడంతో జిల్లా ముఖచిత్రమే మారిపోతోంది.
  • కనుమరుగైపోతున్నా.. కన్ను తెరవరా..? [ 18-02-2026] పెందుర్తి మండలంలోనే అత్యధికంగా ధర పలుకుతున్న భూములున్న సుజాతనగర్‌ కాలనీ సమీప రాజుచెరువు కనుమరుగైపోయే దుస్థితి నెలకొంది.
  • కోర్టు హాల్లో కుప్పకూలిన మహిళ [ 18-02-2026] కుటుంబ గొడవల నేపథ్యంలో మంగళవారం వాయిదాకు హాజరైన మహిళా కక్షిదారు కోర్టు హాల్లోనే కుప్పకూలిపోవడంతో ప్రధాన కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి కె.రాధారత్నం స్పందించారు.