బాబు పాలనలో  ప్రజాస్వామ్యం అపహాస్యం

బాబు పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు

ఉషశ్రీ చరణ్‌

పెనుకొండ రూరల్‌:చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్‌ మండిపడ్డారు. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్‌లో ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో విప్‌ జారీ చేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌ సీపీ నేతలపై జరిగిన దాడి ఇందుకు నిదర్శనంగా నిలిచిందన్నారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 5వ తేదీన బొమ్మనహాళ్‌ ఎంపీపీ ఎన్నిక ఉండగా.. విప్‌ జారీ చేసేందుకు శనివారం ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులు దాడి చేశారన్నారు. అడ్డుకోబోయిన వైఎస్సార్‌సీపీ నాయకులపై కూడా విచక్షణ రహితంగా దాడులకు పాల్పడ్డారని ఉషశ్రీచరణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బొమ్మనహాళ్‌ మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలుండగా.. 15 మంది వైఎస్సార్‌సీపీ బీఫారంపై గెలిచారన్నారు. కేవలం ఒక ఎంపీటీసీతో ఎంపీపీ స్థానాన్ని కై వసం చేసుకునేందుకు టీడీపీ దిగజారుడు రాజకీయం చేస్తోందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నిక జరిపించాల్సిన పోలీసులు కూడా ప్రేక్షకపాత్ర వహించడం రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు నిదర్శనమన్నారు. అధికారం ఉంది కదా అని టీడీపీ కొత్త సంస్కృతికి తెర తీసిందని, కానీ భవిష్యత్‌లో వారికి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందన్న సంగతి గుర్తించాలన్నారు.