
నేర నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి
పుట్టపర్తి టౌన్:నేర నియంత్రణే లక్ష్యంగా ప్రతి పోలీస్ పనిచేయాలని ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశించారు. శనివారం స్థానిక సాయి ఆరామంలో ఎస్పీ అధ్యక్షతన అన్ని సబ్‌డివిజన్ల డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో వార్షిక నేర సమీక్షా సమావేశం జరిగింది. 2024– 25 సంవత్సరంలో కేసుల నమోదు, దర్యాప్తు, పెండింగ్ కేసుల్లో పురోగతి గురించి చర్చించిన ఎస్పీ సతీష్‌కుమార్ సిబ్బందికి దిశ నిర్దేశం చేశారు. అనంతరం 2025 సంవత్సరంలో అన్ని విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 8 మంది పోలీసులకు నామినేషన్ అవార్డులు అందజేశారు. అలాగే సత్యసాయి బాబా శత జయంతి ఉతత్సవాల్లో బాగా పనిచేసిన డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఐటీ కోర్‌టీం సిబ్బందికి షీల్డ్‌లు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... స్టేషన్ పరిధిలో చాలా కాలంగా పెడింగ్ ఉన్న వివిధ కేసుల్లో త్వరగా పురోగతి సాధించాలన్నారు. నేర నియంత్రణే ప్రథమ లక్ష్యంగా పనిచేస్తూ ప్రతి బాధితునికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. నూతన ఎస్‌ఐలు మరింత ఽబాధ్యతగా పనిచేయాలన్నారు. ప్రాపర్టీ నేరాలు కట్టడి చేస్తూ... రికవరీ శాతం పెంచాలన్నారు. మహిళలు, చిన్నపిల్లలపై జరిగే నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. చోరీల నివారణకు రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని, విజుబుల్ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
గ్రామాలు సందర్శించండి..
గ్రామ సందర్శనలు, పల్లె నిద్రలతో ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. సీసీ కెమెరాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించి దేవాలయాల్లో, వీధుల్లో, ఇళ్లల్లో ఏర్పాటు చేసుకొనే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఇప్పటికే వివిధ కేసుల్లో నిందితులుగా ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలిస్తున్న వారిపై పీడీ యాక్టు ప్రయోగించి, జిల్లా బహిష్కరణ చేస్తామని, ఈ మేరకు వివరాలు సిద్ధం చేయాలని ఎస్పీ ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురాన మహవీర్, పోలీసు న్యాయ సలహాదారు సాయినాథ్‌రెడ్డి, డీఎస్పీలు విజయకుమార్, మహేష్, హేమంత్‌కుమార్, నర్సింగప్ప, శివన్నారాయణస్వామి, ఇందిర, డీసీఆర్‌బీ సీఐ నరేంద్రరెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ సీఐ ఇస్మాయిల్, సీసీఎస్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి, ఐటీకోర్ టీమ్ ఇన్‌చార్జ్ సుదర్శన్‌రెడ్డి, ఏపీపీలు దుర్గాదేవి, అనురాధ, సుహాసిని, పద్మజతోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సిబ్బందికి ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశం

నేర నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి