Revanthreddy: ‘నీళ్లు-నిజాలు’పై చర్చ.. కేసీఆర్‌ సభకు ఎందుకు రాలేదు: సీఎం రేవంత్‌రెడ్డి

Eenadu icon
By Telangana News Team Published : 03 Jan 2026 19:52 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: కృష్ణానది ప్రాజెక్టులపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanthreddy) అన్నారు. శాసనసభలో ‘నీళ్లు-నిజాలు’పై జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా సీఎం మాట్లాడారు.

‘‘ఉమ్మడి రాష్ట్రంలో, గత పదేళ్లలోనూ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు అన్యాయం జరిగింది. ఎంతో అనుభవం ఉన్న మాజీ సీఎం సభకు వచ్చి సలహాలు, సూచనలు ఇస్తారనుకున్నా. కేసీఆర్‌.. నదీ జలాల గురించి మాట్లాడితే రాష్ట్రానికి ఉపయోగపడే సలహాలు చెప్తారనుకున్నా. సభల్లో మాట్లాడినదానికంటే.. అసెంబ్లీలో మాట్లాడే మాటలకు విలువ ఉంటుంది. రెండేళ్లుగా ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోవటం విచారకరం. గతంలో భారత రాష్ట్ర సమితి నేతలు అవమానించినా.. కాంగ్రెస్‌ నేతలు సభకు వచ్చి మాట్లాడేవారు. ప్రతిపక్ష నేతలు అసెంబ్లీలో మాట్లాడకుంటే .. అంతిమంగా ప్రజలకే అన్యాయం జరుగుతుంది. కృష్ణా జలాలపై చర్చను తెరపైకి తెచ్చిందే ప్రతిపక్ష నేత కేసీఆర్‌. పార్టీ కార్యాలయాల్లో మాట్లాడితే ప్రజల్లో గందరగోళం నెలకొంటుంది. అందుకే కేసీఆర్‌ మాట్లాడిన వెంటనే అసెంబ్లీలో చర్చ చేపట్టాం. కానీ, ఆయన మాత్రం సభకు రాలేదు. చట్టసభలంటే వారికి చిన్న చూపు’’ అని సీఎం అన్నారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :