Andhra News: అర్జీ ఆగొద్దు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 03 Jan 2026 06:19 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
6 min read

దీర్ఘకాలంగా భూ వివాదాలతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ల్యాండ్‌టైట్లింగ్‌ యాక్ట్‌ పేరుతో రీసర్వే చేసిన వైకాపా ప్రభుత్వం.. రైతుల భూములను కబ్జా చేసే కుట్రతో అనేక అవకతవకలకు పాల్పడింది. తప్పుల తడకలతో పాసుపుస్తకాలు ఇచ్చింది. వాటివల్ల గ్రామాల్లో భూ వివాదాలు చెలరేగి ఘర్షణలకు దారి తీశాయి. వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు అనేక చర్యలు చేపట్టారు.

రెవెన్యూ శాఖలో ప్రక్షాళన చర్యలు వేగవంతమయ్యాయి. వైకాపా ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన రీసర్వే సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెవెన్యూ క్లినిక్‌ల ఏర్పాటు ద్వారా ఎక్కడికక్కడే చికిత్స కూడా ప్రారంభించింది. తాజాగా 22ఎ జాబితాల నుంచి ప్రైవేటు భూముల తొలగింపు సహా మ్యుటేషన్‌ సేవలు, సర్వే నంబర్ల డూప్లికేషన్, నోషనల్‌ ఖాతాల్ని శాశ్వత ఖాతాలుగా మార్పు, ఆధార్‌ నంబర్ల సవరణ వరకు దీర్ఘకాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించే క్రమంలో ఇప్పటి వరకు సంయుక్త కలెక్టర్‌ (జేసీ) వద్ద ఉన్న అధికారాల్ని తహసీల్దార్లు, ఆర్డీవోలకు బదలాయిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ శుక్రవారం ఆదేశాలిచ్చారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఉద్దేశపూర్వక జాప్యం చేసినా, రెవెన్యూ/రిజిస్ట్రేషన్‌ దస్త్రాల్ని అప్‌డేట్‌ చేయకపోయినా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా భావించి వివరణ కోరతారని స్పష్టం చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించారు. రెవెన్యూ సదస్సులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌)లో వివిధ రకాల భూసమస్యలపై అర్జీలు వస్తున్నాయని.. వాటి పరిష్కారంలో భాగంగా పలు దఫాలుగా ఆర్డీవోలు, తహసీల్దార్లతో చర్చించి సమగ్ర ఆదేశాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సంతృప్తే కొలమానం అనే విషయాన్ని రెవెన్యూ అధికారులు, ఆర్డీవోలు, సంయుక్త కలెక్టర్లు, కలెక్టర్లు గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. మార్గదర్శకాలకు అనుగుణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, సీఎంఆర్‌ఓ విభాగాలు వెంటనే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

22ఎ అర్జీలన్నీ 3 నెలల్లో పరిష్కరించాల్సిందే

తమ భూముల్ని 22ఎ జాబితా నుంచి తొలగించాలంటూ వచ్చిన అర్జీలన్నీ మూడు నెలల్లో తప్పనిసరిగా పరిష్కరించాల్సిందే. రొటీన్‌గా వాటిని తిరస్కరించకూడదు. చట్టం, నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలు సహా స్పష్టమైన కారణాలు ఉదహరిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి.

  • నిర్దేశించిన 10 రకాల పత్రాల్లో ఏ ఒక్కటి ఉన్నా వాటి ఆధారంగా 22ఎ జాబితా నుంచి తొలగించవచ్చు. రకరకాల పత్రాలు, వాటి రికార్డులు కావాలని పట్టుబట్టకూడదు. ఒక రికార్డును పక్కన పెట్టాలంటే.. సంబంధిత అధికారి మెరిట్‌ ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవాలి. 
  • 10 సంవత్సరాల కంటే ముందు ఎసైన్‌మెంట్‌ జరిగి, నిర్దేశిత పత్రాలుంటే జేసీ వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలి. నిర్దేశిత పత్రాలున్నా 22ఎ (1)(ఈ) కింద ఉంటే కలెక్టర్‌ సిఫారసులతో ప్రభుత్వానికి పంపాలి. ప్రైవేటు పట్టా భూముల్ని ఆటోమేటిగ్గా తొలగించాలి. ఒక సర్వే నంబరు మొత్తాన్ని పొరపాటుగా చేరిస్తే  తొలగించాలి. అవసరమైన సబ్‌డివిజన్‌ విస్తీర్ణమే చేర్చాలి. 
  • 22ఎ జాబితా నుంచి తొలగించే అధికారం ఆర్డీవోకు ఉంటుంది. ఆర్డీవో ఉత్తర్వులపై 30 రోజుల్లో జేసీకి అప్పీల్‌ చేయొచ్చు. 22ఎ జాబితాలో చేర్చే అధికారం కలెక్టర్‌కు ఉంటుంది. వీటిపై ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు. 

పోరంబోకు భూముల్ని ఏడబ్ల్యూ, ఏయూడబ్ల్యూగా మార్చాల్సింది ఆర్డీవోలే

గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు అప్పగించని పోరంబోకు భూముల్ని ఎసెస్డ్‌/ అన్‌ఎసెస్డ్‌ వేస్ట్‌ భూములుగా మార్చే అధికారం ఆర్డీవోలకే ఇచ్చారు. నీటి ప్రవాహానికి సంబంధించిన పోరంబోకు భూముల స్వభావాన్ని ప్రభుత్వ ఆదేశాలు లేకుండా మార్చకూడదు. 10 ఏళ్లకు ముందే కలెక్టర్లు వాటిని ఎసైన్‌ చేసి ఉంటే రద్దు చేయకూడదు. ప్రత్యేకంగా పరిష్కరించాలి. 

ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌తోనే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌

వారసత్వ భూములు (వ్యవసాయ) రిజిస్ట్రేషన్‌ చేయాలంటే కుటుంబసభ్యుల (ఫ్యామిలీ మెంబర్‌) సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ఉండాలి. వాటిలో వాస్తవమెంతో తెలుసుకునేందుకు అన్ని సర్టిఫికెట్లను సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు అందుబాటులో ఉంచాలి. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాక ఆటోమ్యుటేషన్‌ చేయాలి. వెంటనే వెబ్‌ల్యాండ్‌లో ఆ భూముల వివరాలు కనిపించాలి. 

రిజిస్ట్రేషన్‌ పెండింగ్‌లో పెడితే కారణాలు లిఖితపూర్వకంగా ఇవ్వాలి

ఆస్తి రిజిస్ట్రేషన్‌ చేయకుండా రెవెన్యూ సమస్యలతో పెండింగ్‌లో పెడితే అందుకు కారణాల్ని తెలియజేయాలి. నోటిమాటగా కాకుండా ప్రింట్‌ తీసి ఇవ్వాలి. ఆన్‌లైన్‌ ప్రీవెరిఫికేషన్‌ సేవలు అనుసరించాలి. 

మూడు నెలల్లో పూర్తి చేయాలి

  • అన్ని ప్రైవేటు నోషనల్‌ ఖాతాల్ని రెగ్యులర్‌ ఖాతాలుగా మార్చాలి. ప్రైవేట్‌ భూములకు వర్తించే సేవలన్నింటినీ వాటికి అందుబాటులో ఉంచాలి. 
  • సున్నా ఖాతాల్ని ఆర్వోఆర్‌ చట్ట నిబంధనల ప్రకారం రెగ్యులర్‌ ఖాతాలుగా మార్చాలి. మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. 
  • వెబ్‌ల్యాండ్‌లో డూప్లికేట్‌ సర్వే నంబర్లు సవరించాలి. ఒకే సర్వే నంబరు (/), (-)తో సృష్టిస్తే వాటిని తహసీల్దార్లు తొలగించాలి. 

అధికారాల బదలాయింపు

వెబ్‌ల్యాండ్‌లో ఆధార్‌ నంబరు మార్చాలన్నా ఇప్పుడు జేసీ వద్దకే వెళ్లాల్సి వస్తోంది. చనిపోయిన పట్టాదారుల ఖాతా నంబర్లు తొలగించి వారసుల పేర్లు పొందుపరచాలన్నా ఆయనే చేయాలి. కొన్ని అంశాల్లో ఎవరు నిర్ణయం తీసుకోవాలనే స్పష్టత కూడా లేక పెద్దఎత్తున దరఖాస్తులు అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయి. దీంతో అధికారాలు అప్పగించడంతోపాటు ఇప్పటి వరకు జేసీ వద్ద ఉన్న వాటిని తహసీల్దార్లకు బదలాయిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ మార్గదర్శకాలు ఇచ్చారు. సైనికులు, మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులకు భూమి కేటాయింపు, ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చే అధికారాల్ని సంయుక్త కలెక్టర్లకే కొనసాగించారు.  

జేసీ నుంచి తహసీల్దార్లకు

ఒక పట్టాదారుకు ఒకే గ్రామంలో ఒకటికి మించిన ఖాతాలుంటే వాటిని తొలగించాలన్నా, చనిపోయిన పట్టాదారుల ఖాతా నంబర్లు తొలగించి వారసుల పేర్లతో వాటిని నమోదు చేయాలన్నా ఇప్పటి వరకు జేసీ వద్దనే అధికారాలున్నాయి. వీటిని తహసీల్దార్లకు బదలాయిస్తున్నారు. 

ప్రైవేటు నోషనల్‌ ఖాతాల్ని శాశ్వత ఖాతాలుగా మార్చడం, ఆర్‌ఓఆర్‌ చట్టం ప్రకారం సున్నా ఖాతాల్ని శాశ్వత ఖాతాలుగా మార్పు, డూప్లికేట్‌ సర్వే నంబర్ల తొలగింపు, భూముల మార్పిడి, కోర్టు ఆదేశాల అమలు (సివిల్‌/రెవెన్యూ కోర్టులు), భూకేటాయింపులు, భూసేకరణ, ఎసైన్‌మెంట్, ఆధార్‌ నంబరు సవరణ తదితర అధికారాల్ని జేసీ నుంచి తహసీల్దార్లకు ఇచ్చారు. 

జేసీ నుంచి ఆర్డీవోకు

రీసర్వే గ్రామాల్లో ఎల్‌పీఎం, భూమి స్వభావం సవరణ, ఆర్‌ఓఆర్‌తో పోలిస్తే వాస్తవ విస్తీర్ణంలో తేడాల్ని సరిచేయడం, ఖాతా నంబర్లతో తప్పుగా అనుసంధానించిన ఎల్‌పీఎంలు సవరించడం తదితర అంశాలు ఇప్పటి వరకు జేసీ వద్ద ఉండగా ఇక నుంచి సబ్‌కలెక్టర్‌/ ఆర్డీవోలకు అప్పగించారు. దరఖాస్తు ద్వారా ఇప్పటికే ఉన్న ఎల్‌పీఎంలు కలపడం, తొలగించడం, సర్వే నంబర్ల గల్లంతు, భూమి స్వభావం, వర్గీకరణలో మార్పులు, వివాద రిజిస్టర్‌లో చేర్పులు, తొలగింపుల అధికారమూ ఆర్డీవోలకు ఇచ్చారు. 

  • కోర్టు ఆదేశాలకు సంబంధించిన మ్యుటేషన్లు
  • 2000వ సంవత్సరం ముందు రిజిస్టరైన లావాదేవీలు 
  • ఎసైనీల వారసులకు మ్యుటేషన్‌ (ఇతర వారసత్వ కేసులూ)
  • గల్లంతైన/ డూప్లికేట్‌ సర్వే నంబర్ల జోడింపు, తొలగింపు
  • ఒక గ్రామంలో పట్టాదారుకు ఒకటికి మించిన ఖాతాలు ఉంటే వాటిని తొలగించడం, వారసుల పేర్లు నమోదు చేయడం
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు.
  • రాంబిల్లిలో మెగా ఔషధ కంపెనీ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో మెగా ఔషధ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు సాగుతున్నాయి.
  • విలేజ్‌ టు విరాట్‌ మీరు క్రికెట్‌ బాగా ఆడతారా..? మీ ప్రతిభకు తగిన గుర్తింపు, వేదిక కోసం చూస్తున్నారా..? అయితే.. మీ కోసమే ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ‘విలేజ్‌ టు విరాట్‌’ ట్యాగ్‌తో ‘రూరల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ప్రోగ్రాం’కు రూపకల్పన చేస్తోంది.
  • ‘ఆరెంజ్‌ ఎకానమీ’ అభివృద్ధికి త్వరలో వర్క్‌షాపులు సాంస్కృతిక, పర్యాటక, ఫిల్మ్‌ టూరిజం విభాగాల్ని సమన్వయం చేస్తూ ‘ఆరెంజ్‌ ఎకానమీ’ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. ఇందుకోసం జూన్‌ లేదా జులై నెలల్లో ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహిస్తామని తెలిపారు.
  • పర్యాటకానికి ‘స్వర్ణ’ కళ! వైకాపా హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర పర్యాటక రంగం తిరిగి గాడిలో పడుతోంది. కూటమి ప్రభుత్వం దానికి పారిశ్రామిక హోదా కల్పించి ప్రోత్సాహకాలు ప్రకటించడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులొస్తున్నాయి.
  • వైద్యులకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు ‘వైద్యరంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులు తెస్తోంది. వ్యాధుల నిర్ధారణ, ఆరోగ్య సేవల్లో క్లిష్ట సమస్యలకు ఏఐ టూల్స్‌ పరిష్కారాలు చూపిస్తున్నాయి.
  • వైభవంగా నూకతాత జాతర అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో మంగళవారం నూకతాత జాతర వైభవంగా సాగింది. నూకతాత ప్రతిమకు పూజారులు, భక్తులు బోయపాడు తీరంలో ఉదయం స్నానం చేయించి పూజలు నిర్వహించారు.
  • నందీశ్వరుడిపై సర్వాంతర్యామి సర్వాంతర్యామి అయిన సోమస్కందమూర్తి ఆయనకు ప్రియమైన నందీశ్వరుడిపై, జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు కామధేనువుపై కొలువుదీరి శ్రీకాళహస్తి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
  • శ్రీశైలంలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పూర్ణాహుతి, చండీశ్వరునికి అవబృధ స్నానం, వసంతోత్సవ క్రతువులు ఘనంగా నిర్వహించారు.
  • తుది దశలో మూలపేట పోర్టు నిర్మాణం ఉత్తరాంధ్రకు గేమ్‌ ఛేంజర్‌గా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణ పనులు 75 శాతం మేర పూర్తయినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
  • 12వ పీఆర్సీ ప్రకటించకపోతే ‘చలో సచివాలయం’ వేతన సవరణ కోసం 12వ పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించి, ఐఆర్‌ను 29 శాతం ప్రకటించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కె.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.
  • అమరావతిలో క్యాట్‌ శాశ్వత బెంచ్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అమరావతిలో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ సర్క్యూట్‌(క్యాట్‌) శాశ్వత బెంచ్‌ ఏర్పాటుకు భూ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని ఆ సంస్థ తెలిపింది.
  • బిల్‌గేట్స్‌ పర్యటన.. సీఎం విజన్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు గేట్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ అమరావతి పర్యటన.. సీఎం చంద్రబాబు విజన్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
  • 21 రోజుల్లో జనన మరణాల నమోదు తప్పనిసరి రాష్ట్రంలో జనన మరణాల నమోదుకు కొత్త నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 21 రోజుల్లో నమోదు తప్పనిసరి చేసింది.
  • అమర్‌నాథ్‌ బృందాన్ని కలవని అంబటి! రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు తమ పార్టీకే చెందిన కొందరు నేతలను ములాఖత్‌లో కలిసేందుకు ఇష్టపడలేదు.
  • ఏపీలో వేగవంతమైన అభివృద్ధి ‘ఎక్స్‌’లో బిల్‌గేట్స్‌ ఏఐ, సాంకేతికతను ఉపయోగించుకుని వ్యవసాయం, విద్య, ఆరోగ్యరంగాల్లో ఆవిష్కరణలతో ఆంధ్రప్రదేశ్‌ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని గేట్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు.
  • మూలుగ మార్పిడి చికిత్స ఎప్పటికి వస్తుంది? రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో మూలుగ (బోన్‌మారో) మార్పిడి చికిత్స అందుబాటులో లేకపోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది.
  • అసెంబ్లీలో పని చేయని మైక్‌ సిస్టమ్‌ అసెంబ్లీలో మంగళవారం మైక్‌ సిస్టమ్‌ మొరాయించింది. శాసనసభలో ఉదయం 9 గంటలకు సమావేశాన్ని ప్రారంభించే సమయానికి ముందు సిబ్బంది పరిశీలించినపుడు మైకులు పని చేయడం లేదని గుర్తించారు. సాంకేతిక విభాగం హడావుడిగా సరిచేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు.
  • ప్రాజెక్టు కొట్టుకుపోయినా పట్టించుకోని జగన్‌ మామిడి రైతులకు కష్టం వస్తే స్థిరీకరణ నిధి ద్వారా నిధులు కేటాయించి ఆదుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెదేపా ఎమ్మెల్యే కె.మురళీమోహన్‌ పేర్కొన్నారు. అందులో పూతలపట్టు నియోజకవర్గానికి అధిక మొత్తం నిధులు దక్కాయని చెప్పారు.
  • వైకాపా పాలనలో ఇష్టారీతిన విద్యుత్తు రాయితీ విధానం వైకాపా హయాంలో ఆక్వా రంగంలో విద్యుత్తు రాయితీని ఇష్టానుసారంగా ఒక్కో రైతుకు ఒక్కో విధంగా అమలు చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైకాపా సర్కారు దుర్మార్గాలను సరిచేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.