

Building of Relations: మన దగ్గర ఎంతుందన్నది కాదు.. సామాజిక సంపద మీకుందా?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

మన దగ్గర ఎంతుందన్నది కాదు... మన తోడుగా ఎవరున్నారన్నది లెక్క! ఎక్కువ సమాచారం తెలుసుకుంటున్నా... ఎక్కువ డిగ్రీలు సంపాదిస్తున్నా... ఎక్కువ గంటలు పనిచేస్తున్నా... ఎక్కువ సాంకేతికతను ఉపయోగిస్తున్నా... నా అన్నవారు నీకుండాలి! చదువు ఉన్నా ఉద్యోగం లేదు. ఉద్యోగం ఉన్నా స్థిరత్వం లేదు. స్థిరత్వం ఉన్నా మానసిక ప్రశాంతత లేదు. ఈ దశలో ఏమున్నా, లేకున్నా.. మనసులో మాట పంచుకోడానికి. మేమున్నామంటూ నిలబడడానికి. పదిమందీ కావాల్సిందే! మరి ఆ సామాజిక సంపద మీకుందా?
నలుగురితో కలిసి ఉండటం అత్యవసరమైన ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ దూరంగా, ఒంటరిగా బతికేస్తే ఎలా?నీకోసం తపించే నలుగురిని పోగేసుకోకుంటే ఎలా?డిజిటల్ కనెక్షన్ ఉంది. కానీ మనుషుల కనెక్షన్ లేదు...ఇది ఈ యుగపు ప్రమాదం! ఈ కొత్త సంవత్సరం వేళ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన మూలాల్లోకి వెళ్లాలి. సామాజిక సంబంధాలు బలపరుచుకోవాలి. ఒకరికి కష్టం వస్తే పదుగురు నిలబడాలి.
రాజేష్ అనేక వాట్సప్ గ్రూపుల్లో సభ్యుడు... రకరకాల సమాచారాలు చలామణీ చేస్తుంటాడు. ఒక రోజు హఠాత్తుగా ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. అంతా ఆశ్చర్యపోయారు.
ఎందుకు అలా చేశాడు? అని ఎవరో వాట్సప్ గ్రూపుల్లో ప్రశ్నించారు.
ఏ ఒక్కరి నుంచీ సమాధానం రాలేదు. ఎవరికి వారే తమకు తెలియదంటే తమకు తెలియదని చెబుతూపోయారు.
ఇంతమందితో సంబంధ బాంధవ్యాలు ఉన్న ఆ మనిషికి ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడుకునేంత బంధం లేదు.
అందుకే మనకు కావాల్సింది వందల మందితో నెట్‌వర్క్ కాదు.. నలుగురైనా ఆత్మీయులు ఉండడం. చక్కని హృదయపూర్వక సంబంధం. మనసులో విషయాలను పంచుకోగలిగే సాన్నిహిత్యం.
తూర్పుగోదావరి జిల్లాలో అదో ఊరు. రాత్రి ఏడు అయ్యేసరికి ఆ వీధి మధ్యలో అటు, ఇటు ఉన్న పెద్ద పెద్ద వీధి అరుగుల ఇళ్ల మీదకు ఆ వీధిలో ఉండేవారంతా చేరేవారు. ముసలి నుంచి చిన్న వాళ్ల వరకు.. ఎన్నో కబుర్లు...అందరి యోగక్షేమాలు..ఆ ఊరి మంచి చెడ్డలు...అందరి విషయాలూ చర్చకు వచ్చేవి. ఒక రోజు ఎవరో అన్నారు. వీరమ్మ గారు ఇంకా రాలేదేమిటి అని... ఈలోపు మరెవరో అన్నారు. వాళ్లింట్లో వాళ్లంతా పెళ్లికి వెళ్లారు. ఈవిడ పెద్దదైందని రాలేనంటే విడిచి వెళ్లారు. రాత్రికి వచ్చేస్తామన్నారు అని. అమ్మా సుశీలా ఒకసారి వెళ్లి చూసిరా... మరో పెద్దాయన పురమాయించారు. ఆమె వెళ్లి చూస్తే వీరమ్మ సాయంత్రం నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని తెలిసింది. ఒక్కసారిగా అందరూ స్పందించారు. ఎవరో ఒకరి ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోను ఉంటే డాక్టర్ ఉన్నారో లేదో కనుక్కునేందుకు పరుగు తీశారు. మరొకరు రిక్షా తీసుకువచ్చేందుకు సైకిల్ ఎక్కారు. మరో ఇద్దరు, ముగ్గురు మహిళలు ఆమె దగ్గరకు వెళ్లి పరామర్శించారు. వైద్యుని దగ్గరకు వెళ్లేలా సిద్ధం చేశారు. ఆఖరికి ఓ పదిమంది కలిసి ఆమెను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు. బండి ఉన్నాయన దగ్గరలో టౌన్‌కు వెళ్లి మందులు తెచ్చారు. (దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి ‘వీధి అరుగు’లో ఓ భాగం...)
చదువు, ఉద్యోగం సేవింగ్స్, ఇన్సూరెన్స్...ఉంటే భరోసా!
ఇప్పుడూ ఇవన్నీ అవసరమే... కానీ సరిపోవు!
ఎందుకంటే కాలం మన ముందుచూపు ప్లాన్‌లతో పాటు బంధాలు, అనుబంధాలు, సంబంధాలను కూడా పరీక్షిస్తోంది.
అన్ని సందర్భాల్లోనూ డబ్బు ఉంటేనే అన్నీ సెట్ అవవు. జీవితంలో డబ్బు ఉన్నా తోటి మనిషి లేకుంటే సమస్య మొదలవుతుంది. బంధాలు, అనుబంధాలు, సమాజం కల్పించే భద్రత.... మనకు కనిపించని సంపద! ఇది బ్యాంకు పాస్ బుక్కుల్లోనో, బ్యాంకు స్టేట్‌మెంట్లలోనో... ఏటీఎం కార్డుల్లోనో, ప్రామిసరీ నోట్లలోనో కనిపించదు. కానీ సంక్షోభ సమయాల్లో పనికొచ్చే అతిపెద్ద కరెన్సీ అదే!
మనింట్లో ఏదో ఫంక్షన్ పెట్టుకున్నాం. చుట్టాలు, పక్కాలు ఎవ్వరూ లేకుండా కేవలం మనింట్లో సభ్యులే ఉంటే... బంధువులంతా సమయానికి అలా వచ్చి ఇలా వెళ్లిపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
ఏదో అనుకోని ఉపద్రవం ఏర్పడి... ఇంట్లో ఎవరో చనిపోయారనుకుందాం. పలకరించేవారు, పక్కన కూడా లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోవటానికి కూడా ఇబ్బంది పడతాం!
ఓకాలనీలో అన్నీ మధ్య తరగతి కుటుంబాలే...
ఒకరికి కొలువు పోయింది...
ఇంకొకరికి ఆసుపత్రి బిల్లు పెరిగింది
మరొకరికి స్కూల్ ఫీజు సమస్య...
ఒకరు ఫలానా చోట ట్రై చేయి అంటూ ఉద్యోగ రిఫరెన్స్ ఇచ్చారు
ఇంకొకరు తెలిసిన డాక్టర్‌తో చెప్పించి బిల్లు తగ్గించారు
మరొకరు స్కూల్ కరస్పాండెంట్‌తో మాట్లాడించి... ఫీజు వాయిదాకు ఒప్పించారు.
వీటన్నింటి వెనకా ఉన్నది నమ్మకం. పరస్పర నమ్మకం. అదే అతిపెద్ద సామాజిక పెట్టుబడి. నమ్మకం అత్యంత విలువైన కరెన్సీ!
ఈ సామాజిక భద్రత డబ్బుతోనో, హోదాలతోనో, పదవులతోనో పెరగదు. కమ్యూనిటీ కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా , మన సేవల్ని ఏదో రూపంలో పంచుకోవటం ద్వారా, నమ్మకం నిలబెట్టుకోవటం ద్వారా పెరుగుతాయి. డబ్బుందనో, హోదా ఉందనో, మరొకటనో అందరికీ దూరంగా ఉండకుండా చుట్టూ ఉన్న సమాజపు కార్యక్రమాల్లో భాగం కావాలి. చుట్టు పక్కల వారితో పరిచయాలు పెంచుకోవాలి. అవసరమైనప్పుడు చేతనైనంత సాయం చేయాలి. అందరిలో కనిపించాలి. అందరికీ ఉపయోగపడాలి. మన చుట్టూ ఉన్న సంఘానికి విలువ ఇవ్వాలి. అనుభవాల్ని పంచుకోవాలి. కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. మాట నిలబెట్టుకోవాలి. భద్రతను వ్యక్తిగతంగానే కాకుండా సామూహికంగానూ పెంచుకోవటం ఈ కాలపు అవసరం.

ఈక్యూ అంటే ఎమోషనల్ కోషెంట్...భావోద్వేగ ఇంటెలిజెన్సీ కుటుంబ బంధాలకు చాలా ముఖ్యమని ప్రముఖ రచయిత డేనియల్ గోల్‌మెన్ అంటారు. బంధాలు బలంగా ఉన్నచోట ఈక్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. అవతలి వారి విషయంలో సహానుభూతి, మంచి కమ్యూనికేషన్ ఉంటాయి. దీనివల్ల కుటుంబాల్లో సంఘర్షణ తగ్గుతుంది. సామాజిక నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి.
హెచ్‌ఆర్ నుంచి పిలుపు వచ్చిందంటే అంతే సంగతులనే దశలో... రాత్రి 10 గంటలకు మెయిల్ వచ్చింది... రేపు హెచ్‌ఆర్‌తో మీటింగ్ అని... హార్ట్‌బీట్ పెరిగింది. నిద్రపట్టడం లేదు.
ఆ క్షణంలో... మీ భాగస్వామి ‘‘ఉద్యోగం పోయినంత మాత్రాన జీవితం పోయినట్లు కాదు. ఏమైనా ఇద్దరం కలసి చూసుకుందాం.... టెన్షన్ వద్దు!’’
- ఆ ఒక్కమాట... మనసును కుదుట పరిచింది. జీవితాన్ని గెలవగలుగుతాననే ధైర్యాన్నిచ్చింది.
అఖిల్ ఇంటర్వ్యూల్లో బాగా చేసినా క్యాంపస్ ప్లేస్‌మెంట్ రాలేదు.
ఫోన్ స్విచాఫ్... సోషల్ మీడియా ఎకౌంట్లన్నీ బంద్.
ఇంట్లో కంగారు...
ఆ క్షణంలో ఫ్రెండ్‌వాళ్ల అన్నయ్య అఖిల్‌తో మాట్లాడాడు. ‘నాక్కూడా ఇలాగే జరిగింది. కొన్నిసార్లు కష్టపడ్డా ఫలితం రాదు. బహుశా ఇంతకంటే మంచిదేదో నీకోసం వేచి చూస్తోందేమో. అందుకే ఇది రాలేదేమో! ట్రై చేసి చూడు’
ఈ సలహా అఖిల్ దారి మార్చింది. వెయ్యి ఏనుగుల బలాన్ని నింపింది. ఈ మార్పు వెనక మనుషులే ఉన్నారు.
నిద్రకు సిద్ధమవుతుండగా...
రాత్రి 11 గంటలకు... ఫోన్ ట్రింగ్ మంది.
అపార్ట్‌మెంట్ వాట్సప్ గ్రూప్‌లో ఏదో మెసేజ్ వచ్చింది...
అపార్ట్‌మెంటులో అందరికీ తలలో నాలుకలా మెలిగే రాకేశ్ నుంచి వచ్చిందది.
ఏమైనా ఆక్సిజన్ కాంటాక్ట్ ఉందా... అర్జెంట్- అన్నది సారాంశం.
తెలిసిన ఆక్సిజన్ కాంటాక్ట్‌లు ఇచ్చిన వారు కొందరైతే...
ఏమైందని వెంటనే రాకేశ్ ఫ్లాట్‌కు పరుగెత్తినవారు మరికొందరు!
అందుకే... బ్యాంక్ బ్యాలెన్స్ కంటే మన సోషల్ కాంటాక్ట్ బలమైనదై ఉండాలి!
పిల్లలు అమెరికాలో...
తల్లిదండ్రులిద్దరూ హైదరాబాద్‌లో నిమోనియాతో మంచం పట్టింది పెద్దావిడ...
ఆవిడకు సేవ చేస్తూ కాలుజారి పడగా, తొంటి ఎముక విరిగింది పెద్దాయనకు...
రోజూ పొద్దున్నే వాకింగ్‌కు వచ్చే పెద్దాయన రాకపోవటంతో వాకింగ్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసరికి కూలబడి ఉన్నాడాయన. అద్దె పోర్షన్లో వాళ్లను పిలవటంతో అంతా కలసి ఆసుపత్రికి చేర్చారు.
ఇక్కడ ఆదుకున్నది డబ్బు కాదు. బంధాలే!
1 మనవాళ్లు.... కుటుంబం, స్నేహితులు...
వీళ్లు మన కన్నీళ్లు తుడుస్తారు. భావోద్వేగ రక్షణనిస్తారు. ఇది డబ్బుతో కొనలేనిది. బీమాతో రానిది. జీవితం కూలినప్పుడూ, కుంగినప్పుడూ మనల్ని నిలబెట్టేది వీళ్లే. సమస్యను పరిష్కరించలేకపోవచ్చు... కానీ మనసును కుదుట పర్చగలుగుతారు.
2 పరిచయాలు... సహోద్యోగులు, నెట్‌వర్క్‌లు..
వీళ్లు అవకాశాల తలుపులు తెరుస్తారు. నమ్మకం మీద నిలబడ్డ సంబంధాలు (నెట్‌వర్క్) అక్కరకొస్తాయి. ఆదుకుంటాయి.
3 వ్యవస్థలతో బంధాలు...
ముఖ పరిచయాలు, చిరునవ్వులు పనులను సులభం చేస్తాయి. ఆఫీసుల్లో, బ్యాంకుల్లో, ఆసుపత్రుల్లో అనేక చోట్ల మార్గం చూపిస్తాయి.
ఈ మూడూ లేకపోతే... మన ప్రయాణం ఒంటరిగా మారుతుంది.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- సంక్షిప్త వార్తలు(16) జోడు రథాలు.. మిన్నంటిన శివనామస్మరణలు.. కిక్కిరిసిన వీధులతో శ్రీకాళహస్తిలో రథోత్సవం ఆద్యంతం రమణీయంగా సాగింది.
- స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలి: రొమానా క్రోపిలోవా మధ్య ఆదాయ దేశాల్లో విద్యలో తీసుకొచ్చిన కొన్ని ఏఐ సాధనాలు విఫలమవుతున్నాయని ఫ్యాబ్ ఏఐ ఎడ్యుటెక్ డైరెక్టర్ రొమానా క్రోపిలోవా తెలిపారు.దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంప్యాక్ట్ సమ్మిట్‌లో సోమవారం ఆమె మాట్లాడుతూ..
- ప్రభుత్వ సేవలు మరింత సులభతరం ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా ప్రజలకు చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీ నియమించాలని ఆదేశించారు.
- సింగిల్ జడ్జి ఉత్తర్వులపై దామోదరనాయుడు అప్పీల్ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌గా తన నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డాక్టర్ టి.దామోదరనాయుడు దాఖలు చేసిన రెండు అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
- వైకాపా హయాంలోని ఇళ్ల పట్టాలపై విచారణ చేయాలి ఎన్నికలకు ముందు వైకాపా ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల్లో అసలైనవి ఎన్ని, నకిలీవి ఎన్ని అనే అంశంపై ప్రభుత్వం విచారణ జరపాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కోరారు.
- జస్టిస్ బాలాజికి ఘన సన్మానం హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జస్టిస్ మెడమల్లి బాలాజిని హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు.
- నూజివీడు కోర్టుకు హాజరైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో నమోదైన కేసులో వైకాపాకు చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సోమవారం నూజివీడులోని న్యాయస్థానంలో హాజరయ్యారు.
- తంబళ్లపల్లె కోర్టుకు జోగి సోదరులు ములకలచెరువు నకిలీ మద్యం కేసులో వైకాపా నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము, ఇతర నిందితులు బాలరాజు, రాజేష్, మణిమారన్, ఎన్.రవి, అన్బురాసు, అల్లాబక్షు కోర్టులో వాయిదాకు హాజరయ్యారు.
- డ్వాక్రా మహిళలకు తీపికబురు మహిళా దినోత్సవాన్ని (మార్చి 8) పురస్కరించుకొని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు అందించనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.
- రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల.. మే నెల కోటా విడుదల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల మే నెల కోటాను ఈనెల 18న ఉదయం పది గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
- 498 కేసులో లుకౌట్ నోటీసా? పోలీసులు యాంత్రిక ధోరణిలో లుకౌట్ సర్క్యులర్ (ఎల్వోసీ) జారీ చేసేస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది.
- బీసీ కోటా ఖరారుకు డెడికేటెడ్ కమిషన్! స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల అమలుకు వీలుగా రాష్ట్రంలో బీసీల జనాభా అధ్యయనానికి డెడికేటెడ్ కమిషన్‌ను నియమించనుంది.
- నెల్లూరు మేయర్, ఏలూరు డిప్యూటీ మేయర్ స్థానాలకు 26న ఎన్నికలు రాష్ట్రంలోని నెల్లూరు, ఏలూరు నగరపాలక సంస్థల్లో ఖాళీ అయిన మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించనున్నారు.
- త్యాగనిరతికి నిలువెత్తు ఆకృతి రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన ఆ మహనీయుడి త్యాగనిరతిని భావితరాలకు తెలియజేసేందుకు శాఖమూరు వద్ద ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ పేరుతో ఆయన విగ్రహాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది.
- రోడ్డు ప్రమాదాల నివారణకు త్వరలో వీ2వీ వ్యవస్థ ‘కృత్రిమ మేధ(ఏఐ)తో భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం సాధ్యం. త్వరలోనే ఒక వాహనం నుంచి మరో వాహనానికి సమాచారం అందే సాంకేతిక వ్యవస్థను (వీ2వీ) అందుబాటులోకి తీసుకురానున్నాం.
- ఇంటింటికీ నీటి సరఫరాపై నిఘా గ్రామాల్లో ఇంటింటికీ తాగునీటి సరఫరాలో నాణ్యత ప్రమాణాలను ఏఐతో ఎలా పర్యవేక్షిస్తున్నారో వివరించారు ‘ఆర్ఘ్యం’ సంస్థ సీనియర్ మేనేజర్ భావన బడోలా.
- క్రీడాకారుల ఆటను ఏఐతో ట్రాక్ చేస్తున్నాం క్రీడాకారుల ఆట తీరు, వ్యక్తిగత శిక్షణ కార్యక్రమాలను కృత్రిమ మేధ(ఏఐ) ద్వారా ట్రాకింగ్ చేస్తున్నామని లక్ష్మీబాయి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపకులపతి కపానా శర్మ తెలిపారు.
- సముద్రాలకు ప్లాస్టిక్ నుంచి విముక్తి ఏఐ ఆధారిత విధానాలతో సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు పరిష్కారం చూపొచ్చని కర్ణాటకలోని ఉడుపికి చెందిన బేరు కోస్ట్ క్లియర్ సంస్థ వ్యవస్థాపకురాలు దివ్యా హెగ్డే అనుభవపూర్వకంగా తెలిపారు.
- సాగరతీరంలో మిలన్ సంబరాలు అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష (ఐఎఫ్‌ఆర్-2026), మిలన్ వేడుకల్లో భాగంగా తూర్పు నౌకా దళం ఆధ్వర్యంలో సోమవారం సన్నాహక విన్యాసాలు జరిగాయి.
- తిరుమలలో తెలంగాణ భవన్‌కు స్థలం కేటాయించండి తిరుమలలో తెలంగాణ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని, భద్రాచలం సమీపంలోని ఐదు ఏపీ గ్రామాల్ని తెలంగాణలో కలిపేందుకు సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరినట్టు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.