Building of Relations: మన దగ్గర ఎంతుందన్నది కాదు.. సామాజిక సంపద మీకుందా?

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 03 Jan 2026 18:19 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
7 min read

మన దగ్గర ఎంతుందన్నది కాదు... మన తోడుగా ఎవరున్నారన్నది లెక్క! ఎక్కువ సమాచారం తెలుసుకుంటున్నా... ఎక్కువ డిగ్రీలు సంపాదిస్తున్నా... ఎక్కువ గంటలు పనిచేస్తున్నా... ఎక్కువ సాంకేతికతను ఉపయోగిస్తున్నా... నా అన్నవారు నీకుండాలి! చదువు ఉన్నా ఉద్యోగం లేదు. ఉద్యోగం ఉన్నా స్థిరత్వం లేదు. స్థిరత్వం ఉన్నా మానసిక ప్రశాంతత లేదు. ఈ దశలో ఏమున్నా, లేకున్నా.. మనసులో మాట పంచుకోడానికి. మేమున్నామంటూ నిలబడడానికి. పదిమందీ కావాల్సిందే! మరి ఆ సామాజిక సంపద మీకుందా?  

నలుగురితో కలిసి ఉండటం అత్యవసరమైన ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ దూరంగా, ఒంటరిగా బతికేస్తే ఎలా?నీకోసం తపించే నలుగురిని పోగేసుకోకుంటే ఎలా?డిజిటల్‌ కనెక్షన్‌ ఉంది. కానీ మనుషుల కనెక్షన్‌ లేదు...ఇది ఈ యుగపు ప్రమాదం! ఈ కొత్త సంవత్సరం వేళ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన మూలాల్లోకి వెళ్లాలి. సామాజిక సంబంధాలు బలపరుచుకోవాలి. ఒకరికి కష్టం వస్తే పదుగురు నిలబడాలి.

రాజేష్‌ అనేక వాట్సప్‌ గ్రూపుల్లో సభ్యుడు... రకరకాల సమాచారాలు చలామణీ చేస్తుంటాడు. ఒక రోజు హఠాత్తుగా ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. అంతా ఆశ్చర్యపోయారు. 
ఎందుకు అలా చేశాడు? అని ఎవరో వాట్సప్‌ గ్రూపుల్లో ప్రశ్నించారు. 
ఏ ఒక్కరి నుంచీ సమాధానం రాలేదు. ఎవరికి వారే తమకు తెలియదంటే తమకు తెలియదని చెబుతూపోయారు. 
ఇంతమందితో సంబంధ బాంధవ్యాలు ఉన్న ఆ మనిషికి ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడుకునేంత బంధం లేదు. 
అందుకే మనకు కావాల్సింది వందల మందితో నెట్‌వర్క్‌ కాదు.. నలుగురైనా ఆత్మీయులు ఉండడం. చక్కని హృదయపూర్వక సంబంధం. మనసులో విషయాలను పంచుకోగలిగే సాన్నిహిత్యం.

తూర్పుగోదావరి జిల్లాలో అదో ఊరు. రాత్రి ఏడు అయ్యేసరికి ఆ వీధి మధ్యలో అటు, ఇటు ఉన్న పెద్ద పెద్ద వీధి అరుగుల ఇళ్ల మీదకు ఆ వీధిలో ఉండేవారంతా చేరేవారు. ముసలి నుంచి చిన్న వాళ్ల వరకు.. ఎన్నో కబుర్లు...అందరి యోగక్షేమాలు..ఆ ఊరి మంచి చెడ్డలు...అందరి విషయాలూ చర్చకు వచ్చేవి. ఒక రోజు ఎవరో అన్నారు. వీరమ్మ గారు ఇంకా  రాలేదేమిటి అని... ఈలోపు మరెవరో అన్నారు. వాళ్లింట్లో వాళ్లంతా పెళ్లికి వెళ్లారు. ఈవిడ పెద్దదైందని రాలేనంటే విడిచి వెళ్లారు. రాత్రికి వచ్చేస్తామన్నారు అని. అమ్మా సుశీలా ఒకసారి వెళ్లి చూసిరా... మరో పెద్దాయన పురమాయించారు. ఆమె వెళ్లి చూస్తే వీరమ్మ సాయంత్రం నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని తెలిసింది. ఒక్కసారిగా అందరూ స్పందించారు. ఎవరో ఒకరి ఇంట్లో ల్యాండ్‌ లైన్‌ ఫోను ఉంటే డాక్టర్‌ ఉన్నారో లేదో కనుక్కునేందుకు పరుగు తీశారు. మరొకరు రిక్షా తీసుకువచ్చేందుకు సైకిల్‌ ఎక్కారు. మరో ఇద్దరు, ముగ్గురు మహిళలు ఆమె దగ్గరకు వెళ్లి పరామర్శించారు. వైద్యుని దగ్గరకు వెళ్లేలా సిద్ధం చేశారు. ఆఖరికి ఓ పదిమంది కలిసి ఆమెను డాక్టర్‌ దగ్గరకు తీసుకువెళ్లారు. బండి ఉన్నాయన దగ్గరలో టౌన్‌కు వెళ్లి మందులు తెచ్చారు. (దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి ‘వీధి అరుగు’లో ఓ భాగం...)

చదువు, ఉద్యోగం సేవింగ్స్, ఇన్సూరెన్స్‌...ఉంటే భరోసా!
ఇప్పుడూ ఇవన్నీ అవసరమే... కానీ సరిపోవు!
ఎందుకంటే కాలం మన ముందుచూపు ప్లాన్‌లతో పాటు బంధాలు, అనుబంధాలు, సంబంధాలను కూడా పరీక్షిస్తోంది.

అన్ని సందర్భాల్లోనూ డబ్బు ఉంటేనే అన్నీ సెట్‌ అవవు. జీవితంలో డబ్బు ఉన్నా తోటి మనిషి లేకుంటే సమస్య మొదలవుతుంది. బంధాలు, అనుబంధాలు, సమాజం కల్పించే భద్రత.... మనకు కనిపించని సంపద! ఇది బ్యాంకు పాస్‌ బుక్కుల్లోనో, బ్యాంకు స్టేట్‌మెంట్లలోనో... ఏటీఎం కార్డుల్లోనో, ప్రామిసరీ నోట్లలోనో కనిపించదు. కానీ సంక్షోభ సమయాల్లో పనికొచ్చే అతిపెద్ద కరెన్సీ అదే!
మనింట్లో ఏదో ఫంక్షన్‌ పెట్టుకున్నాం. చుట్టాలు, పక్కాలు ఎవ్వరూ లేకుండా కేవలం మనింట్లో సభ్యులే ఉంటే... బంధువులంతా సమయానికి అలా వచ్చి ఇలా వెళ్లిపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
ఏదో అనుకోని ఉపద్రవం ఏర్పడి... ఇంట్లో ఎవరో చనిపోయారనుకుందాం. పలకరించేవారు, పక్కన కూడా లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోవటానికి కూడా ఇబ్బంది పడతాం! 

కాలనీలో అన్నీ మధ్య తరగతి కుటుంబాలే...
ఒకరికి కొలువు పోయింది...
ఇంకొకరికి ఆసుపత్రి బిల్లు పెరిగింది
మరొకరికి స్కూల్‌ ఫీజు సమస్య...
ఒకరు ఫలానా చోట ట్రై చేయి అంటూ ఉద్యోగ రిఫరెన్స్‌ ఇచ్చారు
ఇంకొకరు తెలిసిన డాక్టర్‌తో చెప్పించి బిల్లు తగ్గించారు
మరొకరు స్కూల్‌ కరస్పాండెంట్‌తో మాట్లాడించి... ఫీజు వాయిదాకు ఒప్పించారు.

వీటన్నింటి వెనకా ఉన్నది నమ్మకం. పరస్పర నమ్మకం. అదే అతిపెద్ద సామాజిక పెట్టుబడి. నమ్మకం అత్యంత విలువైన కరెన్సీ! 

ఈ సామాజిక భద్రత డబ్బుతోనో, హోదాలతోనో, పదవులతోనో పెరగదు. కమ్యూనిటీ కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా , మన సేవల్ని ఏదో రూపంలో పంచుకోవటం ద్వారా, నమ్మకం నిలబెట్టుకోవటం ద్వారా పెరుగుతాయి. డబ్బుందనో, హోదా ఉందనో, మరొకటనో అందరికీ దూరంగా ఉండకుండా చుట్టూ ఉన్న సమాజపు కార్యక్రమాల్లో భాగం కావాలి. చుట్టు పక్కల వారితో పరిచయాలు పెంచుకోవాలి. అవసరమైనప్పుడు చేతనైనంత సాయం చేయాలి. అందరిలో కనిపించాలి. అందరికీ ఉపయోగపడాలి. మన చుట్టూ ఉన్న సంఘానికి విలువ ఇవ్వాలి. అనుభవాల్ని పంచుకోవాలి. కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి.  మాట నిలబెట్టుకోవాలి. భద్రతను వ్యక్తిగతంగానే కాకుండా సామూహికంగానూ పెంచుకోవటం ఈ కాలపు అవసరం.

ఈక్యూ అంటే ఎమోషనల్‌ కోషెంట్‌...భావోద్వేగ ఇంటెలిజెన్సీ కుటుంబ బంధాలకు చాలా ముఖ్యమని ప్రముఖ రచయిత డేనియల్‌ గోల్‌మెన్‌ అంటారు. బంధాలు బలంగా ఉన్నచోట ఈక్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. అవతలి వారి విషయంలో సహానుభూతి, మంచి కమ్యూనికేషన్‌ ఉంటాయి. దీనివల్ల కుటుంబాల్లో సంఘర్షణ తగ్గుతుంది. సామాజిక నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. 

హెచ్‌ఆర్‌ నుంచి పిలుపు వచ్చిందంటే అంతే సంగతులనే దశలో... రాత్రి 10 గంటలకు మెయిల్‌ వచ్చింది... రేపు హెచ్‌ఆర్‌తో మీటింగ్‌ అని... హార్ట్‌బీట్‌ పెరిగింది. నిద్రపట్టడం లేదు.

ఆ క్షణంలో... మీ భాగస్వామి ‘‘ఉద్యోగం పోయినంత మాత్రాన జీవితం పోయినట్లు కాదు. ఏమైనా ఇద్దరం కలసి చూసుకుందాం.... టెన్షన్‌ వద్దు!’’

- ఆ ఒక్కమాట... మనసును కుదుట పరిచింది. జీవితాన్ని గెలవగలుగుతాననే ధైర్యాన్నిచ్చింది.

అఖిల్‌ ఇంటర్వ్యూల్లో బాగా చేసినా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ రాలేదు.
ఫోన్‌ స్విచాఫ్‌... సోషల్‌ మీడియా ఎకౌంట్లన్నీ బంద్‌.
ఇంట్లో కంగారు...

ఆ క్షణంలో ఫ్రెండ్‌వాళ్ల అన్నయ్య అఖిల్‌తో మాట్లాడాడు. ‘నాక్కూడా ఇలాగే జరిగింది. కొన్నిసార్లు కష్టపడ్డా ఫలితం రాదు. బహుశా ఇంతకంటే మంచిదేదో నీకోసం వేచి చూస్తోందేమో. అందుకే ఇది రాలేదేమో! ట్రై చేసి చూడు’

ఈ సలహా అఖిల్‌ దారి మార్చింది. వెయ్యి ఏనుగుల బలాన్ని నింపింది. ఈ మార్పు వెనక మనుషులే ఉన్నారు.

నిద్రకు సిద్ధమవుతుండగా...
రాత్రి 11 గంటలకు... ఫోన్‌ ట్రింగ్‌ మంది.
అపార్ట్‌మెంట్‌ వాట్సప్‌ గ్రూప్‌లో ఏదో మెసేజ్‌ వచ్చింది... 
అపార్ట్‌మెంటులో అందరికీ తలలో నాలుకలా మెలిగే రాకేశ్‌ నుంచి వచ్చిందది.
ఏమైనా ఆక్సిజన్‌ కాంటాక్ట్‌ ఉందా... అర్జెంట్‌- అన్నది సారాంశం.
తెలిసిన ఆక్సిజన్‌ కాంటాక్ట్‌లు ఇచ్చిన వారు కొందరైతే...
ఏమైందని వెంటనే రాకేశ్‌ ఫ్లాట్‌కు పరుగెత్తినవారు మరికొందరు!

అందుకే... బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కంటే మన సోషల్‌ కాంటాక్ట్‌ బలమైనదై ఉండాలి!

పిల్లలు అమెరికాలో...

తల్లిదండ్రులిద్దరూ హైదరాబాద్‌లో నిమోనియాతో మంచం పట్టింది పెద్దావిడ...
ఆవిడకు సేవ చేస్తూ కాలుజారి పడగా, తొంటి ఎముక విరిగింది పెద్దాయనకు...
రోజూ పొద్దున్నే వాకింగ్‌కు వచ్చే పెద్దాయన రాకపోవటంతో వాకింగ్‌ ఫ్రెండ్స్‌ ఇంటికి వచ్చేసరికి కూలబడి ఉన్నాడాయన. అద్దె పోర్షన్లో వాళ్లను పిలవటంతో అంతా కలసి ఆసుపత్రికి చేర్చారు. 

ఇక్కడ ఆదుకున్నది డబ్బు కాదు. బంధాలే!

1 మనవాళ్లు.... కుటుంబం, స్నేహితులు...

వీళ్లు మన కన్నీళ్లు తుడుస్తారు. భావోద్వేగ రక్షణనిస్తారు. ఇది డబ్బుతో కొనలేనిది. బీమాతో రానిది. జీవితం కూలినప్పుడూ, కుంగినప్పుడూ మనల్ని నిలబెట్టేది వీళ్లే. సమస్యను పరిష్కరించలేకపోవచ్చు... కానీ మనసును కుదుట పర్చగలుగుతారు.

2 పరిచయాలు... సహోద్యోగులు, నెట్‌వర్క్‌లు..  

వీళ్లు అవకాశాల తలుపులు తెరుస్తారు. నమ్మకం మీద నిలబడ్డ సంబంధాలు (నెట్‌వర్క్‌) అక్కరకొస్తాయి. ఆదుకుంటాయి. 

3 వ్యవస్థలతో బంధాలు... 

ముఖ పరిచయాలు, చిరునవ్వులు పనులను సులభం చేస్తాయి. ఆఫీసుల్లో, బ్యాంకుల్లో, ఆసుపత్రుల్లో అనేక చోట్ల మార్గం చూపిస్తాయి.

ఈ మూడూ లేకపోతే... మన ప్రయాణం ఒంటరిగా మారుతుంది.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • సంక్షిప్త వార్తలు(16) జోడు రథాలు.. మిన్నంటిన శివనామస్మరణలు.. కిక్కిరిసిన వీధులతో శ్రీకాళహస్తిలో రథోత్సవం ఆద్యంతం రమణీయంగా సాగింది.
  • స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలి: రొమానా క్రోపిలోవా మధ్య ఆదాయ దేశాల్లో విద్యలో తీసుకొచ్చిన కొన్ని ఏఐ సాధనాలు విఫలమవుతున్నాయని ఫ్యాబ్‌ ఏఐ ఎడ్యుటెక్‌ డైరెక్టర్‌ రొమానా క్రోపిలోవా తెలిపారు.దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంప్యాక్ట్‌ సమ్మిట్‌లో సోమవారం ఆమె మాట్లాడుతూ..
  • ప్రభుత్వ సేవలు మరింత సులభతరం ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా ప్రజలకు చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీ నియమించాలని ఆదేశించారు.
  • సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై దామోదరనాయుడు అప్పీల్‌ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌గా తన నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై డాక్టర్‌ టి.దామోదరనాయుడు దాఖలు చేసిన రెండు అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
  • వైకాపా హయాంలోని ఇళ్ల పట్టాలపై విచారణ చేయాలి ఎన్నికలకు ముందు వైకాపా ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల్లో అసలైనవి ఎన్ని, నకిలీవి ఎన్ని అనే అంశంపై ప్రభుత్వం విచారణ జరపాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ కోరారు.
  • జస్టిస్‌ బాలాజికి ఘన సన్మానం హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ మెడమల్లి బాలాజిని హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు.
  • నూజివీడు కోర్టుకు హాజరైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో నమోదైన కేసులో వైకాపాకు చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ సోమవారం నూజివీడులోని న్యాయస్థానంలో హాజరయ్యారు.
  • తంబళ్లపల్లె కోర్టుకు జోగి సోదరులు ములకలచెరువు నకిలీ మద్యం కేసులో వైకాపా నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము, ఇతర నిందితులు బాలరాజు, రాజేష్, మణిమారన్, ఎన్‌.రవి, అన్బురాసు, అల్లాబక్షు కోర్టులో వాయిదాకు హాజరయ్యారు.
  • డ్వాక్రా మహిళలకు తీపికబురు మహిళా దినోత్సవాన్ని (మార్చి 8) పురస్కరించుకొని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు అందించనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.
  • రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల.. మే నెల కోటా విడుదల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల మే నెల కోటాను ఈనెల 18న ఉదయం పది గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
  • 498 కేసులో లుకౌట్‌ నోటీసా? పోలీసులు యాంత్రిక ధోరణిలో లుకౌట్‌ సర్క్యులర్‌ (ఎల్వోసీ) జారీ చేసేస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది.
  • బీసీ కోటా ఖరారుకు డెడికేటెడ్‌ కమిషన్‌! స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల అమలుకు వీలుగా రాష్ట్రంలో బీసీల జనాభా అధ్యయనానికి డెడికేటెడ్‌ కమిషన్‌ను నియమించనుంది.
  • నెల్లూరు మేయర్, ఏలూరు డిప్యూటీ మేయర్‌ స్థానాలకు 26న ఎన్నికలు రాష్ట్రంలోని నెల్లూరు, ఏలూరు నగరపాలక సంస్థల్లో ఖాళీ అయిన మేయర్, డిప్యూటీ మేయర్‌ స్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించనున్నారు.
  • త్యాగనిరతికి నిలువెత్తు ఆకృతి రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన ఆ మహనీయుడి త్యాగనిరతిని భావితరాలకు తెలియజేసేందుకు శాఖమూరు వద్ద ‘స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైస్‌’ పేరుతో ఆయన విగ్రహాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది.
  • రోడ్డు ప్రమాదాల నివారణకు త్వరలో వీ2వీ వ్యవస్థ ‘కృత్రిమ మేధ(ఏఐ)తో భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం సాధ్యం. త్వరలోనే ఒక వాహనం నుంచి మరో వాహనానికి సమాచారం అందే సాంకేతిక వ్యవస్థను (వీ2వీ) అందుబాటులోకి తీసుకురానున్నాం.
  • ఇంటింటికీ నీటి సరఫరాపై నిఘా గ్రామాల్లో ఇంటింటికీ తాగునీటి సరఫరాలో నాణ్యత ప్రమాణాలను ఏఐతో ఎలా పర్యవేక్షిస్తున్నారో వివరించారు ‘ఆర్ఘ్యం’ సంస్థ సీనియర్‌ మేనేజర్‌ భావన బడోలా.
  • క్రీడాకారుల ఆటను ఏఐతో ట్రాక్‌ చేస్తున్నాం క్రీడాకారుల ఆట తీరు, వ్యక్తిగత శిక్షణ కార్యక్రమాలను కృత్రిమ మేధ(ఏఐ) ద్వారా ట్రాకింగ్‌ చేస్తున్నామని లక్ష్మీబాయి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఉపకులపతి కపానా శర్మ తెలిపారు.
  • సముద్రాలకు ప్లాస్టిక్‌ నుంచి విముక్తి ఏఐ ఆధారిత విధానాలతో సముద్రంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల సమస్యకు పరిష్కారం చూపొచ్చని కర్ణాటకలోని ఉడుపికి చెందిన బేరు కోస్ట్‌ క్లియర్‌ సంస్థ వ్యవస్థాపకురాలు దివ్యా హెగ్డే అనుభవపూర్వకంగా తెలిపారు.
  • సాగరతీరంలో మిలన్‌ సంబరాలు అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష (ఐఎఫ్‌ఆర్‌-2026), మిలన్‌ వేడుకల్లో భాగంగా తూర్పు నౌకా దళం ఆధ్వర్యంలో సోమవారం సన్నాహక విన్యాసాలు జరిగాయి.
  • తిరుమలలో తెలంగాణ భవన్‌కు స్థలం కేటాయించండి తిరుమలలో తెలంగాణ భవన్‌ నిర్మాణానికి స్థలం కేటాయించాలని, భద్రాచలం సమీపంలోని ఐదు ఏపీ గ్రామాల్ని తెలంగాణలో కలిపేందుకు సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరినట్టు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

English Translation
mb-2">Building of Relations: It's not about how much we have.. Do you have social wealth?
Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 03 Jan 2026 18:19 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
7 min read

It is not how much we have... it is who is with us. Calculate! Knowing more information...earning more degrees...working more hours...using more technology...my brother should be yours! Education but no job. Even if there is a job, there is no stability. There is stability but no peace of mind. At this stage, whatever or not. To stand as we are. Ten people are needed! And do you have that social wealth?  

In the current situation where it is essential to be with four people, how can you live alone, away from everyone? How can you not find four people who are missing for you? There is a digital connection. But no human connection...this is the danger of this age! One thing to remember this new year. We have to go back to our roots. Social relations should be strengthened. If one gets in trouble, ten should stand.

Rajesh is a member of many WhatsApp groups... he shares various messages. It was learned that one day he suddenly committed suicide. Everyone was surprised. 
Why did he do that? Someone asked in WhatsApp groups. 
Received no reply from anyone. They said that if they don't know themselves, they don't know them. 
That man who has relationships with so many people does not have the relationship to open his heart with anyone. 
That's why we don't need a network with hundreds of people.. At least four soulmates. A nice heartfelt relationship. Intimacy to share things in the mind.

It is a town in East Godavari district. By seven o'clock in the night, all the people in that street would gather on the houses of the big street houses that were here and there in the middle of that street. From the old to the young... there was a lot of chatter... everyone's well-being... the good and the bad of the town... everyone's issues were discussed. Someone said one day. Someone else said that Veeramma hasn't come yet... All of them went to the wedding. They left because they couldn't understand that she was grown up. They said they will come at night. Amma Susheela should go and see... Another elder said. When she went, she found out that Veeramma was suffering from high fever since evening. Everyone responded at once. If someone has a landline phone in someone's house, they run to find out if there is a doctor. Another rode a bicycle to fetch a rickshaw. Two or three other women went to her and visited her. Prepared to go to the doctor. Finally ten people together took her to the doctor. They went to the town near where there was a cart and brought medicines. (A part of Devulapalli Venkata Krishna Sastri's 'Veedhi Arugu'...)

Education, Job Savings, Insurance...Reassurance!
Now all these are necessary... but not enough!
Because time is testing our future plans as well as bonds, attachments and relationships.

In all cases money is not enough to set everything. If there is money in life but no fellow man then the problem starts. The bonds, the connections, the security that society provides....the wealth that we don't see! It does not appear in bank pass books, bank statements, ATM cards or promissory notes. But it is the biggest currency that works in times of crisis!
We put some function in him. If there were only members of the family without any strings or strings... Just imagine what it would be like if all the relatives came and went like that on time.
Suppose some unexpected disturbance occurs... someone dies in the house. It is difficult to even imagine what it would be like if the greeters were not there! 

OAll the middle class families in the colony...
One has lost his measure...
Another has increased hospital bill
Another has a school fee problem...
One gave a job reference telling him to try a certain place
Another talked to a known doctor and reduced the bill
Another talked to the school correspondent...for deferment of fees Convinced.

Behind all this is belief. Mutual trust. That is the biggest social investment. Trust is the most valuable currency! 

This social security does not increase with money, status or positions. We grow by participating in community activities, sharing our services in some form, and maintaining trust. Be it money, status or others, everyone should be a part of the community activities around them instead of staying away from them. Get in touch with the people around you. Help as much as possible when needed. Must be seen in all. It should be useful for everyone. We should value the community around us. Experiences should be shared. Actively participate in activities.  Keep your word. It is the need of the hour to increase security not only individually but also collectively.

EQ stands for Emotional Quotient...emotional intelligence is very important for family bonds, noted author Daniel is called Goalman. Where bonds are strong, EQ is also high. Empathy for others and good communication. This will reduce conflict in families. Social skills are developed. 

HAt the stage of the same thing, I got a call from HR... At 10 pm I got a mail... I have a meeting with HR tomorrow... Heartbeat increased. Not sleeping.

In that moment... your partner says, “Life is not lost just because the job is lost. Anyway, let's see together.... No tension!''

- That one word... made my mind cringe. It gave me the courage to win life.

Akhil did well in the interviews but did not get the campus placement.
Phone switchoff... All social media accounts are closed.
Kangaroo in the house...

At that moment, the elder brother of the friends spoke to Akhil. This happened to me too. Sometimes hard work doesn't work. Maybe something better is waiting for you. That's why it didn't come! Try and see'

This advice changed Akhil's path. Filled with the strength of a thousand elephants. There are people behind this change.

While getting ready for sleep...
At 11 o'clock in the night... the phone is ringing.
There was a message in the apartment WhatsApp group...
It came from Rakesh, who was the talk of everyone in the apartment.
Is there any oxygen contact... Urgent - is the summary.
Some who gave known oxygen contacts...
Others immediately rushed to Rakesh's flat to find out what happened!

That's why...our social contact should be stronger than bank balance!

Children in America...

Both parents are bedridden with pneumonia in Hyderabad...
While serving her, he slipped and the old man broke his tibia...
He collapsed when his walking friends came home because the old man who used to come for a walk every morning did not come. When they were called in the rental portion, they were admitted to the hospital. 

It's not about money. Bonds!

1 grandchildren....family, friends...

They wipe away our tears. Provides emotional protection. It's something money can't buy. Does not come with insurance. They are the ones who sustain us when life collapses and collapses. May not be able to solve the problem... but can shake the mind.

2 Contacts... colleagues, networks..  

They open doors of opportunities. Requires relationships (network) built on trust. support 

3 Bonds with systems...

Face contacts, smiles make things easier. In offices, banks, hospitals many places show the way.

If these three are not there...our journey becomes lonely.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. No correspondence in this matter.

More

  • News in Brief(16) A couple of chariots. The Chariotsavam at Srikalahasti was picturesque throughout with crowded streets.
  • Preference should be given to local languages: Romana Kropilova Romana Kropilova, director of Fab AI Edutech, said that some of the AI tools introduced in education in middle-income countries are failing. She was speaking at the AI Impact Summit in Delhi on Monday. Chief Minister Chandrababu stated that their aim is to make government services accessible to people as easily as possible. A special committee was ordered to be appointed to study this.
  • Damodaranaidu appealed against the order of the single judge. The High Court bench on Monday heard two appeals filed by Dr. T. Damodaranaidu against the verdict given by the single judge of the High Court canceling his appointment as Director of the Animal Husbandry Department. BJP state president PVN Madhav has asked the government to investigate how many of the house tracks distributed to the poor by the Vaikapa government before the elections are genuine and how many are fake.
  • Great honor to Justice Balaji. Justice Medamalli Balaji, who recently took charge as an Additional Judge of the High Court, was felicitated on Monday under the auspices of the High Court Bar Association. Vallabhaneni Vamsimohan, former Gannavaram MLA from Vaikapa, appeared in the court in Nujiveedu on Monday in the case registered in the case of fake house title deeds.
  • Jogi brothers in Tamballapalle court Vaikapa leader, ex-minister Jogi Ramesh, his brother Jogi Ramu, other accused Balaraju, Rajesh, Manimaran, N. Ravi, Anburasu and Allabakshu attended the adjournment in the Mulakalacheruvu fake liquor case. In celebration of Women's Day (March 8), the government will give sweet talk to the women of Dwakra. A special program will be organized under the leadership of Chief Minister Chandrababu Babu on the occasion of the 25th anniversary of the establishment of Rural Poverty Eradication Society (SERP). Thithide will release the May quota for Srivari Arjita Seva Suprabhatam, Tomala, Archana, Ashtadal Padapadmaradhana services online on 18th of this month at 10 am.
  • Lookout notice in case 498? The High Court has objected that the police are issuing lookout circulars (LVOC) in a mechanical manner. The government has taken a key decision to finalize BC reservations in local body elections. As per the promise given in the election, a dedicated commission will be appointed to study the population of BCs in the state to facilitate the implementation of 34 percent reservation in local bodies. Elections will be held on 26th of this month for the vacant posts of Mayor and Deputy Mayor in Nellore and Eluru Municipalities in the state. In the capital Amaravati, the work of constructing the statue of Amarjeevi Pottisreeramulu is going on at a fast pace. The government is constructing a statue of the great man named 'Statue of Sacrifice' at Sakhamuru to remind future generations of the great man who sacrificed himself for a separate Andhra state.
  • V2V system to prevent road accidents soon. Artificial Intelligence (AI) can reduce road accidents in India. Soon we will make the technology system available from one vehicle to another vehicle (V2V). Bhavana Badola, senior manager of 'Argyam' organization, explained how the quality standards of drinking water supply from house to house in villages are being monitored with AI. Kapana Sharma, Vice-Chancellor of Lakshmibai National Institute of Physical Education said that the sportsperson's performance and personal training programs are being tracked through artificial intelligence (AI).
  • Free the oceans from plastic. Divya Hegde, the founder of Beru Coast Clear from Udupi, Karnataka, said from experience that the problem of plastic waste in the sea can be solved with AI-based approaches.
  • Milan celebrations at the beach. As part of the International Warships Review (IFR-2026), Milan celebrations, Eastern Naval Forces conducted preparatory exercises on Monday.
  • Allow space for Telangana Bhavan in Tirumala Telangana Minister Tummala Nageswara Rao said that AP CM asked Chandrababu to allot land for the construction of Telangana Bhavan in Tirumala and cooperate in merging five AP villages near Bhadrachalam into Telangana.