నాచారంలో ఇంటి యజమాని హత్య.. గోదావరిలో లభ్యమైన మృతదేహం

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

నాచారం(హైదరాబాద్): ఇల్లు అద్దెకు ఇచ్చిన యజమాని సుజాత(65)ను బంగారం కోసం హత్య చేసిన కేసును నాచారం పోలీసులు ఛేదించారు. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు వెళ్లి ఆమె మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. నిందితుడు అంజిబాబును తీసుకువచ్చి గోదావరిలో గాలించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సుజాత మృతదేహం మామిడికుదురు సమీపంలోని అప్పనపల్లి-కె.ఏనుగుపల్లి మధ్య వైనతేయ గోదావరిలో లభ్యమైంది. నాచారం సీఐ ధనుంజయ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి వెళ్లారు.
ఏం జరిగిందంటే..
ఇల్లు అద్దెకు ఇచ్చిన యజమానిని బంగారం కోసం క్యాబ్ డ్రైవర్ అంజిబాబు (33) హత్య చేశాడు. సీఐ ధనుంజయ తెలిపిన వివరాల ప్రకారం.. నాచారం పీఎస్ పరిధిలోని మల్లాపూర్ బాబానగర్‌లో సూరెడ్డి సుజాత నివసిస్తున్నారు. భర్త, కుమారులు చనిపోవడంతో ఆమె ఒంటరిగా ఉంటున్నారు. ఏపీలోని డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పెరవలి మండలం కొత్తపల్లికి చెందిన ఎం.అంజిబాబు డ్రైవర్ పని కోసం హైదరాబాద్ వచ్చాడు. రెండు నెలల క్రితం సుజాత ఇంట్లో అద్దెకు చేరాడు. ఈ నెల 19న రాత్రి ఆమెను హత్య చేసి ఒంటిపై ఉన్న 11 తులాల బంగారాన్ని దోచుకున్నాడు. మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టి తాళం వేశాడు.
ఈ విషయాన్ని పెరవలి మండలం కందవల్లిలోని స్నేహితుడు యువరాజు (18), అమలాపురం మండలం వేమవరానికి చెందిన స్నేహితుడు దుర్గారావు (35)కు చెప్పి తన సొంతూరుకు వెళ్లాడు. 20న ఆ ముగ్గురూ కారును అద్దెకు తీసుకుని మల్లాపూర్ చేరుకున్నారు. మృతదేహాన్ని కారులో కోనసీమ జిల్లాలోని కృష్ణలంకకు తరలించి గోదావరిలో విసిరేశారు. మొయినాబాద్‌లో ఉంటున్న సుజాత చెల్లెలు సువర్ణలత 24న సోదరి ఇంటికి రాగా.. ఆమె కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అద్దెకు ఉంటున్న అంజిబాబు కనిపించకపోవడంతో పట్టుకుని విచారించగా నేరం అంగీకరించాడు.

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- డ్రైవర్ నిర్లక్ష్యం.. కాళ్లు ఛిద్రమై వృద్ధురాలి మృతి [ 17-02-2026] ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఎస్ఐ ఎం.విజయ్ కథనం ప్రకారం.. కాప్రా సర్కిల్ కుషాయిగూడ నాగార్జునగర్‌లోని శుభోదయనగర్‌కు చెందిన చిట్యాల లక్ష్మీ (64) ఇళ్లలో పని చేసుకుంటూ జీవిస్తోంది.
- మరకత శివాలయాన్ని దర్శించుకున్న విజయేంద్ర ప్రసాద్ [ 17-02-2026] రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం చందిప్పలోని మరకత శివాలయాన్ని సీనియర్ రచయిత విజయేంద్ర ప్రసాద్ మంగళవారం దర్శించుకున్నారు.
- ఆకట్టుకున్న జాగిలాల విన్యాసాలు [ 17-02-2026] మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (ఐఐటీఏ)లో కెనైన్ (పోలీస్ డాగ్స్), కెనైన్ హ్యాండ్లర్ల పాసింగ్ అవుట్ పరేడ్‌ను మంగళవారం నిర్వహించారు.
- రైల్వే స్టేషన్ సమీపంలో మహిళ మృతదేహం [ 17-02-2026] శంకరపల్లి- నాగులపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం గుర్తు తెలియని మహిళ (50) మృతదేహం లభ్యమైంది.
- రెండోరోజు ఛైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య వాదోపవాదాలు [ 17-02-2026] ఇబ్రహీంపట్నం పురపాలక కేంద్రంలో రెండో రోజు ఛైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి.
- రామలింగేశ్వర స్వామికి అన్నాభిషేకం [ 17-02-2026] మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అయిదో రోజు మంగళవారం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి అన్నాభిషేకం, తైలాభిషేకం నిర్వహించారు.
- గుర్తుతెలియని వ్యక్తి హత్య [ 17-02-2026] మొయినాబాద్ మండలం కాసింబౌలి గ్రామంలోని రెయింబో క్రికెట్ గ్రౌండ్ పక్కన పంట పొలాల్లో గుర్తు తెలియని ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.
- మణికొండలో పగిలిన భారీ పైప్‌లైన్.. కాలనీలను ముంచెత్తిన వరద [ 17-02-2026] హైదరాబాద్‌లోని మణికొండలో భారీ పైప్‌లైన్ పగిలి పలు కాలనీల్లోకి పెద్ద ఎత్తున వరద చేరింది.
- పనిలో చేరగానే.. పసిడిపై కన్నేశాడు! [ 17-02-2026] బంగారు ఆభరణాల చోరీకి పాల్పడిన వ్యక్తిని సోమవారం రిమాండ్ చేసినట్టు ఖైరతాబాద్ డీసీపీ కె.శిల్పవల్లి తెలిపారు. 24 గంటల్లో నిందితుడిని పట్టుకున్న పంజాగుట్ట ఏసీపీ మురళీకృష్ణ, ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, డీఐ నాగరాజు, ఎస్సై సురేశ్‌ల బృందాన్ని అభినందించారు.
- ‘ఛే’జిక్కాయి [ 17-02-2026] గ్రేటర్ శివారులోని 11 మున్సిపాలిటీల్లో సోమవారం జరిగిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఆరు ఛైర్మన్ పదవులను కైవసం చేసుకుంది.
- రాజధానిగా జీహెచ్‌ఎంసీ [ 17-02-2026] అప్పటికీ.. ఇప్పటికీ.. జీహెచ్‌ఎంసీనే రాజధాని నగరంగా కొనసాగుతుందని.. అందుకు తగ్గట్లుగా పునర్విభజన జరిగిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ.కర్ణన్ స్పష్టం చేశారు.రాజధానిలో ఏయే సదుపాయాలు ఉండాలో..
- చీకట్లో మెరిసేలా.. వాహనదారులకు తెలిసేలా [ 17-02-2026] రాత్రి వేళ రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా రవాణా వాహనాలకు అమర్చే రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మార్కింగ్ ప్లేట్ల విషయంలో ఇకపై ‘క్యూఆర్’ ఆధారిత ధ్రువీకరణ తప్పనిసరి. కేంద్ర మోటారు వాహన నిబంధనల ప్రకారం ఈ కొత్త విధానం ఈ నెల 20 నుంచి అమల్లోకి రానుంది.
- ఇకపై అన్నీ అధిక లోడ్ ట్రాన్స్ ఫార్మర్లే [ 17-02-2026] నగరంలో ఇప్పటివరకు 100కేవీఏ, 160 కేవీఏ సామర్థ్యం కల్గిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు(డీటీఆర్) ఎక్కువగా కన్పించేవి. అధిక లోడు ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే 315కేవీఏ, 500కేవీఏ ఏర్పాటు చేసేవారు. రాబోయే రోజుల్లో ఎక్కువగా వీటినే ఏర్పాటు చేయబోతున్నారు.
- హైదరాబాద్ వీధుల్లో స్మార్ట్ పార్కింగ్ [ 17-02-2026] నగరంలో నిత్యం వేలమంది ఎదుర్కొంటున్న పార్కింగ్ సమస్యకు ‘స్మార్ట్ పార్కింగ్ ఆన్ స్ట్రీట్స్’ ప్రాజెక్టుతో జీహెచ్‌ఎంసీ పరిష్కారం చూపనుంది. మైజీహెచ్‌ఎంసీ మొబైల్ యాప్‌లో ప్రత్యేక లింకును అందుబాటులోకి తీసుకొచ్చి..
- కంట్లో టాటూ.. అతిపెద్ద పొరపాటు [ 17-02-2026] శరీరంపై టాటూలు వేసుకోవడం చాలామంది యువతకు ఇష్టమైన ఫ్యాషన్. కాళ్లు, చేతులు, పొట్ట, ఛాతీ, మెడ...ఇలా ఎక్కడ పడితే అక్కడ టాటూలతో హంగామా చేస్తుంటారు.
- కల నెరవేరింది.. ఆనందం దరిచేరింది [ 17-02-2026] వికారాబాద్ పుర ఎన్నికల్లో పోటీ చేసి ముగ్గురు మహిళలు విజయం సాధించడమే కాకుండా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. వీరిలో ఇద్దరు మొదటి సారి బరిలోకి దిగడం విశేషం.
- నైజీరియన్ల అనధికార నివాసం... 25 మంది పట్టివేత [ 17-02-2026] టోలిచౌకి ఠాణా పరిధిలోని పారామౌంట్, ఐఏఎస్‌కాలనీల్లో పోలీసులు సోమవారం రాత్రి కట్టడిముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా వీసా గడువు ముగిసినా అక్రమంగా ఇక్కడ నివాసముంటున్నారనే అనుమానంతో నైజీరియన్, సూడాన్, సోమాలియన్, ఇథియోపియా దేశాలకు చెందిన 25 మందిని అదుపులోకి తీసుకున్నారు.
- మహిళ హత్య.. పూజారికి యావజ్జీవ ఖైదు [ 17-02-2026] బంగారు నగల కోసం దేవాలయానికి వచ్చిన మహిళను హత్యచేసిన పూజారి మురళీకృష్ణకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ.7 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
- పాత నాణెం పంపిస్తే రూ.57 లక్షలిస్తా [ 17-02-2026] రూ.10 పాత నాణెం పంపిస్తే రూ.57 లక్షలు ఇస్తానంటూ సైబర్ నేరగాళ్లు సెంట్రింగ్ కార్మికుడి నుంచి రూ.1.67 లక్షలు కొట్టేశారు.
- ఇంట్లోనే మృతదేహం.. అడిగితే ఆగ్రహం [ 17-02-2026] నాలుగు రోజులుగా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంట్లోనే ఉంచి.. ప్రార్థనలు చేస్తున్నామంటూ వింతగా మాట్లాడిన కుటుంబంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- ఖాళీ బిస్కెట్ ప్యాకెట్లలో డ్రగ్స్.. ముగ్గురి అరెస్టు [ 17-02-2026] తిని పారేసిన ఖాళీ బిస్కెట్ ప్యాకెట్లలో డ్రగ్స్ నింపి డెడ్ డ్రాప్ విధానంలో విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును తెలంగాణ ఈగల్ ఛేదించింది.
- రాజధానిలో ఆ రౌడీషీటర్ల జాడెక్కడ! [ 17-02-2026] తెరవెనుక ఉంటూ బెదిరింపులు.. కుటుంబ తగాదాల్లో తలదూర్చి పంచాయితీలు.. ఆధిపత్యం సంపాదించేందుకు అక్రమ ఆయుధాలు.. అర్ధరాత్రి దాటాక హోటళ్ల వద్దకు చేరి మంతనాలు..
- చదువు పక్కన పెట్టి చోరీకి స్కెచ్ [ 17-02-2026] బుద్ధిగా చదువుకోవాల్సిన విద్యార్థులు అడ్డదారి తొక్కారు. తాము చదువుతున్న విద్యాసంస్థలోనే 60 ల్యాప్‌టాప్‌లను అపహరించి, పోలీసులకు చిక్కారు.
- నీటి గంట మోగాలి.. గుటుక్కుమనాలి [ 17-02-2026] విద్యార్థినులు, మహిళల్లో యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్లు (యూటీఐ) సమస్యలు పెరుగుతున్నాయి. అకడమిక్‌తో పాటు వివిధ పోటీ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. విద్యార్థినులు గంటల తరబడి తరగతి గదుల్లో ఉంటూ చదువుతున్నారు.
- జలమండలిలో మేనేజర్ సమస్య! [ 17-02-2026] మహా నగరంలో జలమండలి పరిధి విస్తరిస్తుండగా.. సిబ్బంది కొరత అంతకంతకూ పెరుగుతోంది. సేవలు విస్తృతమవుతుండగా.. అందుకనుగుణంగా ఉద్యోగులు, సిబ్బంది లేరు. పౌరసేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది.