ancient India: ప్రాచీన భారత వైజ్ఞానిక పాటవమిది!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

చరిత్ర అనగానే రాజులు, యుద్ధాలు, విప్లవాలు వంటివాటి ప్రస్తావనే ఉంటుంది. కానీ, ఆ బాహ్య పరిణామాల వెనక చింతనలో, మేధస్సులో జరిగే పరిణామాలు కూడా బలమైన ప్రభావం కలిగి ఉంటాయి. అందుకని, ఆయా దేశాల రాజకీయ చరిత్ర ఎంత ముఖ్యమో, వాటి వైజ్ఞానిక- మేధోచరిత్ర కూడా అంతే ముఖ్యం.
ఆధునిక భౌతిక శాస్త్ర చరిత్ర పుస్తకాల్లో ఓ ఘట్టం తరచూ ప్రస్తావనకు వస్తుంటుంది. గెలీలియో గెలీలీ అనే ఇటాలియన్ శాస్త్రవేత్త పీసా నగరంలోని వాలుసౌధం మీదికి ఎక్కి అక్కడి నుంచి రెండు రాళ్లు (ఒకటి పెద్దది, మరోటి చిన్నది) కింద పడేసి రెండూ ఒకేసారి నేలను చేరుకుంటున్నాయని చూపించారు. ఇది 16వ శతాబ్దం ఆఖర్లో జరిగింది. బరువుతో నిమిత్తం లేకుండా వస్తువులు గురుత్వాకర్షణ శక్తిని బట్టి ఒకేలా పడతాయని ఇప్పుడు ఆరో తరగతి పిల్లలకూ తెలుసు. మరి, గెలీలియో ప్రయోగానికి ప్రాధాన్యం ఏముంది? క్రీ.పూ. 4వ శతాబ్దానికి చెందిన అరిస్టాటిల్ అనే గ్రీకు తాత్వికుడు ప్రకృతిలో ఎన్నో పరిణామాల మీద వ్యాఖ్యానించారు. (వాటిలో చాలా వరకు తప్పని ఇప్పుడు మనకు తెలుసు!) ఆ క్రమంలో బరువైన వస్తువులు తేలికైన వస్తువులకన్నా వేగంగా పడతాయన్నారు అరిస్టాటిల్. ఆ తప్పును గెలీలియో ప్రయోగాత్మకంగా ఎత్తిచూపారు. ఈ ఘట్టాన్ని నేటి భౌతికశాస్త్ర చరిత్ర పుస్తకాలు గొప్పగా వివరిస్తాయి.
అద్భుత పరిణామాలు

పరిశోధనలోనూ ఆత్మనిర్భరత
క్యాల్కులస్‌ను కనిపెట్టింది ఐసాక్ న్యూటన్ (క్రీ.శ. 1643-1721) అని చదువుకున్నాం. కేరళలో సంగమ గ్రామానికి చెందిన మాధవుడు (క్రీ.శ. 1340-1425) అనే గణితవేత్త క్యాల్కులస్‌కు మూలకర్త అని ఇటీవలి కాలంలో గణిత సమాజం అంగీకరిస్తోంది. క్యాల్కులస్‌కు మూలస్తంభాలైన అవకలన, వ్యవకలనాలను నిర్వచించి వాటిని ఎలా ప్రయోగించాలో వర్ణించారు. అందుకే టేలర్ సిరీస్‌ను ఇంటర్మీడియెట్ గణిత పుస్తకాల్లో ఇప్పుడు మాధవ-టేలర్ సిరీస్ అని పిలుస్తున్నారు. ఒక్క గణితంలోనే కాకుండా, ఖగోళ, లోహవిజ్ఞానం, భాషా శాస్త్రం, జీవ, వైద్య శాస్త్రాల్లో సైతం ప్రాచీన భారతీయులు సాధించిన పురోగతిని చరిత్రకారులు జనసామాన్యంలో ప్రచారం చెయ్యాలి. సుదీర్ఘ విజ్ఞాన శాస్త్ర చరిత్రలో భారతీయులకు సముచిత స్థానాన్ని కల్పిస్తూ, అంతర్జాతీయ వైజ్ఞానిక చరిత్ర పుస్తకాలను రాయాలి. కేవలం ఉత్పత్తుల రంగంలోనే కాకుండా, పరిశోధనా రంగంలోనూ ఆత్మనిర్భరత సాధించడానికి ఇలాంటి సాహిత్యం స్ఫూర్తిని కల్పిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో చాలా దేశాలు తమ సైనిక పాటవాన్ని పెంచుకోవడంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో రక్షణ సామగ్రి కొనుగోళ్లు, వాటి రూపకల్పన, బలగాల ఆధునికీకరణ, పరిశోధన-అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ), మౌలిక వసతుల కల్పన వంటి వాటిపై ఖర్చును పెంచుతున్నాయి. 2024లో ఆయా దేశాల జీడీపీలో సైనిక వ్యయం... (శాతాల్లో)
