శ్వాసే నేను

Eenadu icon
By Editorial Team Published : 08 Jun 2026 01:38 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

‘నేను ఎవరు?’ అనే అన్వేషణ మనిషిని అనాదిగా వెంటాడుతున్న అతి పెద్ద ప్రశ్న. దేహం మారుతుంది. ఆలోచనలు మారతాయి. భావోద్వేగాలు అలల్లా వచ్చి పోతుంటాయి. కానీ పుట్టినప్పటి నుంచి మరణం వరకు ప్రాణితో నిరంతర బంధాన్ని కలిగి ఉండేది శ్వాస మాత్రమే.

శ్వాస భౌతిక దేహానికి, ఆత్మకు మధ్య ఉండే ఒక సన్నటి పొర. మనసు వేగంగా పరుగెడుతున్నప్పుడు అస్తవ్యస్తంగా ఉండే శ్వాస, ప్రశాంతంగా ఉన్నప్పుడు లయబద్ధంగా సాగుతుంది. అంటే శ్వాసను గమనించడం ద్వారా మనం మన మనసును, ఆలోచనలను నియంత్రించవచ్చు. గాలి పీల్చుకోవడం విడిచిపెట్టడం ఒక ప్రక్రియ మాత్రమే కాదు. అది మనలోని ప్రాణశక్తి. నేను ఎవరు? అనే ప్రశ్న తలెత్తినప్పుడు, ఆత్మ పరిశోధనకు అదే మూలమని సాధకులు భావిస్తారు. ఈ ప్రశ్నకు శ్వాస సరైన సమాధానం. అదే జీవశక్తి. శరీరం ఒక సాధనం మాత్రమే. శ్వాస దానికి జీవనాధారం. జగత్తు మాయ అని శ్వాస ద్వారానే అనుభవంలోకి వస్తుంది.

రమణ మహర్షి ఉపదేశ సారంలో శ్వాస, ధ్యానం, ప్రాణాయామాలు ఆత్మజ్ఞానానికి దోహదపడతాయన్నారు. శ్వాసలో ఆత్మను చూడటం, హృదయ కుహరంలో ఏకాగ్రత కల్పించడం ద్వారా మనసు లయబద్ధంగా మారుతుందని తెలిపారు. శ్వాస ద్వారానే నేను అనే భావం మనిషిలో ఏర్పడుతుంది. దాన్ని గమనిస్తే మనమెవరమో మనకు స్పష్టత వస్తుంది. అప్పుడు ఆధ్యాత్మిక జీవితానికి మార్గం సుగమం అవుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ప్రతి శ్వాస మనకు ఒక పరమార్థాన్ని బోధిస్తుంది. గాలిని లోపలికి తీసుకున్నప్పుడు సో (పరమాత్మ) అనే ధ్వని, బయటకు వదిలేటప్పుడు హం(నేను) అనే ధ్వని సూక్ష్మంగా వినిపిస్తాయి. దీన్ని సోహం అజపా గాయత్రి (జపం చేయకుండా జపించే సహజ స్థితి) లేదా హంస గాయత్రి అంటారు. ‘నేను పరమాత్మ స్వరూపాన్ని’ అని దానికి అర్థం. సాధారణంగా నేను వేరు, దైవం వేరు అనే భావనలో ఉంటాం. కానీ సోహం మంత్రం నీలో ఉన్న చైతన్యమే విశ్వమంతా ఉందని గుర్తుచేస్తుంది. మనం శ్వాసగా మారినప్పుడు మనలోని అహం కరిగిపోయి విశ్వచైతన్యంతో మమేకమవుతాం. శ్వాసకు గతం లేదు. భవిష్యత్తు లేదు. అది ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. శ్వాసపై ధ్యాస పెట్టినప్పుడు మన ఆలోచనలు గతకాలపు వేదనల నుంచి, భవిష్యత్తు ఆందోళనల నుంచి విముక్తి పొందుతాయి. కేవలం ఈ క్షణంలో జీవించడం అలవడుతుంది అంటారు జిడ్డు కృష్ణమూర్తి. ఆ స్థితిలోనే మనిషికి అసలైన శాంతి, స్థితప్రజ్ఞత లభిస్తాయి. అప్పుడు నిజస్వరూపం బోధపడుతుంది.

నేను శ్వాసను అని గుర్తించడం అంటే మన ఉనికిని మనం తెలుసుకోవడమే. శ్వాస మన ప్రమేయం లేకుండా సహజంగా జరుగుతుంది. ఈ శ్వాస ప్రక్రియను గమనించగలిగితే జనన మరణాలకు అతీతమైన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. సోహం ఆత్మ పరమాత్మల ఏకత్వాన్ని తెలియజేస్తుంది. ఇంతటి మహిమాన్వితమైన శ్వాసను ధూమపానంతో, మాదకద్రవ్యాలతో కలుషితం చేసుకుంటే అనారోగ్యం, ఆయుక్షీణతలకు మనమే కారణమవుతాం.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • దైవిక లక్షణం... క్షమ జీవితంలో ముందుకు సాగడం అంటే సవాళ్లను దాటుకుంటూ, వాటి నుంచి నేర్చుకుంటూ ఎదగడమే. అయితే అప్పుడప్పుడు అవాంఛనీయ పరీక్షలు కూడా ఎదురవుతాయి- ఇతరుల అజ్ఞానం వల్ల కలిగే ఇబ్బందుల రూపంలో! కొందరు మాటలతో నొప్పిస్తారు, మరికొందరు చేతలతో నష్టం కలిగిస్తారు. 
  • శ్రమయేవ జయతే! శ్రమను జీవనసౌందర్యంగా అభివర్ణిస్తారు భారతీయులు. మన పురాణాలు, ధార్మిక గ్రంథాలు శారీరక శ్రమ ప్రాధాన్యాన్ని పలు సందర్భాలలో నొక్కి చెప్పాయి. మహాభారతం శాంతిపర్వంలో భీష్మపితామహుడు ధర్మరాజుకు రాజధర్మాలను బోధించే సందర్భంలో అదృష్టం శ్రమించేవాడి వెంటే నడుస్తుంది...
  • సంతృప్తికర జీవనం నిజమైన సంపద అంటే ఏమిటి? మనం కష్టపడి సంపాదించిన ధనం, అధికారం, పేరు ప్రతిష్ఠలు తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వవచ్చు. కానీ, మనసు ప్రశాంతంగా, తృప్తిగా ఉన్నప్పుడే నిజమైన ఆనందం సొంతమవుతుంది.
  • తరిగిపోని ఆస్తి మనిషన్నాక ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత ఆస్తి కచ్చితంగా ఉంటుంది. ధనవంతుడికైతే ఏడుతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి. ఆ ధీమాతో అతడు ఏ చీకూచింతా లేకుండా జీవితాన్ని గడిపేస్తూంటాడు.
  • సూత్రధారులు- పాత్రధారులు జగన్నాటకంలో మనుషులంతా పాత్రధారులే. కొందరే సూత్రధారులుగా పేరొందుతారు. కొందరి జీవితం దీపంలా పరిమిత వెలుగులను పంచితే మరికొందరి జీవితం సూర్యుడిలా ప్రపంచానికే వెలుగిస్తుంది.
  • తలచినవారికి తలచినట్లుగా... మూడు కోట్లమంది దేవతలు ఉన్నారని చాలామంది నమ్మకం. కష్టాల్లో ఉన్నప్పుడు ఏ దేవుణ్ని ప్రార్థించాలన్న సందేహం కూడా వారికి కలుగుతుంటుంది.
  • గుహుడి భక్తి రామాయణ మహాకావ్యంలో భక్తిరసానికి పరాకాష్ఠగా నిలిచే ఘట్టాల్లో నిషాదరాజు గుహుడి వృత్తాంతం అద్వితీయమైనది. పితృవాక్య పరిపాలన కోసం అడవులకు బయలుదేరిన దాశరథికి గంగాతీరంలో ఎదురైన తొలి ప్రేమామృతం గుహుడు.
  • పలకరింపు జీవితం అనేది అనేక బంధాలతో అల్లుకున్న అందమైన గూడు వంటిది. ఆ గూడు బలంగా ఉండటానికి ఒకే ఒక రహస్యం ఉంది... అదే పలకరింపు. మాటలతో గానీ, స్మరణతో గానీ రోజూ తాకని బంధం క్రమంగా బలహీనమవుతుంది.
  • వేదాలు నీ నివాసం మనిషి చరిత్ర ఎన్నో యుగాలు దాటినా అతడిలో కొన్ని ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి.
  • బలి చక్రవర్తీ! భళీ భళీ!! ‘వందమందిలో ఒక శూరుడు పుడతాడు. వెయ్యి మందిలో ఒక పండితుడు ఉంటాడు. లక్షమందిలో ఒక వక్త పుడతాడు. కానీ అంతమందిలోనూ ఒక దాత ఉంటాడో లేదో!’ అన్నారు. దానానికి ఉన్న ప్రశస్తి అలాంటిది.
  • తాపత్రయం! ‘ఎందుకీ తాపత్రయం?’ అనే ప్రశ్న తరచూ వింటూ ఉంటాం. అసలు ‘తాపత్రయం’ అంటే ఏంటో తెలుసుకోవాలంటే మోక్షం గురించి తెలియాలి.
  • కాల పరీక్ష జీవితంలో అన్నిటికన్నా కష్టమైన పరీక్ష ఏది స్వామీ? అడిగాడు శిష్యుడు. గురువు చిరునవ్వుతో... భగవంతుడు పెట్టే పరీక్షలను తట్టుకుంటూ, సమయం వచ్చేదాకా ఓపికగా వేచి ఉండటమే అసలైన పరీక్ష నాయనా అన్నారు. ఆ సమాధానం శిష్యుణ్ని ఆలోచనలో పడేసింది.
  • ఉత్తమోత్తమ ప్రార్థన మనిషి అనుభవించే లోతైన అనుభూతులలో ప్రార్థన ఒకటి. అది కేవలం ఆరాధనలో భాగమే కాదు; మన అంతరంగానికి, విశ్వశక్తికి మధ్య నిరంతరం ప్రవహించే నది లాంటిది.
  • అహం ఆడే ఆట మనిషి ఎప్పుడూ తనకు తాను సక్రమంగా ఉన్నాననే భావనలో ఉంటాడు. ఏ విషయంలోనైనా సరే, తనపై తనకు అంచనాలు ఎక్కువగా ఉంటాయి. నిజానికి ‘అహం’ ఎంత బలంగా ఉంటే జీవితంలో అంతగా పోరాడాల్సివస్తుంది.
  • కాలమహిమ కాలానిది నిరంతర ప్రయాణం. ఆగదు.. ఆపడానికి వీలవదు. క్షణం ఆలస్యమైనా తీసుకురాలేనిది కాలం ఒక్కటే. కాలం కొట్టే దెబ్బలు, చెప్పే పాఠాలు భరించనివారు దాదాపుగా నర వానర రాక్షస దేవతా గణాలలో లేరని చెప్పవచ్చు. కాలం చెప్పిన మాట మనిషి వినాలి. మనిషి వివరించే పని కాలం చేయదు. 
  • అంతా మంచివాళ్లే కానీ... ‘పురుషులందు పుణ్యపురుషులు వేరయా’ అన్నాడు వేమన. కానీ, ఇవాళ చూస్తే అసలు పుణ్యపురుషులు ఏరయా? అన్న ప్రశ్న ఉదయిస్తోంది.
  • కడుపుమంట లోకంలో మనకన్నా ఎవరైనా పై స్థాయిలో కనిపించినా, మనకన్నా వారికి ఎక్కువ ఉందనిపించినా, మనకన్నా ఎదుటి వాడు ఎందులో గొప్ప? అనే ఆలోచన వచ్చినా... మనకు తెలియకుండానే లోలోపల అలజడి చెలరేగుతుంది. దాని పేరే- అసూయ లేదా కడుపుమంట. నిజానికి అది ఈనాటిది కాదు. ఆకాశం ఏనాటిదో- అసూయ ఆనాటిది.
  • వెలుగు మంత్రం సూర్యభగవానుడు ఇచ్చే వెలుగే లోకాలన్నిటికి ఆధారం. ఆయన పక్కకు జరిగితే అందరికీ, అంతటా చీకటే. మళ్లీ ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తాం.
  • వస్తా వట్టిదె... మనిషి జీవిత ప్రయాణం విచిత్రమైన వైరుధ్యాల సమాహారం. ఖాళీ చేతులతో పుడతాడు, ఖాళీ చేతులతోనే వెళ్లిపోతాడు. కానీ మధ్యలో మాత్రం ఇది నాది, అది నాది అనే మమకారాల వలలో చిక్కుకుని తనను తాను మరచిపోతాడు. ఈ సత్యాన్ని మనకు బలంగా గుర్తుచేసే ఒక ఘట్టం మహాభారతంలో కనిపిస్తుంది. గాంధారి శాపానంతరం యదు వంశం నాశనమైపోయింది.
  • అన్నకు తగ్గ తమ్ముడు అన్నదమ్ముల అనుబంధానికి నిర్వచనం రామలక్ష్మణులు. రాముడితోడిదే లక్ష్మణుడి లోకం. అతడు పక్కన లేకపోతే మృష్టాన్న భోజనమైనా రాముడికి సహించేది కాదట.