దైవిక లక్షణం... క్షమ

Eenadu icon
By Editorial Team Published : 09 Jun 2026 02:34 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

జీవితంలో ముందుకు సాగడం అంటే సవాళ్లను దాటుకుంటూ, వాటి నుంచి నేర్చుకుంటూ ఎదగడమే. అయితే అప్పుడప్పుడు అవాంఛనీయ పరీక్షలు కూడా ఎదురవుతాయి- ఇతరుల అజ్ఞానం వల్ల కలిగే ఇబ్బందుల రూపంలో! కొందరు మాటలతో నొప్పిస్తారు, మరికొందరు చేతలతో నష్టం కలిగిస్తారు. ఈ తప్పులు కొన్ని అనుకోకుండా జరిగితే, కొన్ని ఉద్దేశపూర్వకంగా జరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలి? ఎందుకంటే ఆ స్పందన మన భవిష్యత్తు ఆలోచనల దిశను, వ్యక్తిత్వ స్వరూపాన్ని కూడా మార్చవచ్చు. 

ఎదుటివారు కలిగించిన ఇబ్బందుల గురించే ఆలోచిస్తూ వేదనకు లోనవుతామా? ప్రతీకార భావాలతో మన శక్తిని దహించుకుంటామా? వారి అజ్ఞానాన్ని క్షమించి, మన లక్ష్యాల దిశగా ముందుకు సాగిపోతామా? ఏం చేయాలో మనమే నిర్ణయించుకోవాలి. ద్వేషం మన ఆలోచనలను గతానికి బంధిస్తుంది, మేధస్సును మసకబారుస్తుంది, ద్వేషాన్ని వదిలేయగలిగిన మనసుకే కొత్త అవకాశాలను చూడగల శక్తి ఉంటుంది. క్షమించగలిగితే తేలికపడిన మనసుతో స్వేచ్ఛగా జీవిస్తారు, దృఢంగా ఎదుగుతారు. మనలోని శాంతే మన అభివృద్ధికి మొదటి మెట్టు. క్షమాగుణం మనసును ప్రశాంతపరుస్తుంది, ఆలోచనల్లో స్పష్టత తెస్తుంది. కోపంతో కాలం వృథా చేస్తే లాభమేమీ ఉండదు. లక్ష్యాలపై దృష్టి పెట్టడమే వివేకం. క్షమించడం ఇతరులకు చేసే ఉపకారం కాదు; మనకు మనమే ఇచ్చుకునే బహుమతి. 

క్షమించడం వ్యక్తిగత ప్రయోజనానికే కాదు, సామూహిక అభివృద్ధికీ దోహదపడుతుంది. వ్యక్తులు తమ ప్రతిభను పూర్తి స్థాయిలో వినియోగించుకోగలుగుతారు. అనవసర సంఘర్షణలు తగ్గి, సమన్వయం పెరుగుతుంది. ఫలితంగా వ్యక్తిగతంగా వ్యవస్థాపరంగా ఉన్నతస్థాయికి చేరవచ్చు. అరణ్యవాసం రాముణ్ని ఎన్నో కష్టాలపాలు చేసింది. అయినా ఆయన అందుకు కారణమైన కైకేయిని క్షమించాడు. క్షమ దైవిక లక్షణం. అదే రాముణ్ని ఆదర్శపురుషుడిగా నిలబెట్టింది. క్షమించే వ్యక్తి బలహీనుడు కాదు, నిజమైన బలవంతుడు. ఎందుకంటే అతడు తన మనసునే జయించినవాడు.

క్షమయా విష్ఠితం జగత్‌... ఈ ప్రపంచం క్షమ అనే మూలం మీదే నిలబడింది. సమాజంలో ఒకరినొకరు క్షమించుకోగలిగినప్పుడే సంబంధాలు మెరుగుపడతాయి. క్షమాగుణం సహనాన్ని పెంచుతుంది, కోపాన్ని తగ్గిస్తుంది, వినే శక్తిని ఇస్తుంది, మాటలో మాధుర్యాన్ని నింపుతుంది. ఒకరి క్షమ మరొకరిని మార్చగలదు. ధర్మవృక్షానికి క్షమే తల్లి వేరు అని పురాణాలు చెబుతున్నాయి. అక్కడి నుంచే మన మంచితనం, అభివృద్ధి మొలకెత్తుతాయి. కాబట్టి ఎదుటివారి చిన్న తప్పులను వదిలేద్దాం. మనం నిర్దేశించుకున్న పెద్ద లక్ష్యాలపై దృష్టి పెడదాం. అప్పుడు మిగిలేది ప్రశాంతత; దాని ఫలితం ఉన్నతి. క్షమించగల మనసు మనిషినే కాదు- ఒక సమాజాన్నే మార్చగలదు. అందుకే క్షమను మన జీవన విధానంగా మార్చుకుందాం!  

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఏదీ అసాధ్యం కాదు రామాయణంలో విశ్వామిత్రుడు చెప్పిన గంగావతరణ ఘట్టం విశిష్టమైనది. పట్టుదలతో, అచంచల దీక్షతో పనిచేస్తే ఏదీ అసాధ్యం కాదని నిరూపించే గొప్ప సందేశాత్మక గాథ ఇది.
  • దృఢవ్రతుడు! భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ‘వ్రతం’ అంటే కేవలం ఒక పూజో ఉపవాసమో కాదు. మనసు, మాట, కర్మ... మూడింటినీ ఒక లక్ష్యంపై స్థిరంగా నిలపడం. మన సంస్కృతిలో వ్యక్తిత్వాన్ని కొలిచే ప్రమాణం సంపద కాదు, పదవి కాదు; సంకల్ప స్థిరత్వం. అలాంటి స్థిరచిత్తుణ్ని శాస్త్రాలు ‘దృఢవ్రతుడు’ అని సంబోధించాయి.
  • సంబంధ బాంధవ్యాలు మనుషులందరూ అనుబంధానికి, ఆత్మీయతకు పట్టంకడుతూ ఒకరికొకరు తోడుగా ఉండాలని భారతీయ సంస్కృతి బోధిస్తోంది.
  • శ్వాసే నేను ‘నేను ఎవరు?’ అనే అన్వేషణ మనిషిని అనాదిగా వెంటాడుతున్న అతి పెద్ద ప్రశ్న. దేహం మారుతుంది. ఆలోచనలు మారతాయి. భావోద్వేగాలు అలల్లా వచ్చి పోతుంటాయి. కానీ పుట్టినప్పటి నుంచి మరణం వరకు ప్రాణితో నిరంతర బంధాన్ని కలిగి ఉండేది శ్వాస మాత్రమే. 
  • శ్రమయేవ జయతే! శ్రమను జీవనసౌందర్యంగా అభివర్ణిస్తారు భారతీయులు. మన పురాణాలు, ధార్మిక గ్రంథాలు శారీరక శ్రమ ప్రాధాన్యాన్ని పలు సందర్భాలలో నొక్కి చెప్పాయి. మహాభారతం శాంతిపర్వంలో భీష్మపితామహుడు ధర్మరాజుకు రాజధర్మాలను బోధించే సందర్భంలో అదృష్టం శ్రమించేవాడి వెంటే నడుస్తుంది...
  • సంతృప్తికర జీవనం నిజమైన సంపద అంటే ఏమిటి? మనం కష్టపడి సంపాదించిన ధనం, అధికారం, పేరు ప్రతిష్ఠలు తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వవచ్చు. కానీ, మనసు ప్రశాంతంగా, తృప్తిగా ఉన్నప్పుడే నిజమైన ఆనందం సొంతమవుతుంది.
  • తరిగిపోని ఆస్తి మనిషన్నాక ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత ఆస్తి కచ్చితంగా ఉంటుంది. ధనవంతుడికైతే ఏడుతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి. ఆ ధీమాతో అతడు ఏ చీకూచింతా లేకుండా జీవితాన్ని గడిపేస్తూంటాడు.
  • సూత్రధారులు- పాత్రధారులు జగన్నాటకంలో మనుషులంతా పాత్రధారులే. కొందరే సూత్రధారులుగా పేరొందుతారు. కొందరి జీవితం దీపంలా పరిమిత వెలుగులను పంచితే మరికొందరి జీవితం సూర్యుడిలా ప్రపంచానికే వెలుగిస్తుంది.
  • తలచినవారికి తలచినట్లుగా... మూడు కోట్లమంది దేవతలు ఉన్నారని చాలామంది నమ్మకం. కష్టాల్లో ఉన్నప్పుడు ఏ దేవుణ్ని ప్రార్థించాలన్న సందేహం కూడా వారికి కలుగుతుంటుంది.
  • గుహుడి భక్తి రామాయణ మహాకావ్యంలో భక్తిరసానికి పరాకాష్ఠగా నిలిచే ఘట్టాల్లో నిషాదరాజు గుహుడి వృత్తాంతం అద్వితీయమైనది. పితృవాక్య పరిపాలన కోసం అడవులకు బయలుదేరిన దాశరథికి గంగాతీరంలో ఎదురైన తొలి ప్రేమామృతం గుహుడు.
  • పలకరింపు జీవితం అనేది అనేక బంధాలతో అల్లుకున్న అందమైన గూడు వంటిది. ఆ గూడు బలంగా ఉండటానికి ఒకే ఒక రహస్యం ఉంది... అదే పలకరింపు. మాటలతో గానీ, స్మరణతో గానీ రోజూ తాకని బంధం క్రమంగా బలహీనమవుతుంది.
  • వేదాలు నీ నివాసం మనిషి చరిత్ర ఎన్నో యుగాలు దాటినా అతడిలో కొన్ని ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి.
  • బలి చక్రవర్తీ! భళీ భళీ!! ‘వందమందిలో ఒక శూరుడు పుడతాడు. వెయ్యి మందిలో ఒక పండితుడు ఉంటాడు. లక్షమందిలో ఒక వక్త పుడతాడు. కానీ అంతమందిలోనూ ఒక దాత ఉంటాడో లేదో!’ అన్నారు. దానానికి ఉన్న ప్రశస్తి అలాంటిది.
  • తాపత్రయం! ‘ఎందుకీ తాపత్రయం?’ అనే ప్రశ్న తరచూ వింటూ ఉంటాం. అసలు ‘తాపత్రయం’ అంటే ఏంటో తెలుసుకోవాలంటే మోక్షం గురించి తెలియాలి.
  • కాల పరీక్ష జీవితంలో అన్నిటికన్నా కష్టమైన పరీక్ష ఏది స్వామీ? అడిగాడు శిష్యుడు. గురువు చిరునవ్వుతో... భగవంతుడు పెట్టే పరీక్షలను తట్టుకుంటూ, సమయం వచ్చేదాకా ఓపికగా వేచి ఉండటమే అసలైన పరీక్ష నాయనా అన్నారు. ఆ సమాధానం శిష్యుణ్ని ఆలోచనలో పడేసింది.
  • ఉత్తమోత్తమ ప్రార్థన మనిషి అనుభవించే లోతైన అనుభూతులలో ప్రార్థన ఒకటి. అది కేవలం ఆరాధనలో భాగమే కాదు; మన అంతరంగానికి, విశ్వశక్తికి మధ్య నిరంతరం ప్రవహించే నది లాంటిది.
  • అహం ఆడే ఆట మనిషి ఎప్పుడూ తనకు తాను సక్రమంగా ఉన్నాననే భావనలో ఉంటాడు. ఏ విషయంలోనైనా సరే, తనపై తనకు అంచనాలు ఎక్కువగా ఉంటాయి. నిజానికి ‘అహం’ ఎంత బలంగా ఉంటే జీవితంలో అంతగా పోరాడాల్సివస్తుంది.
  • కాలమహిమ కాలానిది నిరంతర ప్రయాణం. ఆగదు.. ఆపడానికి వీలవదు. క్షణం ఆలస్యమైనా తీసుకురాలేనిది కాలం ఒక్కటే. కాలం కొట్టే దెబ్బలు, చెప్పే పాఠాలు భరించనివారు దాదాపుగా నర వానర రాక్షస దేవతా గణాలలో లేరని చెప్పవచ్చు. కాలం చెప్పిన మాట మనిషి వినాలి. మనిషి వివరించే పని కాలం చేయదు. 
  • అంతా మంచివాళ్లే కానీ... ‘పురుషులందు పుణ్యపురుషులు వేరయా’ అన్నాడు వేమన. కానీ, ఇవాళ చూస్తే అసలు పుణ్యపురుషులు ఏరయా? అన్న ప్రశ్న ఉదయిస్తోంది.
  • కడుపుమంట లోకంలో మనకన్నా ఎవరైనా పై స్థాయిలో కనిపించినా, మనకన్నా వారికి ఎక్కువ ఉందనిపించినా, మనకన్నా ఎదుటి వాడు ఎందులో గొప్ప? అనే ఆలోచన వచ్చినా... మనకు తెలియకుండానే లోలోపల అలజడి చెలరేగుతుంది. దాని పేరే- అసూయ లేదా కడుపుమంట. నిజానికి అది ఈనాటిది కాదు. ఆకాశం ఏనాటిదో- అసూయ ఆనాటిది.