ప్రేమరాహిత్యం

- A
- A+
- A++

‘దిస్ ఈజ్ నాట్ ఎ లవర్స్ కార్నర్’... విశాఖపట్నంలోని ఒక కాలనీ పార్కు దగ్గర కనిపించిన బోర్డు ఇది. సాయంత్రం వాహనాలపై జంటలుగా వచ్చి ముచ్చట్లాడుకునే యువతీ యువకుల్ని చూసి గిట్టని పెద్దలు పెట్టారు. ప్రేమ గురించి వాళ్లకేం తెలుసు పాపం... అనుకున్నారేమో యువత మాత్రం పట్టించుకోకుండా వస్తూనే ఉంటారు. అసలింతకీ ప్రేమంటే ఏంటి? యువతీ యువకుల మధ్య కలిగే ఆకర్షణ మాత్రమేనా ప్రేమంటే? గాలి వీచినట్లు, పువ్వులు పూసినట్లు, నీరు ప్రవహించినట్లు ప్రేమ సహజంగా జరిగిపోతుంది అంటారొక భావకవి. ఆత్మను ఆత్మను కలిపి కుట్టే దారమే ప్రేమంటారు బసవరాజు అప్పారావు. మరి, కొందరు పెద్దలకెందుకు అదంటే గిట్టదు?
ప్రేమ బంధాల మూలంగా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, మానవ సంబంధాలు మట్టి కలిసి పోతున్నాయని కవిత్వమూ కథలూ రాస్తున్నారు. ప్రేమ, మోహం, కామం... వీటి మధ్య తేడా లేకుండా పోతోందని గోల పెట్టేవారూ ఉన్నారు. కానీ, అసలు మనిషనేవాడు ఎవరినీ ప్రేమించకుండా ఉండగలడా?
ప్రసిద్ధ రచయిత రామా చంద్రమౌళి ‘లోపలి ఖాళీ’ అనే విలక్షణమైన కథ రాశారు. ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి తాను మనుషులను ప్రేమించలేక పోతున్నానని చెబుతాడు. ఒక మనిషి మరో మనిషిని, ఆ మాటకొస్తే ఏ జీవినైనా ప్రేమించగలగడం మానవీయ లక్షణం. మరొకరి ప్రేమను పొందగలగడమూ అదృష్టమే. అయితే ప్రొఫెసర్ సమస్యకు డాక్టర్ సమాధానం చెప్పలేకపోతాడు. ప్రేమించలేకపోవడం కూడా ఒక వ్యాధేనా అని ఆ వైద్యుడికీ సందేహం కలుగుతుంది. ఆ ప్రొఫెసర్ ఒంటరివాడేం కాదు, భార్య లేకపోయినా కొడుకు కోడలు మనవలతో కలిసే ఉంటున్నాడు. అయితే చాలా కుటుంబాల్లోలాగే ఆ ఇంట్లోనూ ఎవరి జీవితం వారిది. ఉద్యోగాలు, చదువులు, పార్టీలు, ఫంక్షన్లు. ఆయనతో కూర్చుని కబుర్లు చెప్పే తీరిక లేదెవరికీ! ఇది జనరేషన్ గ్యాప్ అనీ ప్రస్తుతం అందరూ అలాగే ఉన్నారనీ దాని గురించి అతిగా ఆలోచించవద్దనీ సలహా ఇస్తాడు డాక్టర్. కానీ ప్రేమరాహిత్యం అరాచకత్వంలా అనిపిస్తుంది ప్రొఫెసర్‌కి.
నాలుగోసారి డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు తన సమస్యకు పరిష్కారం దొరికిందని డాక్టర్‌కి సంతోషంగా చెప్పి తన ఫోనులో ఒక వీడియో చూపిస్తాడు ప్రొఫెసర్. అందులో ఒక పాప కిలకిలా నవ్వుతుంటుంది. ఒక పెద్దావిడ ఆ పాప దగ్గరికి వెళ్లింది. అపరిచితురాలైన ఆ స్త్రీమూర్తి చెక్కిళ్లపై తన లేత చేతులను వేసి నిమిరింది పాప. ఆ స్త్రీ పారవశ్యంతో వంగి పాపను ముద్దాడింది. ఆ దృశ్యం చూపించి ‘వాళ్లిద్దరి మధ్య ఉన్నది స్వచ్ఛమైన, నిర్మలమైన అనురాగం. ప్రేమంటే అదే. ఒక మనిషిని ప్రేమించాలంటే హృదయం పరిశుభ్రమైన ఖాళీ గ్లాసులా ఉండాలి’ అని వివరిస్తాడు ప్రొఫెసర్. ఈ యాంత్రిక జీవనంలో అది సాధ్యమా? సాధ్యమైతే ఆదర్శనీయమే!
ప్రభుత్వాల పనితీరును నిశితంగా పరిశీలించడం, ప్రజాసమస్యలపై లోతుగా చర్చించడం చట్టసభల కర్తవ్యం. ప్రభుత్వం ప్రతిపాదించే బిల్లులను కూలంకషంగా పరిశీలించి వాటిలో తప్పొప్పులు గుర్తించడమూ వాటి విధి. ఇవన్నీ జరగాలంటే చట్టసభలు తగినన్ని రోజులు సమావేశం కావాలి. కానీ, నిరుడు 27 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలు సగటున 24 రోజులే భేటీ అయ్యాయి. జాతీయ సగటుతో పోలిస్తే కొన్ని చోట్ల శాసనసభలు ఇంకా తక్కువ రోజులు కొలువుతీరాయి. అవి ఎన్ని రోజులు సమావేశమయ్యాయంటే...


వ్యాపారం అనేది అర్థవంతంగా ఉండాలి. ప్రజలకు సంబంధించిన ఏదైనా ఒక అవసరాన్ని అది తీర్చాలి. కొందరికి ఉపాధి కల్పించడమూ, మనం లాభాలు సంపాదించడమూ అనేవి వ్యాపారం తాలూకు ఉప ఉత్పత్తులు. వినియోగదారుణ్ని సంతృప్తి పరచలేకపోతే అవేవీ ఉండవు.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.