CM Chandrababu: తిరుపతి జిల్లాలో దుగరాజపట్నం పోర్టు

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 30 Dec 2025 04:58 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

ఈనాడు, అమరావతి: తిరుపతి జిల్లాలో దుగరాజపట్నం వద్ద ఓడరేవు నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అక్కడ నౌకా నిర్మాణ కేంద్రం కూడా వస్తుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఓడరేవు ఏర్పాటుకు అనువైన ప్రదేశం అన్వేషించాలని ఆదేశించారు. పోర్టు ఏర్పాటుకు నరసాపురం వద్ద అనువుగా ఉంటుందేమో చూడాలని సూచించారు. అక్కడ ఓడరేవు నిర్మాణానికి తగినంత భూములు లేవని రోడ్లు, భవనాలు, రవాణా, ఐఅండ్‌ఐ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ కాకపోతే పోర్టు నిర్మాణానికి అనువైన ప్రదేశం ఎక్కడుందో చూడాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి ముఖ్యమంత్రి సూచించారు. సోమవారం మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో కొత్త ఓడరేవులు, విమానాశ్రయాల అభివృద్ధి అవసరాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

రాష్ట్రంలో సుదీర్ఘ సముద్ర తీరం ఉన్నందున పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసి, ఎయిర్‌ కనెక్టివిటీ పెంపొందిస్తే పరిశ్రమలు వస్తాయని ఆయన తెలిపారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పన్నుల రూపంలో ఆదాయం వస్తుందని, అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు ఉందని, తిరుపతి జిల్లాలో దుగరాజపట్నం, ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టులు వస్తే ఆ ప్రాంతం మొత్తం ఒక కారిడార్‌లా అభివృద్ధి చెందుతుందన్నారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన ప్రక్రియల్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. వాటితో పాటు దొనకొండ, నాగార్జునసాగర్, బొబ్బిలిల్లోని ఎయిర్‌స్ట్రిప్‌లను అభివృద్ధి చేద్దామని చెప్పారు. ఒంగోలులో విమానాశ్రయ నిర్మాణం గురించి మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రస్తావించగా తదుపరి దశలో చేపడదామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడికైనా గంట ప్రయాణంలో చేరుకోగలిగేలా కనెక్టివిటీ పెరిగితే పరిశ్రమలు వస్తాయని ఆయన అన్నారు.

2026లో ఇంకా బాగా పనిచేద్దాం 

2025లో చాలా బాగా పనిచేశామని, ఎన్నికల హామీలన్నీ నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేశామని సీఎం గుర్తుచేశారు. రూ.50 వేల కోట్లకు పైగా పింఛన్లు అందజేశామన్నారు. యోగాంధ్ర, విశాఖలో భాగస్వామ్య సదస్సు వంటివి విజయవంతంగా నిర్వహించామన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చామని, విశాఖకు గూగుల్‌ డేటా సెంటర్‌ రావడం అతి పెద్ద విజయమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్ని వేగంగా ముందుకు తీసుకెళుతున్నామని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గాడిన పెట్టామని, విశాఖ రైల్వే జోన్‌ ఆచరణలోకి వస్తోందని చెప్పారు. 2026 కూడా ఆశాజనకంగా ఉంటుందని, అభివృద్ధి ఫలాల్ని ప్రజలకు అందేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. 2025లో మంత్రులు బాగా పనిచేశారని ఆయన కితాబిచ్చారు. వచ్చే సంవత్సరం మరింత చురుగ్గా పనిచేయాలని, ‘స్పీడ్‌ ఆఫ్‌ డెలివరింగ్‌ గవర్నెన్స్‌’లో క్రియాశీలకంగా వ్యవహరించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.  

కేబినెట్‌ సమావేశం మొదలయ్యేసరికే అధికారులంతా సిద్ధంగా ఉండాలి

మంత్రివర్గ సమావేశం మొదలయ్యేసరికే ఎజెండాలోని అంశాలకు సంబంధించిన శాఖల కార్యదర్శులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సోమవారం మంత్రివర్గ సమావేశానికి పురపాలకశాఖ మంత్రి నారాయణ కొంత ఆలస్యంగా వచ్చారు. అప్పటికి ఆ శాఖ అధికారులూ సిద్ధంగా లేకపోవడంతో రెవెన్యూ అంశాన్ని చర్చకు తీసుకున్నారు. ఒక శాఖకు సంబంధించిన అంశం ఎజెండాలో మొదట్లో ఉన్నా, చివర్లో ఉన్నా అధికారులు మాత్రం సమావేశం మొదలయ్యేసరికే సిద్ధంగా ఉండాలని, ఆ మేరకు అధికారులందరికీ ఆదేశాలు జారీ చేయాలని ఇన్‌ఛార్జి సీఎస్‌ అజయ్‌జైన్‌కు సీఎం సూచించారు. 

అన్నమయ్య స్వగ్రామం రాజంపేట నియోజకవర్గం పరిధిలో ఉంది. ఇప్పుడా నియోజకవర్గం కడప జిల్లాలో కలుస్తున్నా, మదనపల్లె కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు అన్నమయ్య పేరునే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. మహాత్ముల్ని గౌరవించేందుకు జిల్లాలకు వారి పేర్లు పెడుతున్నామని, వారు జన్మించిన ఊరు అదే జిల్లాలో ఉండాలన్న నిబంధనేదీ లేదని సీఎం తెలిపారు. ఎన్టీఆర్‌ జన్మస్థలం కృష్ణా జిల్లాలో ఉండగా, దానికి బదులు కొత్తగా ఏర్పడిన జిల్లాకు... ఎన్టీఆర్‌ పేరు పెట్టడాన్ని గుర్తుచేశారు. పోలవరం గ్రామం లేకుండా కొత్తగా ఏర్పడ్డ జిల్లాకు పోలవరం పేరు పెట్టడంపై చర్చ జరుగుతోందని మంత్రి దుర్గేష్‌ ప్రస్తావించారు.

పోలవరం ఊరు ఆ జిల్లాలో లేకపోయినా.. ప్రాజెక్టు ముంపు గ్రామాలన్నీ కొత్త జిల్లా పరిధిలోకే వస్తున్నాయని, ప్రాజెక్టు అక్కడే ఉంది కాబట్టి ఆ పేరు పెట్టడమే సముచితమన్న అభిప్రాయం వ్యక్తమైంది. కర్నూలు జిల్లాలోని ఆదోనిని మూడు మండలాలు చేయాలన్న చర్చ జరిగింది. కానీ చివరకు రెండు మండలాలతోనే సరిపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గం పరిధిలోని సైదాపురం, రాపూరు మండలాల్ని కూడా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకి తేవాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కోరారు.  

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 30 Dec 2025 04:41 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు.
  • రాంబిల్లిలో మెగా ఔషధ కంపెనీ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో మెగా ఔషధ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు సాగుతున్నాయి.
  • విలేజ్‌ టు విరాట్‌ మీరు క్రికెట్‌ బాగా ఆడతారా..? మీ ప్రతిభకు తగిన గుర్తింపు, వేదిక కోసం చూస్తున్నారా..? అయితే.. మీ కోసమే ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ‘విలేజ్‌ టు విరాట్‌’ ట్యాగ్‌తో ‘రూరల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ప్రోగ్రాం’కు రూపకల్పన చేస్తోంది.
  • ‘ఆరెంజ్‌ ఎకానమీ’ అభివృద్ధికి త్వరలో వర్క్‌షాపులు సాంస్కృతిక, పర్యాటక, ఫిల్మ్‌ టూరిజం విభాగాల్ని సమన్వయం చేస్తూ ‘ఆరెంజ్‌ ఎకానమీ’ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. ఇందుకోసం జూన్‌ లేదా జులై నెలల్లో ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహిస్తామని తెలిపారు.
  • పర్యాటకానికి ‘స్వర్ణ’ కళ! వైకాపా హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర పర్యాటక రంగం తిరిగి గాడిలో పడుతోంది. కూటమి ప్రభుత్వం దానికి పారిశ్రామిక హోదా కల్పించి ప్రోత్సాహకాలు ప్రకటించడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులొస్తున్నాయి.
  • వైద్యులకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు ‘వైద్యరంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులు తెస్తోంది. వ్యాధుల నిర్ధారణ, ఆరోగ్య సేవల్లో క్లిష్ట సమస్యలకు ఏఐ టూల్స్‌ పరిష్కారాలు చూపిస్తున్నాయి.
  • వైభవంగా నూకతాత జాతర అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో మంగళవారం నూకతాత జాతర వైభవంగా సాగింది. నూకతాత ప్రతిమకు పూజారులు, భక్తులు బోయపాడు తీరంలో ఉదయం స్నానం చేయించి పూజలు నిర్వహించారు.
  • నందీశ్వరుడిపై సర్వాంతర్యామి సర్వాంతర్యామి అయిన సోమస్కందమూర్తి ఆయనకు ప్రియమైన నందీశ్వరుడిపై, జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు కామధేనువుపై కొలువుదీరి శ్రీకాళహస్తి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
  • శ్రీశైలంలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పూర్ణాహుతి, చండీశ్వరునికి అవబృధ స్నానం, వసంతోత్సవ క్రతువులు ఘనంగా నిర్వహించారు.
  • తుది దశలో మూలపేట పోర్టు నిర్మాణం ఉత్తరాంధ్రకు గేమ్‌ ఛేంజర్‌గా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణ పనులు 75 శాతం మేర పూర్తయినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
  • 12వ పీఆర్సీ ప్రకటించకపోతే ‘చలో సచివాలయం’ వేతన సవరణ కోసం 12వ పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించి, ఐఆర్‌ను 29 శాతం ప్రకటించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కె.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.
  • అమరావతిలో క్యాట్‌ శాశ్వత బెంచ్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అమరావతిలో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ సర్క్యూట్‌(క్యాట్‌) శాశ్వత బెంచ్‌ ఏర్పాటుకు భూ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని ఆ సంస్థ తెలిపింది.
  • బిల్‌గేట్స్‌ పర్యటన.. సీఎం విజన్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు గేట్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ అమరావతి పర్యటన.. సీఎం చంద్రబాబు విజన్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
  • 21 రోజుల్లో జనన మరణాల నమోదు తప్పనిసరి రాష్ట్రంలో జనన మరణాల నమోదుకు కొత్త నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 21 రోజుల్లో నమోదు తప్పనిసరి చేసింది.
  • అమర్‌నాథ్‌ బృందాన్ని కలవని అంబటి! రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు తమ పార్టీకే చెందిన కొందరు నేతలను ములాఖత్‌లో కలిసేందుకు ఇష్టపడలేదు.
  • ఏపీలో వేగవంతమైన అభివృద్ధి ‘ఎక్స్‌’లో బిల్‌గేట్స్‌ ఏఐ, సాంకేతికతను ఉపయోగించుకుని వ్యవసాయం, విద్య, ఆరోగ్యరంగాల్లో ఆవిష్కరణలతో ఆంధ్రప్రదేశ్‌ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని గేట్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు.
  • మూలుగ మార్పిడి చికిత్స ఎప్పటికి వస్తుంది? రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో మూలుగ (బోన్‌మారో) మార్పిడి చికిత్స అందుబాటులో లేకపోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది.
  • అసెంబ్లీలో పని చేయని మైక్‌ సిస్టమ్‌ అసెంబ్లీలో మంగళవారం మైక్‌ సిస్టమ్‌ మొరాయించింది. శాసనసభలో ఉదయం 9 గంటలకు సమావేశాన్ని ప్రారంభించే సమయానికి ముందు సిబ్బంది పరిశీలించినపుడు మైకులు పని చేయడం లేదని గుర్తించారు. సాంకేతిక విభాగం హడావుడిగా సరిచేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు.
  • ప్రాజెక్టు కొట్టుకుపోయినా పట్టించుకోని జగన్‌ మామిడి రైతులకు కష్టం వస్తే స్థిరీకరణ నిధి ద్వారా నిధులు కేటాయించి ఆదుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెదేపా ఎమ్మెల్యే కె.మురళీమోహన్‌ పేర్కొన్నారు. అందులో పూతలపట్టు నియోజకవర్గానికి అధిక మొత్తం నిధులు దక్కాయని చెప్పారు.
  • వైకాపా పాలనలో ఇష్టారీతిన విద్యుత్తు రాయితీ విధానం వైకాపా హయాంలో ఆక్వా రంగంలో విద్యుత్తు రాయితీని ఇష్టానుసారంగా ఒక్కో రైతుకు ఒక్కో విధంగా అమలు చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైకాపా సర్కారు దుర్మార్గాలను సరిచేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.