CM Chandrababu: తిరుపతి జిల్లాలో దుగరాజపట్నం పోర్టు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఈనాడు, అమరావతి: తిరుపతి జిల్లాలో దుగరాజపట్నం వద్ద ఓడరేవు నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అక్కడ నౌకా నిర్మాణ కేంద్రం కూడా వస్తుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఓడరేవు ఏర్పాటుకు అనువైన ప్రదేశం అన్వేషించాలని ఆదేశించారు. పోర్టు ఏర్పాటుకు నరసాపురం వద్ద అనువుగా ఉంటుందేమో చూడాలని సూచించారు. అక్కడ ఓడరేవు నిర్మాణానికి తగినంత భూములు లేవని రోడ్లు, భవనాలు, రవాణా, ఐఅండ్‌ఐ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ కాకపోతే పోర్టు నిర్మాణానికి అనువైన ప్రదేశం ఎక్కడుందో చూడాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి ముఖ్యమంత్రి సూచించారు. సోమవారం మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో కొత్త ఓడరేవులు, విమానాశ్రయాల అభివృద్ధి అవసరాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
రాష్ట్రంలో సుదీర్ఘ సముద్ర తీరం ఉన్నందున పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసి, ఎయిర్ కనెక్టివిటీ పెంపొందిస్తే పరిశ్రమలు వస్తాయని ఆయన తెలిపారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పన్నుల రూపంలో ఆదాయం వస్తుందని, అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు ఉందని, తిరుపతి జిల్లాలో దుగరాజపట్నం, ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టులు వస్తే ఆ ప్రాంతం మొత్తం ఒక కారిడార్‌లా అభివృద్ధి చెందుతుందన్నారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన ప్రక్రియల్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. వాటితో పాటు దొనకొండ, నాగార్జునసాగర్, బొబ్బిలిల్లోని ఎయిర్‌స్ట్రిప్‌లను అభివృద్ధి చేద్దామని చెప్పారు. ఒంగోలులో విమానాశ్రయ నిర్మాణం గురించి మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రస్తావించగా తదుపరి దశలో చేపడదామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడికైనా గంట ప్రయాణంలో చేరుకోగలిగేలా కనెక్టివిటీ పెరిగితే పరిశ్రమలు వస్తాయని ఆయన అన్నారు.
2026లో ఇంకా బాగా పనిచేద్దాం
2025లో చాలా బాగా పనిచేశామని, ఎన్నికల హామీలన్నీ నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేశామని సీఎం గుర్తుచేశారు. రూ.50 వేల కోట్లకు పైగా పింఛన్లు అందజేశామన్నారు. యోగాంధ్ర, విశాఖలో భాగస్వామ్య సదస్సు వంటివి విజయవంతంగా నిర్వహించామన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చామని, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం అతి పెద్ద విజయమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్ని వేగంగా ముందుకు తీసుకెళుతున్నామని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గాడిన పెట్టామని, విశాఖ రైల్వే జోన్ ఆచరణలోకి వస్తోందని చెప్పారు. 2026 కూడా ఆశాజనకంగా ఉంటుందని, అభివృద్ధి ఫలాల్ని ప్రజలకు అందేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. 2025లో మంత్రులు బాగా పనిచేశారని ఆయన కితాబిచ్చారు. వచ్చే సంవత్సరం మరింత చురుగ్గా పనిచేయాలని, ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’లో క్రియాశీలకంగా వ్యవహరించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
కేబినెట్ సమావేశం మొదలయ్యేసరికే అధికారులంతా సిద్ధంగా ఉండాలి
మంత్రివర్గ సమావేశం మొదలయ్యేసరికే ఎజెండాలోని అంశాలకు సంబంధించిన శాఖల కార్యదర్శులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సోమవారం మంత్రివర్గ సమావేశానికి పురపాలకశాఖ మంత్రి నారాయణ కొంత ఆలస్యంగా వచ్చారు. అప్పటికి ఆ శాఖ అధికారులూ సిద్ధంగా లేకపోవడంతో రెవెన్యూ అంశాన్ని చర్చకు తీసుకున్నారు. ఒక శాఖకు సంబంధించిన అంశం ఎజెండాలో మొదట్లో ఉన్నా, చివర్లో ఉన్నా అధికారులు మాత్రం సమావేశం మొదలయ్యేసరికే సిద్ధంగా ఉండాలని, ఆ మేరకు అధికారులందరికీ ఆదేశాలు జారీ చేయాలని ఇన్‌ఛార్జి సీఎస్ అజయ్‌జైన్‌కు సీఎం సూచించారు.
అన్నమయ్య స్వగ్రామం రాజంపేట నియోజకవర్గం పరిధిలో ఉంది. ఇప్పుడా నియోజకవర్గం కడప జిల్లాలో కలుస్తున్నా, మదనపల్లె కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు అన్నమయ్య పేరునే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. మహాత్ముల్ని గౌరవించేందుకు జిల్లాలకు వారి పేర్లు పెడుతున్నామని, వారు జన్మించిన ఊరు అదే జిల్లాలో ఉండాలన్న నిబంధనేదీ లేదని సీఎం తెలిపారు. ఎన్టీఆర్ జన్మస్థలం కృష్ణా జిల్లాలో ఉండగా, దానికి బదులు కొత్తగా ఏర్పడిన జిల్లాకు... ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని గుర్తుచేశారు. పోలవరం గ్రామం లేకుండా కొత్తగా ఏర్పడ్డ జిల్లాకు పోలవరం పేరు పెట్టడంపై చర్చ జరుగుతోందని మంత్రి దుర్గేష్ ప్రస్తావించారు.
పోలవరం ఊరు ఆ జిల్లాలో లేకపోయినా.. ప్రాజెక్టు ముంపు గ్రామాలన్నీ కొత్త జిల్లా పరిధిలోకే వస్తున్నాయని, ప్రాజెక్టు అక్కడే ఉంది కాబట్టి ఆ పేరు పెట్టడమే సముచితమన్న అభిప్రాయం వ్యక్తమైంది. కర్నూలు జిల్లాలోని ఆదోనిని మూడు మండలాలు చేయాలన్న చర్చ జరిగింది. కానీ చివరకు రెండు మండలాలతోనే సరిపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గం పరిధిలోని సైదాపురం, రాపూరు మండలాల్ని కూడా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోకి తేవాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కోరారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 30 Dec 2025 04:41 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు.
- రాంబిల్లిలో మెగా ఔషధ కంపెనీ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో మెగా ఔషధ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు సాగుతున్నాయి.
- విలేజ్ టు విరాట్ మీరు క్రికెట్ బాగా ఆడతారా..? మీ ప్రతిభకు తగిన గుర్తింపు, వేదిక కోసం చూస్తున్నారా..? అయితే.. మీ కోసమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ‘విలేజ్ టు విరాట్’ ట్యాగ్‌తో ‘రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రాం’కు రూపకల్పన చేస్తోంది.
- ‘ఆరెంజ్ ఎకానమీ’ అభివృద్ధికి త్వరలో వర్క్‌షాపులు సాంస్కృతిక, పర్యాటక, ఫిల్మ్ టూరిజం విభాగాల్ని సమన్వయం చేస్తూ ‘ఆరెంజ్ ఎకానమీ’ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇందుకోసం జూన్ లేదా జులై నెలల్లో ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహిస్తామని తెలిపారు.
- పర్యాటకానికి ‘స్వర్ణ’ కళ! వైకాపా హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర పర్యాటక రంగం తిరిగి గాడిలో పడుతోంది. కూటమి ప్రభుత్వం దానికి పారిశ్రామిక హోదా కల్పించి ప్రోత్సాహకాలు ప్రకటించడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులొస్తున్నాయి.
- వైద్యులకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు ‘వైద్యరంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులు తెస్తోంది. వ్యాధుల నిర్ధారణ, ఆరోగ్య సేవల్లో క్లిష్ట సమస్యలకు ఏఐ టూల్స్ పరిష్కారాలు చూపిస్తున్నాయి.
- వైభవంగా నూకతాత జాతర అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో మంగళవారం నూకతాత జాతర వైభవంగా సాగింది. నూకతాత ప్రతిమకు పూజారులు, భక్తులు బోయపాడు తీరంలో ఉదయం స్నానం చేయించి పూజలు నిర్వహించారు.
- నందీశ్వరుడిపై సర్వాంతర్యామి సర్వాంతర్యామి అయిన సోమస్కందమూర్తి ఆయనకు ప్రియమైన నందీశ్వరుడిపై, జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు కామధేనువుపై కొలువుదీరి శ్రీకాళహస్తి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
- శ్రీశైలంలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పూర్ణాహుతి, చండీశ్వరునికి అవబృధ స్నానం, వసంతోత్సవ క్రతువులు ఘనంగా నిర్వహించారు.
- తుది దశలో మూలపేట పోర్టు నిర్మాణం ఉత్తరాంధ్రకు గేమ్ ఛేంజర్‌గా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ పోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణ పనులు 75 శాతం మేర పూర్తయినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
- 12వ పీఆర్సీ ప్రకటించకపోతే ‘చలో సచివాలయం’ వేతన సవరణ కోసం 12వ పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించి, ఐఆర్‌ను 29 శాతం ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎన్.ప్రసాద్ డిమాండ్ చేశారు.
- అమరావతిలో క్యాట్ శాశ్వత బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అమరావతిలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ సర్క్యూట్(క్యాట్) శాశ్వత బెంచ్ ఏర్పాటుకు భూ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని ఆ సంస్థ తెలిపింది.
- బిల్‌గేట్స్ పర్యటన.. సీఎం విజన్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్‌గేట్స్ అమరావతి పర్యటన.. సీఎం చంద్రబాబు విజన్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
- 21 రోజుల్లో జనన మరణాల నమోదు తప్పనిసరి రాష్ట్రంలో జనన మరణాల నమోదుకు కొత్త నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 21 రోజుల్లో నమోదు తప్పనిసరి చేసింది.
- అమర్‌నాథ్ బృందాన్ని కలవని అంబటి! రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు తమ పార్టీకే చెందిన కొందరు నేతలను ములాఖత్‌లో కలిసేందుకు ఇష్టపడలేదు.
- ఏపీలో వేగవంతమైన అభివృద్ధి ‘ఎక్స్’లో బిల్‌గేట్స్ ఏఐ, సాంకేతికతను ఉపయోగించుకుని వ్యవసాయం, విద్య, ఆరోగ్యరంగాల్లో ఆవిష్కరణలతో ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్‌గేట్స్ పేర్కొన్నారు.
- మూలుగ మార్పిడి చికిత్స ఎప్పటికి వస్తుంది? రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో మూలుగ (బోన్‌మారో) మార్పిడి చికిత్స అందుబాటులో లేకపోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది.
- అసెంబ్లీలో పని చేయని మైక్ సిస్టమ్ అసెంబ్లీలో మంగళవారం మైక్ సిస్టమ్ మొరాయించింది. శాసనసభలో ఉదయం 9 గంటలకు సమావేశాన్ని ప్రారంభించే సమయానికి ముందు సిబ్బంది పరిశీలించినపుడు మైకులు పని చేయడం లేదని గుర్తించారు. సాంకేతిక విభాగం హడావుడిగా సరిచేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు.
- ప్రాజెక్టు కొట్టుకుపోయినా పట్టించుకోని జగన్ మామిడి రైతులకు కష్టం వస్తే స్థిరీకరణ నిధి ద్వారా నిధులు కేటాయించి ఆదుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెదేపా ఎమ్మెల్యే కె.మురళీమోహన్ పేర్కొన్నారు. అందులో పూతలపట్టు నియోజకవర్గానికి అధిక మొత్తం నిధులు దక్కాయని చెప్పారు.
- వైకాపా పాలనలో ఇష్టారీతిన విద్యుత్తు రాయితీ విధానం వైకాపా హయాంలో ఆక్వా రంగంలో విద్యుత్తు రాయితీని ఇష్టానుసారంగా ఒక్కో రైతుకు ఒక్కో విధంగా అమలు చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైకాపా సర్కారు దుర్మార్గాలను సరిచేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
English Translation
CM Chandrababu: Dugarajapatnam port in Tirupati district

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Today, Amaravati: Dugarajapatnam in Tirupati district. Chief Minister Chandrababu said that a port will be built at There will also be a ship building center. He ordered to search for a suitable place for setting up a port in West Godavari district. It is suggested to see if Narasapuram is suitable for setting up a port. Special Principal Secretary of Roads, Buildings, Transport and I&I Departments Krishnababu brought to the notice of the CM that there is not enough land for the construction of the port there. If not there, the Chief Minister suggested to Water Resources Minister Nimmala Ramanaidu to find a suitable place for the construction of the port. In the cabinet meeting on Monday, the Chief Minister specifically mentioned the need for development of new ports and airports in the state.
As the state has a long coastline, industries will come if the port-based economy is developed and air connectivity is enhanced, he said. He stated that employment opportunities will increase, income will come in the form of taxes, development and welfare schemes will be implemented better. He said that there is Krishnapatnam port in Nellore district, Dugarajapatnam port in Tirupati district and Ramayapatnam port in Prakasam district, the whole area will develop as a corridor. He ordered to speed up the necessary processes for the construction of Dagdarthi, Kuppam, Srikakulam and Tadepalligudem airports. Along with them, they said that the airstrips at Donakonda, Nagarjunasagar and Bobbilillo will be developed. Minister Dola Balaveeranjaneya Swamy mentioned about the construction of an airport in Ongole and the CM said that it will be taken up in the next phase. He said that industries will come if connectivity is increased so that anywhere in the state can be reached within an hour's journey.
Let's work even better in 2026
The CM reminded that we have worked very well in 2025 and implemented development and welfare programs keeping all election promises. He said that more than Rs. 50 thousand crores of pensions have been given. He said that partnership conferences were successfully organized in Yogandhra and Visakha. He said that huge investments have been brought to the state and the coming of Google data center to Visakha is the biggest success. He said that Amaravati and Polavaram projects are being fast forwarded with the help of the central government, Visakhapatnam steel plant has been constructed and Visakhapatnam railway zone is being implemented. He stated that 2026 will also be promising and the fruits of development should be seen to reach the people. He said that the ministers have done a good job in 2025. Chandrababu directed to work more actively next year and act actively in 'Speed of Delivering Governance'.
All the officials should be ready when the cabinet meeting starts
The chief minister ordered that the secretaries of the departments related to the items on the agenda should be ready when the cabinet meeting starts. Municipal Administration Minister Narayana came a little late to the cabinet meeting on Monday. By that time the officials of that department were not ready, so the issue of revenue was taken up for discussion. The CM advised the in-charge CS Ajayjain that whether the matter related to a department is at the beginning or at the end of the agenda, the officers should be ready when the meeting starts and to issue instructions to all officers to that effect.
Annamayya's native village is under Rajampet constituency. Even though the constituency now meets Kadapa district, the government has decided to continue the name of Annamayya for the district which will be formed as center of Madanapalle. This was discussed in the cabinet meeting. The CM said that districts are being named after Mahatma to honor them, and there is no rule that the town where they were born should be in the same district. While NTR's birth place was in Krishna district, instead of that, the newly formed district was named after NTR. Minister Durgesh mentioned that there is a discussion on naming the newly formed district without Polavaram village as Polavaram.
Though Polavaram town is not in that district, all the villages flooded by the project are coming under the new district and the project is there, so it is appropriate to name it. There was a discussion to make Adoni in Kurnool district into three mandals. But finally the cabinet decided to settle with two mandals. Minister Anam Ramanaraya Reddy has requested that Saidapuram and Rapuru Mandals under Venkatagiri Constituency in Nellore District should also be brought under Atmakuru Revenue Division.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 30 Dec 2025 04:41 ISTNote:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Family members should be clear about values and policies. Margadarshi Chitfunds MD Shailaja Kiran said that when all the family members have a clear understanding of the values and procedures to be followed in the construction of business enterprises, family businesses can survive for a long time. Preparations are underway for setting up a mega pharmaceutical manufacturing industry in Rambilli mandal of Anakapalli district.
- Village to Virat Do you play cricket well? Are you looking for a platform and recognition for your talent? However.. Andhra Cricket Association (ACA) is designing a 'Rural Talent Search Program' with the tag 'Village to Virat' for you.
- Workshops for the development of 'Orange Economy' will be held soon. Kandula Durgesh, Minister of Culture, Tourism and Film Tourism, said that the aim of the government is to develop 'Orange Economy' by coordinating the departments of culture, tourism and film tourism. He said that special workshops will be held in June or July for this purpose.
- 'Golden' art for tourism! The state's tourism sector, which was neglected during Vaikapa's regime, is back in the groove. With the alliance government giving it industrial status and announcing incentives, large scale investments are being made.
- AI is not a substitute for doctors. Artificial intelligence is revolutionizing the field of medicine. AI tools are showing solutions to difficult problems in disease diagnosis and health services. On Tuesday, Nukatatha fair was held in Rajayyapet of Nakkapalli mandal of Anakapalli district. The priests and devotees bathed in the morning at Boyapadu beach and performed puja to the image of Nukatatha. Sarvantyami Somaskandamurthy appeared to the devotees on his beloved Nandishvara and Gnanaprasunambika on Kamadhenu while strolling through the streets of Srikalahasti in Koluvudiri. As part of the Mahashivratri Brahmotsavam in Srisaila Mahakshetra, Poornahuti, Avabrdha bathing and Vasantotsava rituals of Chandiswara were held on Tuesday. As a game changer for Uttarandhra, the greenfield port being constructed at Moolpet of Santabommali mandal of Srikakulam district is going on actively. The construction company announced that 75 percent of the construction work has been completed. UTF state president and general secretaries N.Venkateshwarlu and K.S.N.Prasad demanded that the 12th PRC commission be appointed immediately for wage revision and declare the IR as 29 percent. The organization said that the state government has already started the process of allotment of land for the establishment of a permanent bench of the Central Administrative Tribunal Circuit (CAT) in Amaravati. Gates Foundation Chairman Bill Gates's visit to Amaravati..Tedpa State President Palla Srinivasa Rao said that CM Chandrababu's vision is a world class recognition.
- Registration of births and deaths within 21 days is mandatory The government has brought new rules for registration of births and deaths in the state. Registration is mandatory within 21 days.
- Ambati who did not meet Amarnath team! Former minister and Vikapa leader Ambati Rambabu, who is a remand prisoner in Rajamahendravaram Central Jail, did not want to meet some leaders of his own party in Mulakat. Gates Foundation Chairman Bill Gates said that Andhra Pradesh is developing rapidly with innovations in agriculture, education and health sectors using AI and technology.
- When will transplant therapy come? The High Court objected to non-availability of bone marrow transplant treatment in government hospitals and medical colleges in the state.
- Non-functioning mic system in assembly. The mic system blared in the assembly on Tuesday. When the staff checked before the session started at 9 am in the Legislative Assembly, they found that the microphones were not working. The technical department hastily tried to fix it but to no avail. TDEPA MLA K. Murali Mohan said that Chandrababu should be credited with allocating funds through the stabilization fund when mango farmers face difficulties. He said that Puthalapattu Constituency got the highest amount of funds. Sarvepalli MLA Somireddy Chandramohan Reddy said that during the Vaikapa regime, electricity subsidy was implemented in the aqua sector according to the will of each farmer. Vaikapa stated that it is necessary to correct the wrongdoings of the government.