Stock market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Eenadu icon
By Business News Team Published : 30 Dec 2025 16:08 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, దేశీయంగా ముందుకు నడిపించే అంశాలేవీ లేకపోవడంతో సూచీలు మోస్తరు శ్రేణికే పరిమితమయ్యాయి. పీఎస్‌యూ బ్యాంక్‌, మెటల్‌, ఆటో షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపించగా.. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, ఫార్మా షేర్లు అమ్మకాలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

సెన్సెక్స్‌ ఉదయం 84,600.99 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 84,695.54) స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 84,470.94- 84,806.99 మధ్య కదలాడింది. చివరికి 20.46 పాయింట్ల నష్టంతో 84,675.08 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 3.25 పాయింట్ల నష్టంతో 25,938.85 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 89.84గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎటెర్నల్‌, ఇండిగో, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టాటా స్టీల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 61.59 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 4390 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :