Hyderabad: దుర్గం చెరువు ఆక్రమణలకు చెక్ పెట్టిన హైడ్రా

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

హైదరాబాద్: నగరంలోని దుర్గం చెరువు ఆక్రమణలకు హైడ్రా ( Hydra) అధికారులు చెక్ పెట్టారు. మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ వైపు దుర్గం చెరువులో దాదాపు 5 ఎకరాల మేర ఉన్న ఆక్రమణలను హైడ్రా సిబ్బంది మంగళవారం తొలగించారు. చెరువులో మట్టితో నింపి వాహనాల పెయిడ్ పార్కింగ్ కోసం వినియోగించి ప్రతి నెలా రూ.50 లక్షల వరకూ అద్దెలు వసూలు చేస్తున్న దందాకు తెరదించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోని ఆక్రమణలను తొలగించారు. అక్కడి వాహనాలను ఖాళీ చేయించి ప్రస్తుతానికి ఫెన్సింగ్ వేశారు. తర్వాత మట్టిని తొలగిస్తామని అధికారులు తెలిపారు. కబ్జాల పర్వంపై ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు.
ఐటీ కారిడార్‌లో ఒకప్పుడు 160 ఎకరాల మేర ఉన్న ఈ చెరువు ప్రస్తుతం 116 ఎకరాలుగా మిగిలిపోయింది. చెరువుకు ఉత్తర దిశ మినహా.. మూడువైపులా ఆక్రమణలకు గురైంది. కబ్జాల పర్వం ఎలా సాగిందో ఎన్‌ఆర్‌ఎస్‌సీ అందించిన శాటిలైట్ చిత్రాలు కళ్లకు కడుతున్నాయి.
► Read latest Hyderabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.