Hyderabad: ‘సృష్టి’ కేసులో బెయిల్‌పై వచ్చి.. చిన్నారులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

హైదరాబాద్: చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను మాదాపూర్ డీసీపీ రితు రాజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘‘గుజరాత్ నుంచి చిన్నారులను తీసుకొచ్చి హైదరాబాద్, మంచిర్యాలలో విక్రయించారు. దాదాపు 20 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నాం. ముఠాలో సృష్టి ఫెర్టిలిటీ కేసుకు సంబంధించిన నిందితులు ఉన్నట్టు గుర్తించాం. సృష్టి కేసులో బెయిల్‌పై వచ్చి చిన్నారులను విక్రయిస్తున్నారు. ఒక్కో చిన్నారిని రూ.4లక్షల నుంచి రూ.5 లక్షలకు విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది’’ అని డీసీపీ తెలిపారు.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 24 Dec 2025 17:23 IST