బాధితులకు అండగా ఉంటాం: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్

- A
- A+
- A++

కోహీర్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో తన తల్లికి ఓటు వేయలేదనే కారణంతో సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం సజ్జాపూర్ గ్రామానికి చెందిన ఓ దళితుడి ఇంటి నిర్మాణాన్ని అడ్డుకొని, రేకుల షెడ్డును కూల్చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య స్పందించారు. జడ్పీ సీఈవో జానకి రెడ్డితో కలిసి బుధవారం సజ్జాపూర్ గ్రామాన్ని సందర్శించారు.
గ్రామానికి చెందిన బేగరి రాములు తనకున్న స్థలంలో (పల్లె ప్రకృతి వనం పక్కన) ఇల్లు నిర్మించాలని పనులు ప్రారంభించారు. పంచాయతీ అనుమతి తీసుకోకుండా పల్లె ప్రకృతి వనం దారికి అడ్డంగా నిర్మాణం చేపట్టారనే కారణంతో ఈ నెల 16వ తేదీన రాములుకు నోటీసులు జారీ చేశారు. రాములు స్పందించకపోవడంతో ఈ నెల 22న(సోమవారం) సిబ్బంది, పోలీసులు, జేసీబీ సాయంతో ఇల్లు బేస్ మెంట్‌ని, అక్కడున్న రేకుల షెడ్డును తొలగించారు. దీంతో తమకు ఓటు వేయలేదనే కారణంతో తమపై సర్పంచి కుమారుడు ప్రసాద్‌రెడ్డి ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నాడని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. ఈ విషయమై బాధితులు మంగళవారం మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. స్పందించిన మాజీమంత్రి జిల్లా ఎస్పీకి, కమిషన్ ఛైర్మన్‌తో మాట్లాడారు.
ఈ విషయమై బుధవారం గ్రామానికి వచ్చిన కమిషన్ ఛైర్మన్ బాధితుడు రాములు, అతని కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుని రేకుల షెడ్డును కూల్చిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన ప్రతీ ఒక్కరిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. కూల్చిన ఇంటి స్థానంలో ప్రభుత్వ సహాయంతో అన్ని సౌకర్యాలతో కూడిన ఇంటిని నిర్మించేలా చూస్తామన్నారు. దళితులపై దాడులు చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఎల్పీవో అమృత, తహసీల్దార్ సుప్రియ, ఎంపీఓ వెంకటరెడ్డి ఉన్నారు.
► Read latest Medak Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- విద్యుత్తు అధికారులపై చర్యలు తీసుకోవాలి [ 18-02-2026] కల్లుగీత కార్మికుడి మృతికి కారణమైన విద్యుత్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి జయరాజు డిమాండ్ చేశారు.
- జాతర ఆదాయం రూ.87.56లక్షలు [ 18-02-2026] ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో మూడు రోజుల పాటు జాతరకు సంబంధించి హుండీ ఆదాయాన్ని లెక్కించారు.
- దుబ్బాక పురపాలికను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేయాలి: కేసీఆర్ [ 18-02-2026] మెదక్ జిల్లా దుబ్బాక పురపాలిక నూతన ఛైర్‌పర్సన్ శ్రీరామ్ సంగీత, వైస్ ఛైర్ పర్సన్ ఆస సులోచన, 12 మంది బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
- హరీశ్‌రావును కలిసిన దుబ్బాక పురపాలిక నూతన పాలకవర్గం సభ్యులు [ 18-02-2026] దుబ్బాక పురపాలిక నూతన ఛైర్ పర్సన్ శ్రీరామ్ సంగీత, వైస్ ఛైర్ పర్సన్ సులోచన, 12 మంది బీఆర్‌ఎస్ కౌన్సిలర్లతో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు.
- బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్.. ఒకరు మృతి [ 18-02-2026] ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని వెనకనుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది.
- నర్సాపూర్ అభివృద్ధికి కృషిచేయాలి: ఎంపీ [ 18-02-2026] నర్సాపూర్ పురపాలికకు వైస్ ఛైర్మన్‌గా ఎన్నికైన వనముల బుచ్చేష్ యాదవ్, బీజీపీ కౌన్సిలర్లు చింతకుంట శ్రీకాంత్, నిరంజన్ దాస్‌లు మెదక్ ఎంపీ రఘునందన్ రావును హైదరాబాదులోని ఆయన నివాస గృహంలో బుధవారం కలిశారు.
- విద్యుదాఘాతంతో గీత కార్మికుడు మృతి [ 18-02-2026] ఓ గీత కార్మికుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
- అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి [ 18-02-2026] మెదక్‌లోని కొల్చారం మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
- జహీరా‘బాద్‌షా’ కాంగ్రెస్ [ 18-02-2026] జహీరాబాద్ పురపాలికలో కాంగ్రెస్ పాగా వేసింది. 37వార్డులు ఉండడంతో ఛైర్మన్ పదవి దక్కించుకునేందుకు 19 మంది సభ్యుల మద్దతు అవసరం. కాంగ్రెస్, భారాసకు సరిపడా మెజార్టీ రాకపోవడంతో ఇతర పార్టీలు, స్వతంత్రులపై ఆధార పడాల్సి వచ్చింది.
- ఆరోగ్య సంపద.. ఆచరిస్తే నిండుగా! [ 18-02-2026] జిల్లా కేంద్రం పరిధి వెంకట్రావ్ నగర్ కాలనీలో రూ.10 లక్షలతో ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్ ఇది. నిర్వహణ సరిగా లేక అధ్వానంగా మారింది. పచ్చిక సైతం లేదు. 5, 13 వార్డుల్లోని పార్కుల అభివృద్ధికి రూ.30 లక్షలు కేటాయించినా పనులు చేపట్టలేదు.
- ఆడుదామా చిర్రగోనె [ 18-02-2026] బాల్యంలో ఆటలు గొప్పవి.. అని చిర్రగోనె ఆడుతున్న పిల్లల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి కొందరు తీపిగురుతులను అందరి ముందు పెడుతుంటారు.
- ఇసుక మేట.. అక్రమార్కుల వేట! [ 18-02-2026] మంజీరా నది పరీవాహకంలో భారీగా ఇసుక మేటలు పేరుకుపోయాయి. వీటిపై అక్రమార్కుల కళ్లు పడడంతో ఇష్టానుసారం తవ్వేస్తూ తరలిస్తున్నారు. అయినా పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
- నవీకరణ మమ.. కర్షకులకు వేదన! [ 18-02-2026] ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని నిషేధిత భూముల జాబితాలను రెవెన్యూ యంత్రాంగం సిద్ధం చేసి సీసీఎల్‌ఏ (భూపరిపాలన కమిషనరేట్)కు నివేదించింది.
- నచ్చిన అంశాల్లో నైపుణ్యాలకు మెరుగులు [ 18-02-2026] సాధారణంగా పిల్లలు పుస్తకాల పురుగులైతేనే తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. పెద్దయ్యాక గొప్పవాడవుతాడని కలలు కంటారు. ఆటలు, పాటలు, పద్యాలు, గేయాలు, చిత్రలేఖనం వంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించరు.
- పట్టుబట్టి.. పై‘చేయి’ సాధించి.. [ 18-02-2026] ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో జరిగిన పురపోరులో అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్‌దే పైచేయి అయింది. 23 పురపాలికలకు 14 చోట్ల హస్తం, తొమ్మిదింట్లో భారాస పాగావేశాయి. వాయిదా పడిన ఇంద్రేశం, జహీరాబాద్ బల్దియాల్లో మంగళవారం ఎన్నిక జరిగింది.
- విదేశాల్లో చదువుకు విద్యా నిధి [ 18-02-2026] విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విదేశీ విద్యా నిధి పథకం ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆర్థికంగా లేని నిరుపేద వారికి సహాయం అందించి భరోసా కల్పిస్తోంది.
- వెళ్లొస్తామమ్మా.. దుర్గమ్మా.. [ 18-02-2026] పాడి పంటలు సమృద్ధిగా పండాలని, అందరూ చల్లగా బతికేలా ఆశీర్వదించమని భక్తులు దుర్గమ్మను వేడుకున్నారు. మూడు రోజులు పాటు వైభవంగా సాగిన ఏడుపాయల మహాజాతర మంగళవారం రాత్రి రథోత్సవంతో ముగిసింది.
- జేఈఈ మెయిన్‌లో గురుకుల విద్యార్థి ప్రతిభ [ 18-02-2026] మండల పరిధి తునికి జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కన్నెబోయిన విజయ్‌కుమార్ జేఈఈ మెయిన్‌లో తొలి విడత 91.2 పర్సంటైల్ సాధించారు.