
Kishan Reddy: సింగరేణిపై రూ.47 వేల కోట్ల అప్పుల భారం

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
ఈనాడు, దిల్లీ: గత భారత రాష్ట్ర సమితి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాలవల్ల రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చిందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని డిస్కంలు చెల్లించాల్సిన అప్పులు రూ.30 వేల కోట్లకుపైగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శ్వేతపత్రంలో ప్రకటించినా వాస్తవంగా ఒక్క సింగరేణి సంస్థకే బొగ్గు, కరెంట్ కొనుగోలుకు సంబంధించి చెల్లించాల్సిన బకాయిలు రూ.47 వేల కోట్లకుపైగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన గురువారం ఇక్కడ తన నివాసంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. నాటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. సింగరేణిని బంగారు బాతులా ఉపయోగించుకుంటున్నాయి తప్పితే దాని బకాయిలను చెల్లించడంలేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను గాడిలోపెట్టే ప్రయత్నం చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్ని రైజింగ్ సమిట్‌లు పెట్టినా ప్రజలకు మేలు జరగదని ఎద్దేవా చేశారు.
‘‘తెలంగాణలోని కరెంట్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. జీతభత్యాలు సరిగా రాక విద్యుత్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. 2047 నాటికి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ లక్ష మెగావాట్లకు పెరుగుతుందని భట్టి చెప్పారు. అందుకు అవసరమైన వ్యవస్థ రాష్ట్రంలో లేదు. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు చర్యలు తీసుకోలేదు. అదనపు కరెంట్ ఉత్పత్తి చేయకపోతే రాష్ట్రానికి పరిశ్రమలు రావు.. వచ్చినా మనుగడ సాగించలేవు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యుత్ రంగానికి రూ.21 వేల కోట్లు కేటాయించారు. ఆ మొత్తం పాత అప్పులు తీర్చడానికి కానీ, ఉచిత విద్యుత్ పథకానికి చెల్లింపులకు కానీ సరిపోయే పరిస్థితి లేదు. ఉచిత పథకాల అమలుకోసం కొత్త డిస్కం ఏర్పాటుచేసి, మిగిలిన డిస్కంల ద్వారా పారిశ్రామిక, వాణిజ్య, గృహ అవసరాలను తీరుస్తూ వాటి ద్వారా ప్రభుత్వం అప్పులు తీసుకోవాలనుకుంటోంది.ఖనిజ తవ్వకాలు చేపట్టే ప్రాంతాల సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటుచేసిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్‌కు తగిన నిధులు సమకూర్చే డబ్బు ఇప్పుడు సింగరేణి వద్ద లేకుండాపోయింది. దీనివల్ల 8, 9 జిల్లాలకు నిధులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. సింగరేణి కార్మికుల కష్టార్జితం రూ.47వేల కోట్లను తిరిగి చెల్లించాలి. సీఎం రేవంత్‌రెడ్డి తక్షణం బకాయిలు చెల్లించాలి.
విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీ.. రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పేందుకు సిద్ధపడి ఇప్పటికే 1,600 మెగావాట్ల ఉత్పత్తిని ప్రారంభించింది. మరో 2,400 మెగావాట్ల ప్రాజెక్టును నిర్మించడానికి సిద్ధంగా ఉంది. ఇందుకోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలని ఎన్టీపీసీ ఛైర్మన్ గత ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డిలను కలిసి కోరినా ముందుకు రాలేదు. దానికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం రామగుండం, పాల్వంచ, మక్తల్‌లలో ప్రాజెక్టులను ఏర్పాటుచేస్తామని ప్రకటించడం ఎంతవరకు సబబు? కొత్త అప్పులు చేసి ప్రైవేటు రంగంలో విద్యుత్ ఉత్పత్తిచేస్తే దాని భారం రాష్ట్ర ప్రజలు మోయాల్సి వస్తుంది. ఆ కంపెనీల నుంచి యూనిట్ కరెంట్‌ను ఎంతకు కొంటారు? అలాగే ఆ సంస్థలకు కేటాయించే భూములు, పీపీఏలపైనా సీఎం ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 06:36 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- భారతీయ ప్రతిభా సామర్థ్య వేదిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంత కలయిక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో-2026’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
- హంగ్‌లో అదృష్ట హస్తం ఛైర్‌పర్సన్ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
- బయో వరల్డ్‌గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్‌గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్‌గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
- సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
- రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
- విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు.
- మీ టాయిలెట్టే మీ డాక్టర్ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
- 70 ఇంజినీరింగ్ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) షాక్ ఇవ్వనుంది.
- డాన్.. సింబా.. లియో డాన్.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్.. రాణా.. విరాట్.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
- చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
- ఎప్‌సెట్ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్‌సెట్ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు.
- రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
- ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి భారతీయ టీకాలు ప్రపంచంలోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి భారత్ నుంచి టీకాలు సరఫరా అవుతున్నాయని భారత్ బయోటెక్ చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ రేచస్ ఎల్ల తెలిపారు.
- నా బిడ్డకు పూర్తి న్యాయం జరగలేదు తన బిడ్డకు వందశాతం న్యాయం జరిగిందని భావించట్లేదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ఆమె మంగళవారం ఇక్కడ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
- మాటలు.. మంటలు.. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
- మున్సిపల్ ఎన్నికల్లో.. ముందూ.. వెనకా పంపకాలే మున్సిపల్ ఎన్నికల్లో ఆద్యంతం.. కాసుల హవాయే నడిచింది. పోలింగ్ వరకు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచిన రాజకీయ పార్టీలు.. కౌంటింగ్ తర్వాత బలసమీకరణలో భాగంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.
- పొత్తు కొనసాగేది.. లేనిది కాంగ్రెస్ చేతిలోనే కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే సీపీఐ అపూర్వ విజయం సాధించిందని, కాంగ్రెస్‌తో పొత్తు లేకున్నా సత్తాచాటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
- యాదగిరిని నేడు హాజరుపరచండి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలుపొందిన ఆకుల యాదగిరిని బుధవారం ఉదయం 10.30కు కోర్టులో హాజరుపరచాలని ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
- ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి చుక్కెదురు ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నిందితురాలి (ఏ6)గా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
- ‘ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్’గా హైదరాబాద్: శ్రీధర్‌బాబు జీవశాస్త్ర రంగంలో పరిశోధన, ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ శరవేగంగా ఎదుగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.