Gujarat: ప్రకృతి ప్రణమిల్లి.. పచ్చదనం శోభిల్లి..!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా నది తీరంలో ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు సర్దార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహాన్ని ఏర్పాటుచేసిన ప్రాంతాన్ని గత ఏడేళ్లలో ఏక్తానగర్‌గా గుర్తించి అభివృద్ధి చేశారు. పచ్చదనం, జీవవైవిధ్యంతో పర్యాటక స్వర్గధామంగా తీర్చిదిద్దారు. 182 మీటర్ల (597 అడుగులు) ఈ మహారూపం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందింది. 2018 అక్టోబరు 31న ప్రధాని నరేంద్రమోదీ దీన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఖల్వానీ, జర్వాణి ఎకోటూరిజం భలే..
నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యామ్ పరిసరాల్లో ఖల్వానీ ఎకో టూరిజం ఉంది. ట్రీహౌస్‌లు, క్యాంప్ ఫైర్లు, యాంపి థియేటర్, చెట్ల మధ్య నడిచేందుకు అనువుగా అటవీబాటలు ఆకర్షణగా మలిచారు. 14 కిలోమీటర్ల పొడవుతో 3 గంటల పాటు ఉండే సైక్లింగ్ టూర్ మరో ఆకర్షణ. 100 రకాల సీతాకోకచిలుకలతో బటర్‌ఫ్లై పార్కు ఆకట్టుకుంటోంది.
నర్మదా నదికి సమీపంలో ఉన్న చిన్న గ్రామం జర్వాణి. ఇది శూల్పనేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యంలో భాగం. ఇక్కడ వృక్షజాలం, జంతుజాలం పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. అడవిలో వైల్డ్ ట్రెక్కింగ్‌కు అవకాశం ఉంది. హెర్బల్ స్టీమ్ బాత్, థెరప్యూటిక్ మసాజ్‌కు పర్యాటకులు క్యూ కడుతుంటారు. సర్దార్ సరోవర్ ఆనకట్ట, పంచములి సరస్సు ఆకట్టుకుంటాయి.
మేజ్ గార్డెన్, మియావాకీ ఫారెస్ట్..
మూడు ఎకరాల్లో విస్తరించి ఉంది మేజ్ గార్డెన్ (చిట్టడవి తోట). కేవలం ఎనిమిది నెలల కాలంలో దీన్ని అభివృద్ధి చేశారు. కెవాడియా వద్ద ప్రత్యేక ఆకారంలో ఇది నిర్మితమైంది. ఇందులో 1.80 లక్షల మొక్కలు ఉండగా.. ఆరెంజ్ జెమిన్, మధు కామిని, గ్లోరీ బోవర్, మెహందీ వంటి రకాలు ప్రత్యేకం. ఒకప్పుడు శిథిలాల డంపింగ్ ప్రదేశంగా ఉన్న ఇది, పచ్చదనానికి చిరునామాగా మారింది. పువ్వులు, కలప, పండ్ల తోటలతో మియావాకీ ఫారెస్టు ఆకట్టుకుంటోంది. హెర్బల్‌గార్డెన్, బటర్‌ఫ్లై గార్డెన్, కాక్టస్ గార్డెన్, ది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ (భారత్ వాన్), యూనిటీ గ్లో గార్డెన్, చిల్డ్రన్ న్యూట్రిషన్ పార్కు, జంగిల్ సఫారీ.. ఇలా అనేక థీమ్ పార్కులతో కట్టిపడేస్తుండటం ఇక్కడి ప్రత్యేకత.
ప్రత్యేకం.. వామన వృక్ష వాటిక
ఏక్తానగర్‌లో ఏక్తానర్సరీ పక్కనే ఉంటుంది వామన వృక్ష వాటిక. ఈ తోటలో 450కంటే ఎక్కువ జాతులకు చెందిన వెయ్యికి పైగా బోన్సాయ్ మొక్కలు ఉన్నాయి. వీటిని ఆరు విభిన్న గ్యాలరీల్లో ప్రదర్శిస్తున్నారు. మామే, షోహిన్, చు, డై వంటి అనేక రకాలు ఇక్కడి ప్రత్యేకత. అరచేతిలో ఇమిడిపోయే వృక్షాలూ ఉన్నాయి. ఇందులోనే జెన్ గార్డెన్స్, చిన్న జలపాతాలు, కొలనులు ఉన్నాయి.
పర్యావరణానికి పెద్దపీట
ఏక్తానగర్‌లో బైకులు, కార్లు, బస్సులు అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే. ప్రైవేటు వాహనాల్లో ఏక్తానగర్ వరకు వెళితే అక్కడి నుంచి పర్యాటక ప్రదేశాలకు ఉచితంగా ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఏక్తానగర్ అభివృధ్ధిని గుజరాత్ ప్రభుత్వం నియమించిన యంత్రాంగం పర్యవేక్షిస్తోంది. పర్యావరణ హితమైన పర్యాటకాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏటా 5 లక్షల మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారు.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మేక పాలతో సబ్బులు మేకపాలతో సబ్బులు తయారు చేస్తూ గ్రామీణ ప్రాంత మహిళలు ఉపాధి పొందుతున్నారు.
- ఈ శివలింగం పెరుగుతోంది.. జరుగుతోంది! బిహార్‌లోని నిరంజన నదిలో ఉన్న శివలింగం ఏటా అత్యంత స్వల్పంగా పెరుగుతోందని.. కదులుతోందని స్థానికులు చెబుతున్నారు.
- నేను రాహుల్‌వాదిని కాదు.. కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డీఎఫ్) విజయం సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
- కర్ణాటకలో రూ.400 కోట్ల దారి దోపిడీ కట్టుకథే ఓ ట్రక్కులో హవాలా సొమ్ము తరలిస్తుండగా రూ.400 కోట్ల నగదు దోపిడీ జరిగిందంటూ ఆ వాహన డ్రైవర్ చేసిన ఫిర్యాదు బోగస్ అని తేలింది.
- ఏఐ ప్రయాణంలో ముందున్నాం కృత్రిమ మేధ (ఏఐ) రంగంపై విస్తృతంగా చర్చించేందుకు, అత్యాధునిక ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు భారత్ ఆతిథ్యమిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో-2026, సమిట్‌లు సోమవారం దిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
- తొలి దఫా బోర్డు పరీక్షలకు ‘పది’ విద్యార్థుల హాజరు తప్పనిసరి పదో తరగతి విద్యార్థులు మంగళవారం నుంచి నిర్వహించే మొదటి దఫా బోర్డు పరీక్షలు తప్పనిసరిగా రాయాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) స్పష్టం చేసింది.
- పెళ్లికి ముందు ఎవరినీ నమ్మవద్దు పెళ్లికి ముందే శారీరక సంబంధాలు ఏర్పరచుకునే విషయంలో అబ్బాయిలు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు సోమవారం హెచ్చరించింది.
- ‘పరిశ్రమ’ నిర్వచనాన్ని తేల్చేందుకు 9 మంది జడ్జీలతో విస్తృత ధర్మాసనం ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ‘పరిశ్రమ’ నిర్వచనం వివాదంపై 9 మంది జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం విచారణ జరపనుంది.
- 25-26 తేదీల్లో మోదీ ఇజ్రాయెల్ పర్యటన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 25-26 తేదీల్లో రెండ్రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు.
- దేశంలోనే అత్యంత పొడవైన తొండ మహారాష్ట్రలోని కొల్హాపుర్ జిల్లాలో నిర్వహించిన వ్యవసాయ ప్రదర్శనలో దేశంలోనే అత్యంత పొడవైన తొండ(ఇగ్వానా) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
- ముచ్చటగా మూడోసారి.. ఐఏఎస్‌తోనే మనువు మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అవీ ప్రసాద్ తన పెళ్లితో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.
- సంక్షిప్తవార్తలు (3) ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ మంగళవారం భారత్ పర్యటనకు రానున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబయిలో ఆయనతో సమావేశం అవుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
- ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు.. ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు మీకు ఉన్న అన్ని రకాల వ్యాధులను నిజాయతీగా వెల్లడించండి.
- ఉన్నత పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి త్రిష ఇంటి నుంచి నటుడు విజయ్ బయటకు రావాలంటూ భాజపా తమిళనాడు అధ్యక్షుడు, ఆ పార్టీ శాసనసభా పక్షనేత నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలను నటి త్రిష ఖండించారు.
- వేలాడే తీగల మార్గమే దిక్కు! ఉత్తరాఖండ్‌లోని ఘరూధి, మాన్‌కోట్ గ్రామాలకు ఇంకా తీగల మార్గమే దిక్కుగా ఉంది. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పిల్లలు, పెద్దలు ఈ తీగల ద్వారా గోరి నదిని దాటాల్సిందే.
- ఒకే ఊళ్లో కాలేయ సంబంధిత వ్యాధులతో ఏడుగురి మృతి హరియాణాలోని పల్వల్ జిల్లాలోని ఛాయాంసా గ్రామంలో కాలేయ సంబంధిత వ్యాధులతో గత పదిహేను రోజుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నలుగురు హెపటైటిస్ బి సోకి చనిపోయారని స్థానిక వైద్య యంత్రాంగం సోమవారం పేర్కొంది.
- 22 ఏళ్ల క్రితం అదృశ్యమై… మళ్లీ కుటుంబం చెంతకు! మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 22 ఏళ్ల క్రితం అదృశ్యమై... 44 ఏళ్ల వయసులో కుటుంబాన్ని కలుసుకున్నారు.