TG News: పాత నేరస్థులపై ఏదీ నజర్‌

Eenadu icon
By Telangana News Desk Published : 23 Dec 2025 04:05 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

గత అక్టోబరులో నిజామాబాద్‌లో కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను కత్తితో పొడిచి హత్య చేసి.. అనంతరం ఎన్‌కౌంటర్‌లో మరణించిన రియాజ్‌ 2021 నుంచి నేరాలకు పాల్పడుతున్నాడు. చోరీల నుంచి మొదలుకొని హత్యల వరకు మొత్తం 61 కేసుల్లో అతడి ప్రమేయమున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రియాజ్‌ నాలుగేళ్లుగా నేరాలకు పాల్పడుతూనే ఉన్నప్పటికీ అతడిపై నిఘా ఉంచడంలో పోలీస్‌ శాఖ విఫలమైందనే ఆరోపణలున్నాయి.

‘తెలిసో తెలియకో చేసిన నేరంలో ఒకసారి జైలుకు వెళ్లి వచ్చినప్పుడే నేరస్థుడిలో మార్పు దిశగా అడుగులు పడాలి. రెండోసారి గానీ నేరానికి పాల్పడి కటకటాల పాలైతే మాత్రం అతడు అంత సులువుగా మారేందుకు అవకాశం ఉండదు’.. ఇదీ నేరస్థుల మనస్తత్వం గుర్తెరిగిన పోలీసులు చెప్పే మాట. అందుకే పాత నేరస్థులపై తరచూ నిఘా ఉంచాలని చెబుతారు. ఇందుకు జైళ్ల నుంచి విడుదలైన వారి కదలికలపై ఆయా ఠాణాల పరిధిలోని పోలీసులు ఓ కన్నేయాల్సి ఉంటుంది. గతంలో అయితే జైళ్ల నుంచి విడుదలయ్యే నేరస్థులపై నిఘా ఉంచేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించే ఆనవాయితీ ఉండేది. కానీ, తాజా పరిణామాలు చూస్తుంటే పాత నేరస్థుల విషయంలో పోలీస్‌ శాఖ నిర్లక్ష్యం వహిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 2018 జనవరిలోనే తెలంగాణవ్యాప్తంగా పాతనేరస్థులను నియంత్రించే విషయంలో పోలీస్‌ శాఖ ఓ ప్రణాళిక రూపొందించింది. ‘సకల నేరస్థుల సమగ్ర సర్వే’ పేరిట కీలక సమాచారం సేకరించింది. అప్పట్లో హైదరాబాద్‌లో 41,800.. సైబరాబాద్‌లో 42,360.. రాచకొండలో 15,970 మంది పాత నేరస్థులున్నట్లు తేల్చారు. అలా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.8 లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు. అంతర్రాష్ట్ర నేరస్థుల చిట్టానూ తేల్చారు. పోలీసులంతా పాత నేరస్థుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. నేరస్థుల ఆధార్, రేషన్, ఓటరు గుర్తింపు, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, వేలిముద్రలు, సామాజిక మాధ్యమ ఖాతాల సమాచారం, గ్యాస్, విద్యుత్తు కనెక్షన్ల వివరాలు ఆరా తీయడమే కాకుండా ఆయా ధ్రువీకరణపత్రాల ప్రతులను సేకరించారు. నేరస్థుల ప్రస్తుత, శాశ్వత చిరునామాలతో కూడిన ఇళ్లకు జియో ట్యాగింగ్‌ చేశారు. ఇలా పలు అంశాలతో కూడిన సమగ్ర వివరాలను సేకరించి నివేదికలో నిక్షిప్తం చేశారు. 

విలువైన సమాచారం వినియోగం ఏదీ..

తొలుత చేపట్టిన సర్వేలో 30 శాతం మంది వరకు నేరస్థుల ఆచూకీ లభించలేదు. అలాంటివాళ్లే కరడుగట్టిన నేరాలకు పాల్పడుతున్నారని భావించి వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి విలువైన సమాచారం సేకరించారు. అయితే, తర్వాత ఆ సమాచారంతో ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే ప్రణాళిక లోపించింది. దీంతో వ్యవస్థీకృత నేరాల నియంత్రణకు అవసరమైన విలువైన సమాచారం నిష్ప్రయోజనంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాత నేరస్థులపై తరచూ నిఘా ఉంచితే నిజామాబాద్, హైదరాబాద్‌ లాంటి ఘటనలు పునరావృతమయ్యే పరిస్థితులు దాదాపు ఉండవనే భావన నెలకొంది.

హైదరాబాద్‌లో సెల్‌ఫోన్‌ చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్థుడు అన్సారీ ఓ కానిస్టేబుల్‌తోపాటు ఏకంగా ఐపీఎస్‌ అధికారిపైనే కత్తితో దాడికి యత్నించిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. 20కిపైగా నేరాల్లో ప్రమేయమున్న అన్సారీ అంతగా బరితెగించేంతగా ఎదిగేవరకు పోలీసులు ఎందుకు నిలువరించలేకపోయారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • స్టాండింగ్‌లోనే.. సిట్‌.. ముందుకు కదలని బెట్టింగ్‌ యాప్‌ల కేసు దర్యాప్తు అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న బెట్టింగ్‌ యాప్‌లకు ముకుతాడు వేసేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పేరుకే పరిమితమైంది.
  • భారతీయ ప్రతిభా సామర్థ్య వేదిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంత కలయిక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో-2026’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
  • సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
  • సినీనటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ విద్యార్థి నాయకుల కిడ్నాప్‌ కేసులో సినీనటుడు, మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ఛాన్స్‌లర్‌ మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
  • తీరంలో యుద్ధ నౌకల జాతర ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్‌సీ ఆఫీసర్స్‌ మెస్‌లో విందు (ప్రెసిడెన్షియల్‌ బాంక్వెట్‌) ఇచ్చారు.
  • హంగ్‌లో అదృష్ట హస్తం ఛైర్‌పర్సన్‌ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
  • బయో వరల్డ్‌గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్‌గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్‌గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
  • రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
  • విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు.
  • మీ టాయిలెట్టే మీ డాక్టర్‌ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
  • 70 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) షాక్‌ ఇవ్వనుంది.
  • డాన్‌.. సింబా.. లియో డాన్‌.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్‌.. రాణా.. విరాట్‌.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
  • చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
  • ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్‌ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్‌ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు.
  • రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్‌ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
  • ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి భారతీయ టీకాలు ప్రపంచంలోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి భారత్‌ నుంచి టీకాలు సరఫరా అవుతున్నాయని భారత్‌ బయోటెక్‌ చీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రేచస్‌ ఎల్ల తెలిపారు.
  • నా బిడ్డకు పూర్తి న్యాయం జరగలేదు తన బిడ్డకు వందశాతం న్యాయం జరిగిందని భావించట్లేదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ఆమె మంగళవారం ఇక్కడ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
  • మాటలు.. మంటలు.. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
  • మున్సిపల్‌ ఎన్నికల్లో.. ముందూ.. వెనకా పంపకాలే మున్సిపల్‌ ఎన్నికల్లో ఆద్యంతం.. కాసుల హవాయే నడిచింది. పోలింగ్‌ వరకు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచిన రాజకీయ పార్టీలు.. కౌంటింగ్‌ తర్వాత బలసమీకరణలో భాగంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.
  • పొత్తు కొనసాగేది.. లేనిది కాంగ్రెస్‌ చేతిలోనే కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే సీపీఐ అపూర్వ విజయం సాధించిందని, కాంగ్రెస్‌తో పొత్తు లేకున్నా సత్తాచాటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.