Bangkok: బ్యాంకాక్.. పర్యాటకుల ఫేవరెట్ స్పాట్.. ఆ నగరమే ఎందుకు?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది పర్యటించిన నగరంగా థాయ్‌లాండ్ దేశంలోని బ్యాంకాక్ నిలిచింది. ఇప్పటివరకు 3.03 కోట్లకు పైగా పర్యాటకులు ఈ నగరాన్ని సందర్శించారని గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదీ ఈ నగరమే నంబర్‌వన్‌గా నిలిచింది. అసలు బ్యాంకాక్‌కు వెళ్లడానికి పర్యాటకులు ఎందుకు అంతలా మొగ్గు చూపుతారు.. తెలుసుకుందాం పదండి.
ఖర్చు తక్కువ
ఇతర పర్యాటక ప్రాంతాలతో పోలిస్తే బ్యాంకాక్‌కు విమాన టికెట్ల ధర కాస్త తక్కువగా ఉంటుంది. ఇక్కడ వసతి, రవాణా సరసమైన ధరల్లోనే ఉంటాయి. కావోసాన్ రోడ్, చైనాటౌన్‌లో లగ్జరీ హోటల్స్ ఉంటాయి. సుఖమ్విట్, సిలోమ్ తదితర ప్రాంతాల్లో తక్కువ ధరలోనే వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. రైళ్లు, బస్సులు వంటి ప్రజారవాణాలో నగరమంతా చుట్టేయొచ్చు. కారు, బైక్ ట్యాక్సీలు కూడా అందుబాటు ధరలోనే ఉంటాయి.
సంప్రదాయం-ఆధునికం
బ్యాంకాక్‌లో ఒకేసారి ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను, ఆధునిక జీవనశైలిని చూడొచ్చు. శతబ్దాల చరిత్ర గల పలు దేవాలయాలకు ఈ నగరం ప్రసిద్ధి. వాట్ ఫ్రా కేవ్, వాట్ అరుణ్, వాట్ ఫో ఆలయాలు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. బంగారు శిల్పాలు, థాయ్ నిర్మాణశైలి, ప్రశాంత వాతావరణం పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఎలిఫెంట్ బిల్డింగ్ వంటి ఆకాశహర్మ్యాలు, సెంట్రల్ వరల్డ్ వంటి షాపింగ్ మాల్స్ ఆకట్టుకుంటాయి.

స్ట్రీట్‌ఫుడ్
ఇక్కడి స్ట్రీట్ ఫుడ్.. వరల్డ్ ఫేమస్. వీధివీధినా ఫుడ్ స్టాళ్లు కనిపిస్తాయి. అందుబాటు ధరలోనే లభించే ప్యాడ్ థాయ్, మూ పింగ్, బోట్ నూడుల్స్, గాయ్ టొడ్, మ్యాంగో స్టికీ రైస్ వంటి వంటకాలు పర్యాటకులకు అమితంగా నచ్చేశాయి. ఫుడ్ కోసమే బ్యాంకాక్‌కు వెళ్లే వారున్నారంటే అతిశయోక్తి కాదు. చైనా టౌన్ ఇక్కడ పాపులర్ ఫుడ్ స్ట్రీట్. వాంగ్ లాంగ్, ప్రటునామ్, కావో సాన్ రోడ్ వంటి మార్కెట్లు చాలానే ఉన్నాయి.

షాపింగ్
అందరికీ అందుబాటు ధరల్లో, లగ్జరీ వస్తువులు లభించే షాపింగ్ మాల్స్ బ్యాంకాక్‌లో బోలెడు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తుల కోసం ఎంబీకే మార్కెట్‌కు వెళ్తుంటారు. ఐకాన్సియమ్, సియామ్ ప్యారగాన్, సెంట్రల్ వరల్డ్‌తో పాటు ప్లాటినమ్ ఫ్యాషన్ మాల్, టెర్మినల్ 21(ఒక్కో ఫ్లోర్‌లో ఒక్కో దేశానికి సంబంధించిన మార్కెట్లు ఉంటాయి) ఆకట్టుకుంటాయి. స్థానిక ఉత్పత్తుల నుంచి అంతర్జాతీయ బ్రాండ్స్, ఫుడ్ ఇక్కడ లభిస్తాయి. పిల్లల కోసం పార్కులు, వాటర్ పార్కులు ఉంటాయి.
ఫ్లోటింగ్ మార్కెట్
బ్యాంకాక్‌లో నీటి మీద తేలియాడే మార్కెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వ్యాపారులు కూరగాయలు, పండ్లు, కళాకృతులు, ఆహారాన్ని స్టాల్స్‌లో, పడవల్లో పెట్టుకొని విక్రయిస్తుంటారు. పడవల్లో ప్రయాణిస్తూ నచ్చినచోట ఆగి కొనుగోలు చేయడం పర్యాటకులకు కొత్త అనుభవాన్ని ఇస్తుంది. డామ్నోయెన్ సాదువాక్, అంఫవా ఫ్లోటింగ్ మార్కెట్లు ఇక్కడ చాలా ఫేమస్.

నైట్‌లైఫ్
నిద్రపోని నగరం బ్యాంకాక్. ఇక్కడ రాత్రుళ్లు.. రెస్టరంట్లు, మార్కెట్లు ఓపెన్‌గానే ఉంటాయి. రంగురంగుల లైట్లతో పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. చటుచాక్ వీకెండ్(జేజే) మార్కెట్, జాడ్ ఫెయిర్స్, ట్రెయిన్ నైట్, ఏసియాటిక్ ది రివర్ ఫ్రంట్ తదితర మార్కెట్లను పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఆయాచోట్ల రుచికరమైన ఆహారం తినొచ్చు. షాపింగ్ చేసుకోవచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్ పొందొచ్చు.
మసాజ్
థాయ్‌లాండ్ దేశమే మసాజ్‌కు పెట్టింది పేరు. బ్యాంకాక్‌లోనూ మసాజ్ చేసే స్పాలు చాలా ఉన్నాయి. సంప్రదాయ థాయ్‌తోపాటు ఎన్నోరకాల మసాజ్‌లు అందుబాటు ధరల్లో ఆఫర్ చేస్తుంటారు. మసాజ్‌తో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కండరాల నొప్పులు, ఒత్తిళ్లు తగ్గుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. లెట్స్ రిలాక్స్, హెల్త్‌ల్యాండ్, దివానా వంటి స్పా సెంటర్లు ఇక్కడ చాలా ఫేమస్.

ఆతిథ్యం
ఎక్కడైనా ఆతిథ్యం బాగుంటే మళ్లీ మళ్లీ అక్కడికి వెళ్లడానికి ఇష్టపడుతుంటాం. బ్యాంకాక్ కూడా అంతే. అక్కడి ప్రజలు పర్యాటకులతో స్నేహపూర్వకంగా ఉంటారు. ఆత్మీయంగా పలకరిస్తారు. సాయం చేయడంలో ముందుంటారు. స్థానికులను ఏదైనా అడిగితే.. ఇంగ్లిష్ రాకపోయినా.. వచ్చీరాని భాషతో పర్యాటకులకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. పర్యాటకులకు బ్యాంకాక్‌పై ఇష్టం పెరగడానికి ఇదో కారణం.
► Read latest Explained Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 23 Dec 2025 12:11 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పేరుకే పెద్దమనిషి.. భారత్ అంటే నిలువెల్లా విద్వేషమే! ఆయన చేసింది బ్యాంకు వ్యాపారం.. గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీలు ఇచ్చి అయినకాడికి వసూలు చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి.
- ప్రేమికుల రోజు సరదాలా?ఖర్చే లేకుండా రొమాంటిక్ అనుభవాలు పొందొచ్చు! ప్రేమికుల రోజు.. కేవలం ప్రేమ జంటలే కాదు, భార్యాభర్తలూ చేసుకోదగ్గ వేడుక. సాధరణంగా ఈ రోజున ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.
- టెండర్లపై ‘ఏఐ’ నిఘా.. అక్రమాలు, సిండికేట్‌లు ఇకపై కుదరవు! రహదారులు, రైల్వే ప్రాజెక్టులు సహా అభివృద్ధి పనులు.. ఇలా ప్రభుత్వంలో ప్రధాన నిర్మాణ ప్రాజెక్టులకు టెండర్లు తప్పనిసరి.
- విహారయాత్ర సరే.. బడ్జెట్ మాటేంటి? నెలవారీ ఖర్చులు, భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికల మధ్య విహారయాత్రకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించడం కష్టమే. అయితే, చేసే ఖర్చుల్లోనే కొంత మొత్తం పొదుపు చేస్తే విహారానికి బడ్జెట్ పెద్ద సమస్యే కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. మరి దానికి ఏం చేయాలంటే..
- వద్దన్నా వస్తున్నారు.. యూరప్‌లో ట్రావెల్ ఓవర్‌క్రౌడింగ్! చాలా దేశాల ప్రభుత్వాలు తమ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ.. మా దేశంలో పర్యటించాలని ప్రకటనలు, ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి.
- ‘మని’ ద్వీపకల్పం.. అక్కడ అంతా ఒకే సమూహం గ్రీసులో ఉన్న ఓ మానవ సమూహం తరతరాలుగా అనేక దాడులను ఎదుర్కొని నిలిచింది.
- పిల్లల్ని కనబోతున్నారా.. మరి వీటి గురించి ఆలోచించారా? పెళ్లి చేసుకున్న యువజంటలతో బంధువులు అనే మొదటి మాట..‘పిల్లల్ని ఎప్పుడు కంటారు? తొందరగా కనేయండి’అని. వైవాహిక జీవితానికి తల్లిదండ్రులు అనే హోదానే పరిపూర్ణత ఇస్తుందని సమాజం నమ్ముతుంది.
- మాటలెందుకు? మీమ్స్ ఉండగా.. జెన్ జీ లైఫ్‌స్టైల్ ఇదీ! ఎవరైనా బొద్దుగా ఉన్న వ్యక్తి తారసపడితే ‘ఒడియమ్మా బంటీ’ అంటున్నారు.. ఏదైనా పనిని ఆశ్చర్యపరిచేలా వేగంగా చేసినా, ఎవరూ చేయలేని పనిని చేసి చూపించినా ‘ఫ్లాష్‌మ్యాన్’ అని పిలుస్తున్నారు. ఎందుకు అంటారా? ఇటీవల సోషల్‌మీడియాలో ట్రెండ్ అయినా మీమ్స్ అవి.
- టైమ్‌కి పని అవ్వాలంటే.. ఈ టెక్నిక్స్ తెలిసుండాలి! అనుకున్న పనులు సమయానికి పూర్తి కావాలంటే సమయ పాలన చాలా ముఖ్యం. దీన్ని పట్టించుకోకపోతే పనులన్నీ గందరగోళంగా, అసంపూర్తిగా ఉంటాయి.
- జిప్ కోడింగ్.. గల్లీ దాటని ప్రేమ! గతంలో ప్రేమ కోసం సప్తసాగారాలు దాటిన కథలు విన్నాం. ఈ టెక్నాలజీ యుగంలో ఎంత దూరమున్నా మొబైల్‌లో మాట్లాడుతూ, వీడియో కాల్స్‌తో నెట్టుకొస్తున్న లాంగ్ డిస్టెన్స్ ప్రేమలనూ చూస్తున్నాం. కానీ, ఇప్పుడు కాలంతోపాటు యువత ఆలోచనలూ మారుతున్నాయి.
- గ్రీన్‌లాండ్‌లో స్థలాన్ని కొనలేం.. ఇల్లు కావాలంటే పదేళ్లు వేచి చూడాలి! గ్రీన్‌లాండ్.. డెన్మార్క్‌కు చెందిన స్వయంప్రతిపత్తి గల ప్రాంతం. ఇక్కడి భూచట్టాల ప్రకారం.. భూమి అనేది ఇక్కడి ప్రజల సామూహిక వనరు. అందుకే, వ్యక్తిగతంగా ఎవరికీ యాజమాన్య హక్కులుండవు.
- నదిలో బంగారం.. అదే వారికి జీవనాధారం! హరియాణాలోని యమునానగర్ జిల్లాలో బోలి నది ప్రవహిస్తుంటుంది. ఆ నదీతీర ప్రాంతంలో నివసించే ప్రజలకు అది కేవలం నీటి వనరే కాదు.. జీవనాధారం కూడా. ఎందుకంటే ఆ నదీలో బంగారం ఉంది.
- ఊరు మొత్తానికి ఒక్కటే వంటశాల.. వృద్ధుల కోసం వినూత్న ఆలోచన! చందంకి.. గుజరాత్‌లోని మారుమూల చిన్న గ్రామం. అన్ని ఊర్లలో ఉన్నట్టుగానే ఇరుకైన వీధులు, సాధారణ ఇళ్లు, గుడి, బడి అన్ని ఉంటాయి. కానీ, ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది.
- పొట్ట నిండినా ఆహారంపైనే ధ్యాస.. పెరుగుతోన్న ఫుడ్ నాయిస్ ఆకలి వేస్తే భోజనం చేస్తాం. ఎప్పుడైనా అనుకోకుండా మంచి ఫుడ్ కనిపిస్తే జిహ్వా కోరికని తీర్చేస్తాం. కానీ, కొంతమందికి ఆకలి తీరినా, ఎన్ని రకాల రుచులు చూసినా ఇంకా ఏం తినాలి? ఎప్పుడు తినాలి? అని ఆహారం గురించే ఆలోచిస్తుంటారు.
- ఇజ్రాయెల్ ఆర్మీలో అందమైన భామలు! Israeli Army: ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆర్మీ కలిగిన దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. అత్యాధునిక ఆయుధ, సాంకేతిక సంపత్తి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) సొంతం.
- ఇతరుల్ని అర్థం చేసుకునేవారు ఇలా ఉంటారట! మనుషులంతా ఒకేలా ఉండరు. కొందరికి ఎంత చెప్పినా అర్థం కాదు. మరికొందరు చెప్పకుండానే అర్థం చేసుకుంటారు. కానీ, చాలా కొంత మందికే ఇతరులను పూర్తిగా చదవగలిగే సామర్థ్యం ఉంటుంది.
- ఈ ఆలయంలో మొక్కుకుంటే జుట్టు రాలదట! ఏ దేవాలయానికి వెళ్లినా సుఖఃసంతోషాలు కలిగించమని, ఆరోగ్యం కాపాడమని, సంపద పెరగాలని దేవుళ్లకు ప్రార్థించడం సహజం. వాళ్లు కరుణిస్తే మొక్కులు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే, జపాన్‌లో ఓ విచిత్రమైన ఆలయం ఉంది. అక్కడ భక్తులు కేవలం తమ జుట్టు రాలిపోకూడదని, జుట్టు సమస్యలు తొలగిపోవాలని మాత్రమే ప్రార్థిస్తారు.
- ఎగిరే గాలిపటం.. మెరుగయ్యే జీవనం! గాలిపటాలు ఎగరవేయడం అనేది కేవలం సంప్రదాయం, సరదా మాత్రమే కాదు.. మనుషులకు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాదు, ఎన్నో లాభాలు చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- ఒంటరితనానికి కారణం ఇతరులు కాదు, మన అలవాట్లే! కొంత మంది ఒంటరిగా మిగిలిపోయామని మథనపడుతుంటారు. తనకంటూ ఎవరూ లేరని, చుట్టూ ఉన్నవారు దూరం చేస్తున్నారని భావిస్తారు. నిజానికి మనలోని అలవాట్లు, ఆలోచన తీరు, మనస్తత్వాలే మనుషుల్ని మనకు దూరం చేస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
- అనగనగా ఓ గ్రామం.. అక్కడ ఒకే ఒక్క ఇల్లు! నిర్మానుష్య ప్రాంతంలో కాసేపు ఉండాలంటేనే భయంతో వణుకు వచ్చేస్తుంటుంది. అలాంటిది, కనుచూపుమేరలో మనుషులే కనిపించని ఓ మారుమూల గ్రామంలో ఓ కుటుంబం కొన్నేళ్లుగా నివసిస్తోంది.