ఆటల్లో ఆనందం వెతుక్కోండి.. గెలుపోటములు కాదు: ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 23 Dec 2025 19:40 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

సంతనూతలపాడు (ఒంగోలు క్రీడా విభాగం): క్రీడల్లో గెలుపోటములు ముఖ్యం కాదని, వాటిలో ఆనందం వెతుక్కోవాలని జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ క్రీడా మైదానంలో జరుగుతున్న ‘ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్’ ప్రజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2025 ప్రారంభోత్సవానికి ఎస్సీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ ‘ఈనాడు’ ఇలాంటి పోటీలు నిర్వహించడంతో పాటు గిన్నిస్బుక్ ఆఫ్ రికార్డు సాధించడం అభినందనీయమన్నారు. క్రీడల్లో ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయని, నాయకత్వ లక్షణాలు, టీమ్ స్పిరిట్ అలవడుతుందన్నారు. పాఠశాలలు, కళాశాలల జీవితాలు బాగుంటాయన్నారు. క్రీడలను ఆనందంగా, ఎంజాయ్ చేస్తూ ఆడుకోవాలని పేర్కొన్నారు.

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ కందిమళ్ల పూర్ణచంద్రరావు, ఏజీఎం గోగినేని రాఘవులులు మాట్లాడుతూ.. క్రీడల్లో శారీరక, మానసిక వికాంతో పాటు చదువులో సైతం రాణించవచ్చని తెలిపారు. చలపతి ఇన్‌స్టిట్యూషన్స్ అకడమిక్ అండ్ ఆపరేషన్స్ డీన్ కె.కిరణ్‌కుమార్, వెంకటరమణ నర్సింగ్ హోమ్ వైద్యశాల గుండె వైద్యులు డాక్టర్ వరుణ్‌మిత్ర మాట్లాడుతూ.. ‘ఈనాడు’ ఇలాంటి క్రీడలను చేపట్టడం మంచి విషయమని తెలిపారు. ఈనాడు యూనిట్‌ ఇన్‌ఛార్జి ఎ.ఎస్.చక్రవర్తి మాట్లాడుతూ.. గ్రామీణ విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈనాడు క్రీడా పోటీలను నిర్వహిస్తుందన్నారు. అనంతరం ఎస్పీ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.

అదరగొట్టిన ఆంధ్రకేసరి విద్యా కేంద్రం జూనియర్ కళాశాల జట్టు

ఆంధ్రకేసరి విద్యాకేంద్రం జూనియర్ కళాశాల జట్టు స్మార్ట్ జెన్ జూనియర్ కళాశాల జట్టుపై 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రకేసరి జట్టు 10 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన స్మార్ట్ జెన్ జట్టు 10 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసి ఓటమిపాలైంది.

బ్యాటింగ్, బౌలింగ్లో రాణించి గెలుపు

పేస్ పాలిటెక్నిక్ కళాశాల జట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల(కంభం) జట్టుపై 41 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన పేస్ జట్టు ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించింది. 10 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన ప్రభుత్వ కళాశాల జట్టు 10 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి కేవలం 64 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

► Read latest Prakasam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • సాంఘిక సంక్షేమ గురుకులం విద్యార్థినులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సందర్శన [ 18-02-2026] వృత్తిపూర్వక సందర్శనలో భాగంగా సింగరకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సాంఘిక సంక్షేమ గురుకులం విద్యార్థినులు సందర్శించారు.
  • ఉయ్యాలే ఉరితాడై.. ఏడేళ్ల చిన్నారి మృతి [ 18-02-2026] చీరతో కట్టిన ఉయ్యాలలో ఆడుకుంటున్న చిన్నారికి అదే ఉయ్యాల ఉరితాడుగా మారిన ఘటన మంగళవారం రాత్రి మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో చోటుచేసుకుంది.
  • నేడు సింగరకొండ 71వ వార్షిక తిరుణాళ్ల సమన్వయ కమిటీ సమావేశం [ 18-02-2026] సింగరకొండ 71వ వార్షిక తిరుణాళ్ల సమన్వయ కమిటీ సమావేశం ఈరోజు ఉదయం జరగనుంది. ఆలయ ముఖ మండపం కుంభాభిషేకం గత ఏడాది మే 19న నిర్వహించారు.
  • పల్లె పోరుకు కసరత్తు! [ 18-02-2026] పల్లె పోరు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రావడంతో ఆ దిశగా జిల్లా పంచాయతీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
  • ఖనిజాన్వేషణ! [ 18-02-2026] ఉమ్మడి ప్రకాశం జిల్లా లింగసముద్రం, వలేటివారిపాలెం ప్రాంతాల్లోని భూముల్లో ఇనుప ఖనిజం ఉండడంతో ఖనిజాన్వేషణ సాగిస్తున్నారు. ఖనిజం వెలికితీసేందుకు జిందాల్‌ సంస్థ ఆసక్తి చూపడంతో ప్రభుత్వం అనుమతుల విషయమై చురుగ్గా వ్యవహరిస్తోంది.
  • ‘బాలుడి మృతిపై దర్యాప్తు వేగవంతం’ [ 18-02-2026] విద్యార్థి అనుమానాస్పద మృతిపై దర్యాప్తు వేగవంతం చేసి కారకులపై చట్టపరమైన చర్యలు చేపడతామని కందుకూరు సీఐ అన్వర్‌బాషా తెలిపారు.
  • బత్తాయి రైతు బతికేదెట్టా? [ 18-02-2026] జిల్లాలోని బత్తాయి రైతులు కష్టనష్టాలకు గురవుతున్నారు. పంట దిగుబడులను భద్రపరచుకునేందుకు మార్కెట్‌ సౌకర్యం కలగా మిగిలిపోవడంతో పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి నెలకొంది.
  • ఒంగోలు రైలు నిలయంలో సమస్యల కూత! [ 18-02-2026] ఒంగోలు రైలునిలయంలో తిరుపతి, చెన్నై వైపు వెళ్లే రైలు ఎక్కాలంటే కష్టాలు తప్పడం లేదు. మూడో నంబరుకు రావాల్సిన రైలు అయిదో నంబరుకు వస్తుందని చివర్లో ప్రకటన చేస్తుండడంతో ప్రయాణికులు పరుగులు పెట్టాల్సి వస్తోంది.
  • పెళ్లి బాజాలు మోగనున్నాయ్‌! [ 18-02-2026] ఈ నెల 19వ తేదీ నుంచి పెళ్లి బాజాలు మోగనున్నాయి. మొత్తం 53 శుభగడియలు ఉన్నాయని వేదపండితులు చెబుతున్నారు. ఫిబ్రవరి 19, 20, 21, 24, 25, 26, మార్చి 1, 3, 4, 7, 8, 9, 11, 12, ఏప్రిల్‌ 15, 20, 21, 25, 26, 27, 28, 29, మే 1, 3, 5, 6, 7, 8, 13, 14, జూన్‌ 21, 22, 23, 24, 25, 26, 27, 29, జులై 1, 6, 7, 11, నవంబరు: 21, 24, 25, 26, డిసెంబరు 2, 3, 4, 5, 6, 11, 12వ తేదీల్లో శుభ మహూర్తాలున్నాయి.
  • రంజాన్‌ మాసం.. సద్గుణాల ధామం [ 18-02-2026] ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్‌ నెల వచ్చేసింది. హృదయాలలో పవిత్రతను, ఆధ్యాత్మిక భావనను నింపే మాసంగా ఈ నెలను భావిస్తారు. శాంతి, సౌభ్రాతృత్వాన్ని లోకానికి చాటడం ఈ మాసం ప్రత్యేకత.
  • పచ్చాకు ట్రాక్టర్‌ బోల్తా.. కూలీ మృతి [ 18-02-2026] ఒంగోలు-చీరాల రహదారిలో త్రోవగుంట సమీపంలోని భారత్‌ పెట్రోలియం బంకు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళా కూలీ దుర్మరణం పాలయ్యారు.
  • కడతేరిపోయావా కన్నా..! [ 18-02-2026] తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఆ పసివాడిని బలితీసుకుంది..పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డను పొలం గట్టుపై వదిలేయడంతో..అక్కడున్న విష ద్రావణం తాగిన అతను చికిత్స పొందుతూ కడతేరిపోయాడు.