ఆటల్లో ఆనందం వెతుక్కోండి.. గెలుపోటములు కాదు: ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు

- A
- A+
- A++

సంతనూతలపాడు (ఒంగోలు క్రీడా విభాగం): క్రీడల్లో గెలుపోటములు ముఖ్యం కాదని, వాటిలో ఆనందం వెతుక్కోవాలని జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ క్రీడా మైదానంలో జరుగుతున్న ‘ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్’ ప్రజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2025 ప్రారంభోత్సవానికి ఎస్సీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ ‘ఈనాడు’ ఇలాంటి పోటీలు నిర్వహించడంతో పాటు గిన్నిస్బుక్ ఆఫ్ రికార్డు సాధించడం అభినందనీయమన్నారు. క్రీడల్లో ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయని, నాయకత్వ లక్షణాలు, టీమ్ స్పిరిట్ అలవడుతుందన్నారు. పాఠశాలలు, కళాశాలల జీవితాలు బాగుంటాయన్నారు. క్రీడలను ఆనందంగా, ఎంజాయ్ చేస్తూ ఆడుకోవాలని పేర్కొన్నారు.

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ కందిమళ్ల పూర్ణచంద్రరావు, ఏజీఎం గోగినేని రాఘవులులు మాట్లాడుతూ.. క్రీడల్లో శారీరక, మానసిక వికాంతో పాటు చదువులో సైతం రాణించవచ్చని తెలిపారు. చలపతి ఇన్‌స్టిట్యూషన్స్ అకడమిక్ అండ్ ఆపరేషన్స్ డీన్ కె.కిరణ్‌కుమార్, వెంకటరమణ నర్సింగ్ హోమ్ వైద్యశాల గుండె వైద్యులు డాక్టర్ వరుణ్‌మిత్ర మాట్లాడుతూ.. ‘ఈనాడు’ ఇలాంటి క్రీడలను చేపట్టడం మంచి విషయమని తెలిపారు. ఈనాడు యూనిట్ ఇన్‌ఛార్జి ఎ.ఎస్.చక్రవర్తి మాట్లాడుతూ.. గ్రామీణ విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈనాడు క్రీడా పోటీలను నిర్వహిస్తుందన్నారు. అనంతరం ఎస్పీ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
అదరగొట్టిన ఆంధ్రకేసరి విద్యా కేంద్రం జూనియర్ కళాశాల జట్టు
ఆంధ్రకేసరి విద్యాకేంద్రం జూనియర్ కళాశాల జట్టు స్మార్ట్ జెన్ జూనియర్ కళాశాల జట్టుపై 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రకేసరి జట్టు 10 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన స్మార్ట్ జెన్ జట్టు 10 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసి ఓటమిపాలైంది.
బ్యాటింగ్, బౌలింగ్లో రాణించి గెలుపు
పేస్ పాలిటెక్నిక్ కళాశాల జట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల(కంభం) జట్టుపై 41 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన పేస్ జట్టు ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించింది. 10 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన ప్రభుత్వ కళాశాల జట్టు 10 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి కేవలం 64 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.


గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- సాంఘిక సంక్షేమ గురుకులం విద్యార్థినులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సందర్శన [ 18-02-2026] వృత్తిపూర్వక సందర్శనలో భాగంగా సింగరకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సాంఘిక సంక్షేమ గురుకులం విద్యార్థినులు సందర్శించారు.
- ఉయ్యాలే ఉరితాడై.. ఏడేళ్ల చిన్నారి మృతి [ 18-02-2026] చీరతో కట్టిన ఉయ్యాలలో ఆడుకుంటున్న చిన్నారికి అదే ఉయ్యాల ఉరితాడుగా మారిన ఘటన మంగళవారం రాత్రి మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో చోటుచేసుకుంది.
- నేడు సింగరకొండ 71వ వార్షిక తిరుణాళ్ల సమన్వయ కమిటీ సమావేశం [ 18-02-2026] సింగరకొండ 71వ వార్షిక తిరుణాళ్ల సమన్వయ కమిటీ సమావేశం ఈరోజు ఉదయం జరగనుంది. ఆలయ ముఖ మండపం కుంభాభిషేకం గత ఏడాది మే 19న నిర్వహించారు.
- పల్లె పోరుకు కసరత్తు! [ 18-02-2026] పల్లె పోరు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రావడంతో ఆ దిశగా జిల్లా పంచాయతీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
- ఖనిజాన్వేషణ! [ 18-02-2026] ఉమ్మడి ప్రకాశం జిల్లా లింగసముద్రం, వలేటివారిపాలెం ప్రాంతాల్లోని భూముల్లో ఇనుప ఖనిజం ఉండడంతో ఖనిజాన్వేషణ సాగిస్తున్నారు. ఖనిజం వెలికితీసేందుకు జిందాల్ సంస్థ ఆసక్తి చూపడంతో ప్రభుత్వం అనుమతుల విషయమై చురుగ్గా వ్యవహరిస్తోంది.
- ‘బాలుడి మృతిపై దర్యాప్తు వేగవంతం’ [ 18-02-2026] విద్యార్థి అనుమానాస్పద మృతిపై దర్యాప్తు వేగవంతం చేసి కారకులపై చట్టపరమైన చర్యలు చేపడతామని కందుకూరు సీఐ అన్వర్‌బాషా తెలిపారు.
- బత్తాయి రైతు బతికేదెట్టా? [ 18-02-2026] జిల్లాలోని బత్తాయి రైతులు కష్టనష్టాలకు గురవుతున్నారు. పంట దిగుబడులను భద్రపరచుకునేందుకు మార్కెట్ సౌకర్యం కలగా మిగిలిపోవడంతో పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి నెలకొంది.
- ఒంగోలు రైలు నిలయంలో సమస్యల కూత! [ 18-02-2026] ఒంగోలు రైలునిలయంలో తిరుపతి, చెన్నై వైపు వెళ్లే రైలు ఎక్కాలంటే కష్టాలు తప్పడం లేదు. మూడో నంబరుకు రావాల్సిన రైలు అయిదో నంబరుకు వస్తుందని చివర్లో ప్రకటన చేస్తుండడంతో ప్రయాణికులు పరుగులు పెట్టాల్సి వస్తోంది.
- పెళ్లి బాజాలు మోగనున్నాయ్! [ 18-02-2026] ఈ నెల 19వ తేదీ నుంచి పెళ్లి బాజాలు మోగనున్నాయి. మొత్తం 53 శుభగడియలు ఉన్నాయని వేదపండితులు చెబుతున్నారు. ఫిబ్రవరి 19, 20, 21, 24, 25, 26, మార్చి 1, 3, 4, 7, 8, 9, 11, 12, ఏప్రిల్ 15, 20, 21, 25, 26, 27, 28, 29, మే 1, 3, 5, 6, 7, 8, 13, 14, జూన్ 21, 22, 23, 24, 25, 26, 27, 29, జులై 1, 6, 7, 11, నవంబరు: 21, 24, 25, 26, డిసెంబరు 2, 3, 4, 5, 6, 11, 12వ తేదీల్లో శుభ మహూర్తాలున్నాయి.
- రంజాన్ మాసం.. సద్గుణాల ధామం [ 18-02-2026] ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ నెల వచ్చేసింది. హృదయాలలో పవిత్రతను, ఆధ్యాత్మిక భావనను నింపే మాసంగా ఈ నెలను భావిస్తారు. శాంతి, సౌభ్రాతృత్వాన్ని లోకానికి చాటడం ఈ మాసం ప్రత్యేకత.
- పచ్చాకు ట్రాక్టర్ బోల్తా.. కూలీ మృతి [ 18-02-2026] ఒంగోలు-చీరాల రహదారిలో త్రోవగుంట సమీపంలోని భారత్ పెట్రోలియం బంకు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళా కూలీ దుర్మరణం పాలయ్యారు.
- కడతేరిపోయావా కన్నా..! [ 18-02-2026] తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఆ పసివాడిని బలితీసుకుంది..పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డను పొలం గట్టుపై వదిలేయడంతో..అక్కడున్న విష ద్రావణం తాగిన అతను చికిత్స పొందుతూ కడతేరిపోయాడు.
English Translation
Find joy in sports.. not winning: SP V.Harshavardhanraju

- A
- A+
- A++

Santanuthalapadu (Ongole Sports Department): District SP V. Harshavardhanraju said that winning in sports is not important, one should find happiness in them. SC was the chief guest at the inaugural function of the 'Dhanik Bharat Educational Institutions' Presents Sports League-2025 held at the local Rajiv Gandhi University of Knowledge and Technologies sports ground on Tuesday. SP said that 'Enadu' is appreciative of holding such competitions and achieving Guinness Book of Records. He said that good relations with others are formed in sports, leadership qualities and team spirit are cultivated. The lives of schools and colleges are good. Sports should be played with joy and enjoyment.

Dhanik Bharat Educational Institutions Director Kandimalla Purnachandra Rao, AGM Gogineni Raghavululu He said that he can excel in studies along with physical and mental development in sports. Chalapathy Institutions Academic and Operations Dean K.Kirankumar, Venkataramana Nursing Home Hospital Cardiologist Dr. Varunmitra said. Eanadu unit in-charge A.S. Chakraborty said that Eanadu sports competitions are organized with the aim of encouraging rural students in sports. After that, SP players were introduced.
Andhrakesari Vidya Kendra Junior College team defeated Andhrakesari Vidya Kendra Junior College team won by 32 runs against Smart Zen Junior College team. Batting first, the Andhra Kesari team scored 96 runs losing 3 wickets in 10 overs. After that, the Smart Gen team, which went into bat, lost 4 wickets in 10 overs and lost by 64 runs.Batting and bowling excelled and won
Pace Polytechnic College team won by 41 runs against the Government Junior College (Kambham) team. Batting first, the pace team showed aggression right from the start. They lost 7 wickets in 10 overs and made 105 runs. The Government College team, which came down to defeat, lost 8 wickets in 10 overs and scored only 64 runs.


Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Social Welfare Gurukulam Students Visit Government Polytechnic College [ 18-02-2026] Students of Social Welfare Gurukulam visited Singarakonda Government Polytechnic College as part of a professional visit. 18-02-2026] The incident of a child playing in a rope tied with a sari took place on Tuesday night in Indiramma Colony under Markapuram Town Police Station. 18-02-2026] Singarakonda 71st Annual Tirunalla Coordinating Committee meeting will be held today morning. Kumbhabhishekam of the front of the temple was held on May 19 last year. [ 18-02-2026] The district panchayat officials are making preparations in that direction after receiving orders from the state election commission to make arrangements for the management of village polls.
- Mining exploration! [ 18-02-2026] Mineral exploration is being carried out due to the presence of iron ore in the lands of Lingasamudram and Valetivaripalem areas of the joint Prakasam district. As Jindal's company showed interest in extracting the mineral, the government is actively working on permits. 18-02-2026] Kandukur CI Anwarbasha said that the investigation on the suspicious death of the student will be expedited and legal action will be taken against the culprits. [ 18-02-2026] Battai farmers in the district are facing hardships. As the market facility remains a dream to secure crop yields, there is also a situation where investments are not available. [ 18-02-2026] Boarding a train bound for Tirupati and Chennai at Ongole Railway Station is not without difficulties. At the end of the announcement that the train which was supposed to come to number three will come to number five, the passengers have to run.
- Wedding bells are ringing! [ 18-02-2026] Wedding bells will ring from 19th of this month. Vedic scholars say that there are 53 auspicious times. February 19, 20, 21, 24, 25, 26, March 1, 3, 4, 7, 8, 9, 11, 12, April 15, 20, 21, 25, 26, 27, 28, 29, May 1, 3, 5, 6, 7, 8, 13, 14, June 21, 22, 23, 24, 25, 26, 27, 29, July 1, 6, 7, 11, November: 21, 24, 25, 26, December 2, 3, 4, 5, 6, 11, 12 have auspicious moments.
- Ramazan Month.. Abode of Virtues [ 18-02-2026] The month of Ramadan, considered the most sacred by the Muslim brothers, has arrived. This month is considered as the month that fills the hearts with purity and spiritual feeling. This month is special for spreading peace and brotherhood to the world.
- Pachaku tractor overturned.. laborer killed [ 18-02-2026] A woman laborer was killed in a road accident on Tuesday near Bharat Petroleum Bank near Trovagunta on the Ongolu-Cheerala road. [ 18-02-2026] Negligence of the parents killed the baby..The baby who was supposed to be in the womb was left on the bank of the farm..He drank the poisonous solution there and died while receiving treatment.