
ఏఎన్నార్ కళాశాల.. విశ్వవిద్యాలయంగా ఎదగాలి

- A
- A+
- A++

ఈనాడు, అమరావతి, ఈనాడు డిజిటల్- మచిలీపట్నం, న్యూస్‌టుడే, గుడివాడ: ఎంతోమందిని ఉన్నతంగా తీర్చిదిద్దిన అక్కినేని నాగేశ్వరరావు కళాశాల మరింత అభివృద్ధి చెంది విశ్వవిద్యాలయంగా ఎదగాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. అందుకు అవసరమైన మౌలిక సౌకర్యాలు, మంచి వాతావరణం కల్పించడానికి ఇక్కడి నుంచి ఎదిగిన ప్రతిఒక్కరూ సహకారం అందించాలని సూచించారు. గుడివాడలోని ఏఎన్నార్ కళాశాలను స్థాపించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో గురువారం వెంకయ్యనాయుడు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. వజ్రోత్సవాలకు గుర్తుగా ముద్రించిన పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ 1950ల్లో స్థానిక పెద్దల చొరవతో ఇక్కడ కళాశాలను స్థాపించడం, తర్వాత అక్కినేని నాగేశ్వరరావు ఆర్థిక చేయూతనివ్వడం విద్యార్థులకు వరంగా మారిందని గుర్తుచేశారు. ‘ప్రస్తుత విద్యా విధానంలో సమూల మార్పులు రావాలి. ఏఐ యుగంలో ఉన్నాం. సాంకేతికతకు అనుగుణంగా మనమంతా మారాలి. నేటితరం నైపుణ్యాలను పెంచుకుంటేనే పోటీ ప్రపంచంలో రాణించగలరు. ఉపాధిని చూపించే నైపుణ్యాలతో పాటు విజ్ఞానం, సంస్కారం పెంచేలా నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తోంద’ని వెంకయ్యనాయుడు వివరించారు. ఉపాధ్యాయులు బోధనలో ఆధునిక మార్పులను అందిపుచ్చుకొని, విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ఈ కళాశాలలో చదువుకుని, ఉన్నత స్థానాలకు ఎదిగిన రామోజీరావు వంటివారిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

న్యాయమూర్తిగా కాకుండా, ఒకప్పటి ఈ కళాశాల విద్యార్థి సంఘం నాయకుడిగా కొన్ని వాస్తవాలు చెప్పాలనుకుంటున్నా. ప్రస్తుతం విద్యారంగం పరిస్థితి సరిగా లేదు. ప్రభుత్వాలు రూ.వేల కోట్లు విద్యారంగంపై వెచ్చిస్తున్నా, వాటి ఫలాలు విద్యార్థులకు అందడం లేదు. ఉపాధ్యాయులు, అధ్యాపకుల శాశ్వత నియామకాలు చేపట్టకుండా, పొరుగు సేవలు, కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీలతో నెట్టుకొస్తున్నారు. వీరికి ఉద్యోగ భద్రత లేకపోవడంతో నిబద్ధతతో పనిచేసే అవకాశం లేదు. ఇటీవల ఏయూ లా కళాశాలకు వెళ్తే, అక్కడ ఒకేఒక్కరు శాశ్వత సిబ్బంది ఉన్నారు. మిగతా వారంతా గెస్ట్ ఫ్యాకల్టీ, ఔట్‌సోర్సింగ్ సిబ్బందే. వాస్తవంగా అక్కడ 25 శాశ్వత పోస్టులున్నాయి. విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలి. వారిలో నాయకత్వ లక్షణాలను పెంచితే, సమాజానికి తోడ్పాటునందించగలరు. ఇటీవల ప్రభుత్వం మాక్ అసెంబ్లీ నిర్వహించింది. ఇలాంటి వాటికంటే, నాయకులు స్వతహాగా ఎదిగేందుకు విద్యార్థి సంఘాల ఎన్నికలు దోహదపడతాయి. ఇందులో ఇబ్బందులుంటే పరిష్కరించాలి కానీ, ప్రమాదం జరుగుతుందని ప్రయాణాలు మానేయలేం కదా?
75ఏళ్లుగా ఏఎన్నార్ కళాశాల నుంచి వేలమంది ఉన్నతంగా బయటకెళ్లారు. వచ్చే 25 ఏళ్లలో ఏం చేయాలో ఇప్పటినుంచే దృష్టి పెట్టాలి. అప్పుడే గతంలో కంటే రెట్టింపు ఫలితాలు పొందగలం. కాలం తీరిన కోర్సుల స్థానంలో ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా కొత్తవి ప్రవేశపెట్టాలి. కళాశాల కమిటీ ఆధ్వర్యంలో ఆ ప్రయత్నం జరుగుతోంది.

భారతీయులు, ప్రధానంగా తెలుగు వాళ్లలో ఆంత్రప్రెన్యూరల్ స్పిరిట్ బాగా ఎక్కువనీ, తెలుగు రాష్ట్రాల్లోని ఏ జిల్లాలో చూసినా ఈ చొరవ కనిపిస్తుందని రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ సీహెచ్ కిరణ్ పేర్కొన్నారు. ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. కళాశాల డైమండ్ జూబ్లీ సావనీర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కిరణ్ మాట్లాడుతూ గతంలో పెద్దలు ఎంతో ముందుచూపుతో వ్యవహరించే వారని, భావితరాలకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఎంతోమంది భూరి విరాళాలు అందించారని గుర్తుచేశారు. ‘గుడివాడ ప్రభుత్వ కళాశాల, విజయవాడ లయోలా, గుంటూరులోని పలు కళాశాలలకు భారీగా విరాళాలిచ్చారు. వారి సహకారంతోనే విద్యాపరంగా ఈరోజు ఎంతో పురోగతి సాధించగలిగాం. మనం చదువుకున్న విద్యాసంస్థతో అనుబంధం నెమరువేసుకోవడం ఒక అనుభూతి. కానీ, తల్లిదండ్రులు చదువుకున్న విద్యాసంస్థతో అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం వేరే స్థాయి అనుభూతి. నాన్న రామోజీరావు చదువుకున్న ఈ కళాశాలకు వచ్చి మొత్తం తిరిగి చూడాలనుకున్నాను. భవిష్యత్తులో కచ్చితంగా వచ్చి చూస్తాను’ అని కిరణ్ పేర్కొన్నారు.
వృత్తి, వ్యక్తిగత నైపుణ్యాలు పెంచాలి
విద్యలో మనవాళ్లు బాగా ఆరితేరుతున్నా.. మానవ, వృత్తి, వ్యక్తిగత సంబంధాలు, నైపుణ్యాల విషయంలో వెనకబడి ఉన్నారని కిరణ్ పేర్కొన్నారు. ‘ప్రపంచంలో నెగ్గుకురావడం, పది మందితో కలిసి జీవించడం అనేవే పాఠ్యాంశాలు, బోధనాంశాలుగా చెప్పాల్సిన అగత్యం ఏర్పడుతోంది. న్యూక్లియర్ కుటుంబాల వల్ల వీటిని నేర్పించడానికి పెద్దవాళ్లు ఎవరూ ఉండడం లేదు. అందుకే నాన్న పేరుతో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏఎన్నార్ కళాశాల కమిటీ సహకారంతో అభివృద్ధి చేయాలని మా కుటుంబం అంతా నిర్ణయించుకున్నాం. ఎలా చేయాలో ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తాం. దీన్ని ప్రారంభించేందుకు కుటుంబం తరఫున రూ.50 లక్షల విరాళం అందించాలి అనుకుంటున్నామ’ని వెల్లడించారు. కళాశాల వందేళ్ల వేడుకకు కూడా అందరం కలిసే అవకాశం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 06:27 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు.
- రాంబిల్లిలో మెగా ఔషధ కంపెనీ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో మెగా ఔషధ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు సాగుతున్నాయి.
- విలేజ్ టు విరాట్ మీరు క్రికెట్ బాగా ఆడతారా..? మీ ప్రతిభకు తగిన గుర్తింపు, వేదిక కోసం చూస్తున్నారా..? అయితే.. మీ కోసమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ‘విలేజ్ టు విరాట్’ ట్యాగ్‌తో ‘రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రాం’కు రూపకల్పన చేస్తోంది.
- ‘ఆరెంజ్ ఎకానమీ’ అభివృద్ధికి త్వరలో వర్క్‌షాపులు సాంస్కృతిక, పర్యాటక, ఫిల్మ్ టూరిజం విభాగాల్ని సమన్వయం చేస్తూ ‘ఆరెంజ్ ఎకానమీ’ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇందుకోసం జూన్ లేదా జులై నెలల్లో ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహిస్తామని తెలిపారు.
- పర్యాటకానికి ‘స్వర్ణ’ కళ! వైకాపా హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర పర్యాటక రంగం తిరిగి గాడిలో పడుతోంది. కూటమి ప్రభుత్వం దానికి పారిశ్రామిక హోదా కల్పించి ప్రోత్సాహకాలు ప్రకటించడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులొస్తున్నాయి.
- వైద్యులకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు ‘వైద్యరంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులు తెస్తోంది. వ్యాధుల నిర్ధారణ, ఆరోగ్య సేవల్లో క్లిష్ట సమస్యలకు ఏఐ టూల్స్ పరిష్కారాలు చూపిస్తున్నాయి.
- వైభవంగా నూకతాత జాతర అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో మంగళవారం నూకతాత జాతర వైభవంగా సాగింది. నూకతాత ప్రతిమకు పూజారులు, భక్తులు బోయపాడు తీరంలో ఉదయం స్నానం చేయించి పూజలు నిర్వహించారు.
- నందీశ్వరుడిపై సర్వాంతర్యామి సర్వాంతర్యామి అయిన సోమస్కందమూర్తి ఆయనకు ప్రియమైన నందీశ్వరుడిపై, జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు కామధేనువుపై కొలువుదీరి శ్రీకాళహస్తి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
- శ్రీశైలంలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పూర్ణాహుతి, చండీశ్వరునికి అవబృధ స్నానం, వసంతోత్సవ క్రతువులు ఘనంగా నిర్వహించారు.
- తుది దశలో మూలపేట పోర్టు నిర్మాణం ఉత్తరాంధ్రకు గేమ్ ఛేంజర్‌గా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ పోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణ పనులు 75 శాతం మేర పూర్తయినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
- 12వ పీఆర్సీ ప్రకటించకపోతే ‘చలో సచివాలయం’ వేతన సవరణ కోసం 12వ పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించి, ఐఆర్‌ను 29 శాతం ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎన్.ప్రసాద్ డిమాండ్ చేశారు.
- అమరావతిలో క్యాట్ శాశ్వత బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అమరావతిలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ సర్క్యూట్(క్యాట్) శాశ్వత బెంచ్ ఏర్పాటుకు భూ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని ఆ సంస్థ తెలిపింది.
- బిల్‌గేట్స్ పర్యటన.. సీఎం విజన్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్‌గేట్స్ అమరావతి పర్యటన.. సీఎం చంద్రబాబు విజన్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
- 21 రోజుల్లో జనన మరణాల నమోదు తప్పనిసరి రాష్ట్రంలో జనన మరణాల నమోదుకు కొత్త నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 21 రోజుల్లో నమోదు తప్పనిసరి చేసింది.
- అమర్‌నాథ్ బృందాన్ని కలవని అంబటి! రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు తమ పార్టీకే చెందిన కొందరు నేతలను ములాఖత్‌లో కలిసేందుకు ఇష్టపడలేదు.
- ఏపీలో వేగవంతమైన అభివృద్ధి ‘ఎక్స్’లో బిల్‌గేట్స్ ఏఐ, సాంకేతికతను ఉపయోగించుకుని వ్యవసాయం, విద్య, ఆరోగ్యరంగాల్లో ఆవిష్కరణలతో ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్‌గేట్స్ పేర్కొన్నారు.
- మూలుగ మార్పిడి చికిత్స ఎప్పటికి వస్తుంది? రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో మూలుగ (బోన్‌మారో) మార్పిడి చికిత్స అందుబాటులో లేకపోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది.
- అసెంబ్లీలో పని చేయని మైక్ సిస్టమ్ అసెంబ్లీలో మంగళవారం మైక్ సిస్టమ్ మొరాయించింది. శాసనసభలో ఉదయం 9 గంటలకు సమావేశాన్ని ప్రారంభించే సమయానికి ముందు సిబ్బంది పరిశీలించినపుడు మైకులు పని చేయడం లేదని గుర్తించారు. సాంకేతిక విభాగం హడావుడిగా సరిచేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు.
- ప్రాజెక్టు కొట్టుకుపోయినా పట్టించుకోని జగన్ మామిడి రైతులకు కష్టం వస్తే స్థిరీకరణ నిధి ద్వారా నిధులు కేటాయించి ఆదుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెదేపా ఎమ్మెల్యే కె.మురళీమోహన్ పేర్కొన్నారు. అందులో పూతలపట్టు నియోజకవర్గానికి అధిక మొత్తం నిధులు దక్కాయని చెప్పారు.
- వైకాపా పాలనలో ఇష్టారీతిన విద్యుత్తు రాయితీ విధానం వైకాపా హయాంలో ఆక్వా రంగంలో విద్యుత్తు రాయితీని ఇష్టానుసారంగా ఒక్కో రైతుకు ఒక్కో విధంగా అమలు చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైకాపా సర్కారు దుర్మార్గాలను సరిచేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.