ఏఎన్నార్‌ కళాశాల.. విశ్వవిద్యాలయంగా ఎదగాలి

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 19 Dec 2025 06:44 IST Ee Font size
  • A
  • A+
  • A++
5 min read

ఈనాడు, అమరావతి, ఈనాడు డిజిటల్‌- మచిలీపట్నం, న్యూస్‌టుడే, గుడివాడ: ఎంతోమందిని ఉన్నతంగా తీర్చిదిద్దిన అక్కినేని నాగేశ్వరరావు కళాశాల మరింత అభివృద్ధి చెంది విశ్వవిద్యాలయంగా ఎదగాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. అందుకు అవసరమైన మౌలిక సౌకర్యాలు, మంచి వాతావరణం కల్పించడానికి ఇక్కడి నుంచి ఎదిగిన ప్రతిఒక్కరూ సహకారం అందించాలని సూచించారు. గుడివాడలోని ఏఎన్నార్‌ కళాశాలను స్థాపించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో గురువారం వెంకయ్యనాయుడు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. వజ్రోత్సవాలకు గుర్తుగా ముద్రించిన పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ 1950ల్లో స్థానిక పెద్దల చొరవతో ఇక్కడ కళాశాలను స్థాపించడం, తర్వాత అక్కినేని నాగేశ్వరరావు ఆర్థిక చేయూతనివ్వడం విద్యార్థులకు వరంగా మారిందని గుర్తుచేశారు. ‘ప్రస్తుత విద్యా విధానంలో సమూల మార్పులు రావాలి. ఏఐ యుగంలో ఉన్నాం. సాంకేతికతకు అనుగుణంగా మనమంతా మారాలి. నేటితరం నైపుణ్యాలను పెంచుకుంటేనే పోటీ ప్రపంచంలో రాణించగలరు. ఉపాధిని చూపించే నైపుణ్యాలతో పాటు విజ్ఞానం, సంస్కారం పెంచేలా నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తోంద’ని వెంకయ్యనాయుడు వివరించారు. ఉపాధ్యాయులు బోధనలో ఆధునిక మార్పులను అందిపుచ్చుకొని, విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ఈ కళాశాలలో చదువుకుని, ఉన్నత స్థానాలకు ఎదిగిన రామోజీరావు వంటివారిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

న్యాయమూర్తిగా కాకుండా, ఒకప్పటి ఈ కళాశాల విద్యార్థి సంఘం నాయకుడిగా కొన్ని వాస్తవాలు చెప్పాలనుకుంటున్నా. ప్రస్తుతం విద్యారంగం పరిస్థితి సరిగా లేదు. ప్రభుత్వాలు రూ.వేల కోట్లు విద్యారంగంపై వెచ్చిస్తున్నా, వాటి ఫలాలు విద్యార్థులకు అందడం లేదు. ఉపాధ్యాయులు, అధ్యాపకుల శాశ్వత నియామకాలు చేపట్టకుండా, పొరుగు సేవలు, కాంట్రాక్ట్, గెస్ట్‌ ఫ్యాకల్టీలతో నెట్టుకొస్తున్నారు. వీరికి ఉద్యోగ భద్రత లేకపోవడంతో నిబద్ధతతో పనిచేసే అవకాశం లేదు. ఇటీవల ఏయూ లా కళాశాలకు వెళ్తే, అక్కడ ఒకేఒక్కరు శాశ్వత సిబ్బంది ఉన్నారు. మిగతా వారంతా గెస్ట్‌ ఫ్యాకల్టీ, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందే. వాస్తవంగా అక్కడ 25 శాశ్వత పోస్టులున్నాయి. విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలి. వారిలో నాయకత్వ లక్షణాలను పెంచితే, సమాజానికి తోడ్పాటునందించగలరు. ఇటీవల ప్రభుత్వం మాక్‌ అసెంబ్లీ నిర్వహించింది. ఇలాంటి వాటికంటే, నాయకులు స్వతహాగా ఎదిగేందుకు విద్యార్థి సంఘాల ఎన్నికలు దోహదపడతాయి. ఇందులో ఇబ్బందులుంటే పరిష్కరించాలి కానీ, ప్రమాదం జరుగుతుందని ప్రయాణాలు మానేయలేం కదా?

75ఏళ్లుగా ఏఎన్నార్‌ కళాశాల నుంచి వేలమంది ఉన్నతంగా బయటకెళ్లారు. వచ్చే 25 ఏళ్లలో ఏం చేయాలో ఇప్పటినుంచే దృష్టి పెట్టాలి. అప్పుడే గతంలో కంటే రెట్టింపు ఫలితాలు పొందగలం. కాలం తీరిన కోర్సుల స్థానంలో ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా కొత్తవి ప్రవేశపెట్టాలి. కళాశాల కమిటీ ఆధ్వర్యంలో ఆ ప్రయత్నం జరుగుతోంది.

భారతీయులు, ప్రధానంగా తెలుగు వాళ్లలో ఆంత్రప్రెన్యూరల్‌ స్పిరిట్‌ బాగా ఎక్కువనీ, తెలుగు రాష్ట్రాల్లోని ఏ జిల్లాలో చూసినా ఈ చొరవ కనిపిస్తుందని రామోజీ గ్రూప్‌ సంస్థల  సీఎండీ సీహెచ్‌ కిరణ్‌ పేర్కొన్నారు. ఏఎన్నార్‌ కళాశాల వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. కళాశాల డైమండ్‌ జూబ్లీ సావనీర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కిరణ్‌ మాట్లాడుతూ గతంలో పెద్దలు ఎంతో ముందుచూపుతో వ్యవహరించే వారని, భావితరాలకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఎంతోమంది భూరి విరాళాలు అందించారని గుర్తుచేశారు. ‘గుడివాడ ప్రభుత్వ కళాశాల, విజయవాడ లయోలా, గుంటూరులోని పలు కళాశాలలకు భారీగా విరాళాలిచ్చారు. వారి సహకారంతోనే విద్యాపరంగా ఈరోజు ఎంతో పురోగతి సాధించగలిగాం. మనం చదువుకున్న విద్యాసంస్థతో అనుబంధం నెమరువేసుకోవడం ఒక అనుభూతి. కానీ, తల్లిదండ్రులు చదువుకున్న విద్యాసంస్థతో అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం వేరే స్థాయి అనుభూతి. నాన్న రామోజీరావు చదువుకున్న ఈ కళాశాలకు వచ్చి మొత్తం తిరిగి చూడాలనుకున్నాను. భవిష్యత్తులో కచ్చితంగా వచ్చి చూస్తాను’ అని కిరణ్‌ పేర్కొన్నారు.

వృత్తి, వ్యక్తిగత నైపుణ్యాలు పెంచాలి

విద్యలో మనవాళ్లు బాగా ఆరితేరుతున్నా.. మానవ, వృత్తి, వ్యక్తిగత సంబంధాలు, నైపుణ్యాల విషయంలో వెనకబడి ఉన్నారని కిరణ్‌ పేర్కొన్నారు. ‘ప్రపంచంలో నెగ్గుకురావడం, పది మందితో కలిసి జీవించడం అనేవే పాఠ్యాంశాలు, బోధనాంశాలుగా చెప్పాల్సిన అగత్యం ఏర్పడుతోంది. న్యూక్లియర్‌ కుటుంబాల వల్ల వీటిని నేర్పించడానికి పెద్దవాళ్లు ఎవరూ ఉండడం లేదు. అందుకే నాన్న పేరుతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏఎన్నార్‌ కళాశాల కమిటీ సహకారంతో అభివృద్ధి చేయాలని మా కుటుంబం అంతా నిర్ణయించుకున్నాం. ఎలా చేయాలో ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తాం. దీన్ని ప్రారంభించేందుకు కుటుంబం తరఫున రూ.50 లక్షల విరాళం అందించాలి అనుకుంటున్నామ’ని వెల్లడించారు. కళాశాల వందేళ్ల వేడుకకు కూడా అందరం కలిసే అవకాశం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 06:27 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు.
  • రాంబిల్లిలో మెగా ఔషధ కంపెనీ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో మెగా ఔషధ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు సాగుతున్నాయి.
  • విలేజ్‌ టు విరాట్‌ మీరు క్రికెట్‌ బాగా ఆడతారా..? మీ ప్రతిభకు తగిన గుర్తింపు, వేదిక కోసం చూస్తున్నారా..? అయితే.. మీ కోసమే ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ‘విలేజ్‌ టు విరాట్‌’ ట్యాగ్‌తో ‘రూరల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ప్రోగ్రాం’కు రూపకల్పన చేస్తోంది.
  • ‘ఆరెంజ్‌ ఎకానమీ’ అభివృద్ధికి త్వరలో వర్క్‌షాపులు సాంస్కృతిక, పర్యాటక, ఫిల్మ్‌ టూరిజం విభాగాల్ని సమన్వయం చేస్తూ ‘ఆరెంజ్‌ ఎకానమీ’ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. ఇందుకోసం జూన్‌ లేదా జులై నెలల్లో ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహిస్తామని తెలిపారు.
  • పర్యాటకానికి ‘స్వర్ణ’ కళ! వైకాపా హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర పర్యాటక రంగం తిరిగి గాడిలో పడుతోంది. కూటమి ప్రభుత్వం దానికి పారిశ్రామిక హోదా కల్పించి ప్రోత్సాహకాలు ప్రకటించడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులొస్తున్నాయి.
  • వైద్యులకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు ‘వైద్యరంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులు తెస్తోంది. వ్యాధుల నిర్ధారణ, ఆరోగ్య సేవల్లో క్లిష్ట సమస్యలకు ఏఐ టూల్స్‌ పరిష్కారాలు చూపిస్తున్నాయి.
  • వైభవంగా నూకతాత జాతర అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో మంగళవారం నూకతాత జాతర వైభవంగా సాగింది. నూకతాత ప్రతిమకు పూజారులు, భక్తులు బోయపాడు తీరంలో ఉదయం స్నానం చేయించి పూజలు నిర్వహించారు.
  • నందీశ్వరుడిపై సర్వాంతర్యామి సర్వాంతర్యామి అయిన సోమస్కందమూర్తి ఆయనకు ప్రియమైన నందీశ్వరుడిపై, జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు కామధేనువుపై కొలువుదీరి శ్రీకాళహస్తి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
  • శ్రీశైలంలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పూర్ణాహుతి, చండీశ్వరునికి అవబృధ స్నానం, వసంతోత్సవ క్రతువులు ఘనంగా నిర్వహించారు.
  • తుది దశలో మూలపేట పోర్టు నిర్మాణం ఉత్తరాంధ్రకు గేమ్‌ ఛేంజర్‌గా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణ పనులు 75 శాతం మేర పూర్తయినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
  • 12వ పీఆర్సీ ప్రకటించకపోతే ‘చలో సచివాలయం’ వేతన సవరణ కోసం 12వ పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించి, ఐఆర్‌ను 29 శాతం ప్రకటించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కె.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.
  • అమరావతిలో క్యాట్‌ శాశ్వత బెంచ్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అమరావతిలో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ సర్క్యూట్‌(క్యాట్‌) శాశ్వత బెంచ్‌ ఏర్పాటుకు భూ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని ఆ సంస్థ తెలిపింది.
  • బిల్‌గేట్స్‌ పర్యటన.. సీఎం విజన్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు గేట్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ అమరావతి పర్యటన.. సీఎం చంద్రబాబు విజన్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
  • 21 రోజుల్లో జనన మరణాల నమోదు తప్పనిసరి రాష్ట్రంలో జనన మరణాల నమోదుకు కొత్త నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 21 రోజుల్లో నమోదు తప్పనిసరి చేసింది.
  • అమర్‌నాథ్‌ బృందాన్ని కలవని అంబటి! రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు తమ పార్టీకే చెందిన కొందరు నేతలను ములాఖత్‌లో కలిసేందుకు ఇష్టపడలేదు.
  • ఏపీలో వేగవంతమైన అభివృద్ధి ‘ఎక్స్‌’లో బిల్‌గేట్స్‌ ఏఐ, సాంకేతికతను ఉపయోగించుకుని వ్యవసాయం, విద్య, ఆరోగ్యరంగాల్లో ఆవిష్కరణలతో ఆంధ్రప్రదేశ్‌ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని గేట్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు.
  • మూలుగ మార్పిడి చికిత్స ఎప్పటికి వస్తుంది? రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో మూలుగ (బోన్‌మారో) మార్పిడి చికిత్స అందుబాటులో లేకపోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది.
  • అసెంబ్లీలో పని చేయని మైక్‌ సిస్టమ్‌ అసెంబ్లీలో మంగళవారం మైక్‌ సిస్టమ్‌ మొరాయించింది. శాసనసభలో ఉదయం 9 గంటలకు సమావేశాన్ని ప్రారంభించే సమయానికి ముందు సిబ్బంది పరిశీలించినపుడు మైకులు పని చేయడం లేదని గుర్తించారు. సాంకేతిక విభాగం హడావుడిగా సరిచేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు.
  • ప్రాజెక్టు కొట్టుకుపోయినా పట్టించుకోని జగన్‌ మామిడి రైతులకు కష్టం వస్తే స్థిరీకరణ నిధి ద్వారా నిధులు కేటాయించి ఆదుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెదేపా ఎమ్మెల్యే కె.మురళీమోహన్‌ పేర్కొన్నారు. అందులో పూతలపట్టు నియోజకవర్గానికి అధిక మొత్తం నిధులు దక్కాయని చెప్పారు.
  • వైకాపా పాలనలో ఇష్టారీతిన విద్యుత్తు రాయితీ విధానం వైకాపా హయాంలో ఆక్వా రంగంలో విద్యుత్తు రాయితీని ఇష్టానుసారంగా ఒక్కో రైతుకు ఒక్కో విధంగా అమలు చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైకాపా సర్కారు దుర్మార్గాలను సరిచేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

English Translation

ANNR College.. should grow as a university

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 19 Dec 2025 06:44 IST Ee Font size
  • A
  • A+
  • A++
5 min read

Today, Amaravati, Today Digital- Machilipatnam, Newstoday, Gudivada: Former Vice President wants Akkineni Nageswara Rao College, which has trained many, to become a university. M. Venkaiah Naidu wished. It is suggested that everyone who grew up from here should contribute to provide necessary infrastructure facilities and a good environment. On Thursday, Venkaiah Naidu participated as the guest of honor in the closing ceremony of the Vajrotsavala organized on the occasion of 75 years of the establishment of ANNR College in Gudivada. A postal stamp was released to mark the Diamond Jubilee. Later speaking, he reminded that the establishment of the college here in the 1950s by the initiative of the local elders, and later Akkineni Nageswara Rao's financial support, became a boon to the students. There should be radical changes in the current education system. We are in the age of AI. We all have to adapt to technology. Today's generation can excel in the competitive world only by improving their skills. Venkaiah Naidu explained that the central government is creating a new education system to increase knowledge and culture along with employability skills. Teachers should adopt modern changes in teaching and prepare students. He advised the youth to take inspiration from people like Ramoji Rao who studied in this college and rose to high positions.

Nyasome facts as a former student union leader of this college. want to say Presently the condition of the education sector is not good. Governments are spending thousands of crores of rupees on the education sector, but the results are not getting to the students. Instead of taking up permanent appointments of teachers and lecturers, they are pushing with neighboring services, contract and guest faculties. They do not have the opportunity to work with commitment due to lack of job security. Going to AU Law College recently, there is only one permanent staff member. All the rest are guest faculty and outsourced staff. Actually there are 25 permanent posts. Student union elections should be held in educational institutions. If leadership qualities are developed in them, they can contribute to the society. Recently, the government organized a mock assembly. More than anything like this, student union elections help the leaders grow naturally. If there are problems in this, we have to solve them, but we can't stop traveling because of an accident, can't we?

Over 75years, thousands of people have come out of ANR College. We should focus on what to do in the next 25 years. Only then can we get double the results than before. Outdated courses should be replaced with new ones to suit modern conditions. That effort is being done under the auspices of the college committee.

Entrepreneurial spirit is very high among Bharatiyas, mainly Telugu people, in any district of Telugu states. CH Kiran, CMD of Ramoji Group of Companies stated that this initiative will be seen. He participated virtually in the closing program of ANNR College's Vajrotsavam. The Diamond Jubilee Souvenir of the College was unveiled. Later, Kiran said that in the past, elders were very foresighted and many people donated land to ensure that quality education was available to future generations. He donated heavily to Gudivada Government College, Vijayawada Loyola and many colleges in Guntur. It is with their cooperation that we have been able to achieve a lot of progress in education today. It is a feeling to connect with the institution where we have studied. But, recalling the association with the institution where the parents studied is a different level of feeling. I wanted to come to this college where my father Ramoji Rao studied and see the whole thing again. Kiran stated that he will definitely come and see in the future.

Professional and personal skills should be increased

Although our children are doing well in education, they are lagging behind in terms of human, professional, personal relationships and skills. There is a need to make it a point of study and teaching to get ahead in the world and live with ten people. Because of nuclear families there are no adults to teach them. That is why our entire family decided to develop a skill development center in the name of my father with the cooperation of ANNR College Committee. Let's proceed according to a plan on how to do it. It has been revealed that we want to donate Rs. 50 lakh on behalf of the family to start this. He said he is praying to God to give everyone a chance to meet for the centenary celebration of the college.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 06:27 IST

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Family members should be clear about values and policies. Margadarshi Chitfunds MD Shailaja Kiran said that when all the family members have a clear understanding of the values and procedures to be followed in the construction of business enterprises, family businesses can survive for a long time. Preparations are underway for setting up a mega pharmaceutical manufacturing industry in Rambilli mandal of Anakapalli district.
  • Village to Virat Do you play cricket well? Are you looking for a platform and recognition for your talent? But.. It is for you that Andhra Cricket Association (ACA) is designing a 'Rural Talent Search Programme' with the tag 'Village to Virat'.
  • Workshops for the development of 'Orange Economy' will be held soon. Kandula Durgesh, Minister of Culture, Tourism and Film Tourism, said that the aim of the government is to develop 'Orange Economy' by coordinating the departments of culture, tourism and film tourism. He said that special workshops will be held in June or July for this purpose.
  • 'Golden' art for tourism! The state's tourism sector, which was neglected during Vaikapa's regime, is back in the groove. With the alliance government giving it industrial status and announcing incentives, large scale investments are being made.
  • AI is not a substitute for doctors. Artificial intelligence is revolutionizing the field of medicine. AI tools are showing solutions to difficult problems in disease diagnosis and health services. On Tuesday, Nukatatha fair was held in Rajayyapet of Nakkapalli mandal of Anakapalli district. The priests and devotees bathed in the morning at Boyapadu beach and performed puja to the image of Nukatatha. Sarvantyami Somaskandamurthy appeared to the devotees on his beloved Nandishvara and Gnanaprasunambika on Kamadhenu while strolling through the streets of Srikalahasti in Koluvudiri. As part of the Mahashivratri Brahmotsavam in Srisaila Mahakshetra, Poornahuti, Avabrdha bathing and Vasantotsava rituals of Chandiswara were held on Tuesday. As a game changer for Uttarandhra, the greenfield port being constructed at Moolpet of Santabommali mandal of Srikakulam district is going on actively. The construction company announced that 75 percent of the construction work has been completed. UTF state president and general secretaries N.Venkateshwarlu and K.S.N.Prasad demanded that the 12th PRC commission be appointed immediately for wage revision and declare the IR as 29 percent. The organization said that the state government has already started the process of land allotment for setting up a permanent bench of the Central Administrative Tribunal Circuit (CAT) in Amaravati.
  • Bill Gates' visit.. Global recognition of CM vision Gates Foundation Chairman Bill Gates's visit to Amaravati..Tedpa State President Palla Srinivasa Rao said that CM Chandrababu's vision is a world class recognition.
  • Registration of births and deaths within 21 days is mandatory The government has brought new rules for registration of births and deaths in the state. Registration is mandatory within 21 days.
  • Ambati who did not meet Amarnath team! Former minister and Vikapa leader Ambati Rambabu, who is a remand prisoner in Rajamahendravaram Central Jail, did not want to meet some leaders of his own party in Mulakat. Gates Foundation Chairman Bill Gates said that Andhra Pradesh is developing rapidly with innovations in agriculture, education and health sectors using AI and technology.
  • When will transplant therapy come? The High Court objected to non-availability of bone marrow transplant treatment in government hospitals and medical colleges in the state.
  • Non-functioning mic system in assembly. The mic system blared in the assembly on Tuesday. When the staff checked before the session started at 9 am in the Legislative Assembly, they found that the microphones were not working. The technical department hastily tried to fix it but to no avail. TDEPA MLA K. Murali Mohan said that Chandrababu should be credited with allocating funds through the stabilization fund when mango farmers face difficulties. He said that Puthalapattu Constituency got the highest amount of funds. Sarvepalli MLA Somireddy Chandramohan Reddy said that during the Vaikapa regime, electricity subsidy was implemented in the aqua sector according to the will of each farmer. Vaikapa stated that it is necessary to correct the wrongdoings of the government.