Ongole: బతికుండగానే.. తల్లి మృతి చెందినట్లు తప్పుడు ధ్రువీకరణ

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 22 Dec 2025 20:39 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఆమె పేరిట ఉన్న ఆస్తిని విక్రయించిన కుమారుడు 
రిజిస్ట్రేషన్‌ రద్దు చేయించిన ఒంగోలు ఆర్డీవో 

ఒంగోలు కలెక్టరేట్: కన్న తల్లి బతికున్నా మృతి చెందినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఆమె పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని కుమారుడు ఇతరులకు విక్రయించగా.. ఆర్డీవో విచారించి ఆ తల్లికి న్యాయం చేసిన సంఘటన ఇది. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం కొమ్మవరం గ్రామానికి చెందిన విప్పల రమాదేవి(83)కి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. తన పోషణ గురించి కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో గుంటూరులోని వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ఆమెకు తన భర్త రిజిస్ట్రార్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా 1995లో స్వగ్రామంలోనే సర్వే నం.155/1లో 1.96 ఎకరాల వ్యవసాయ భూమి వచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులు వెబ్‌ల్యాండ్‌లో ఆమె పేరిట నమోదు చేశారు. ఆ తర్వాత ఆమె కుమారుడు వేణుగోపాల్‌రెడ్డి భూమిని అక్రమంగా పొందాలన్న ఉద్దేశంతో రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తల్లి మృతి చెందినట్లు ధ్రువీకరణ పత్రం సృష్టించి సదరు భూమిని ఆయన పేరు మీద మార్చుకున్నాడు. అనంతరం ఆ భూమిని 2024లో సోము చిననాగిరెడ్డి అనే వ్యక్తికి విక్రయించాడు. దీనిపై బాధితురాలు రమాదేవి ఇటీవల ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్నకు ఫిర్యాదు చేశారు.

ఇరుపార్టీలకు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టగా ఇరువురూ వాస్తవాన్ని అంగీకరించడంతో విక్రయ దస్తావేజును రద్దు చేయాలని దర్శి సబ్‌ రిజిస్ట్రార్‌కు ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతోపాటు వెబ్‌ల్యాండ్‌లో రమాదేవి పేరు తిరిగి నమోదు చేయాలని ఆర్డీవో ఆదేశించారు. సీనియర్‌ సిటిజన్‌ చట్ట ప్రకారం సంరక్షణ నిమిత్తం ప్రతి నెలా రూ.15 వేలను కుమారుడు ఆమెకు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భూమి అక్రమ విక్రయానికి సంబంధించి అప్పట్లో సహకరించిన తహసీల్దార్, వీఆర్వోలపై చర్యలతోపాటు రమాదేవి బతికి ఉండగానే మరణించినట్లు ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేసిన రెవెన్యూ అధికారులపై చర్యల నిమిత్తం కలెక్టర్‌కు నివేదించనున్నట్లు ఆర్డీవో లక్ష్మీప్రసన్న తెలిపారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • తెలుగు రాష్ట్రాల్లో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
  • ఫ్లైట్ టికెట్టూ నాదే.. మ్యాచ్ టికెట్టూ నాదే: మంత్రి లోకేశ్‌ కౌంటర్‌ ఇటీవల కొలంబోలో జరిగిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను తన సొంత ఖర్చుతో వెళ్లి వీక్షించానని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) స్పష్టం చేశారు.
  • విశాఖలో ఐఎన్‌ఎస్‌ సుమేధపై ప్రయాణించిన రాష్ట్రపతి, సీఎం విశాఖపట్నం: విశాఖ తీరంలో ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌) కొనసాగుతోంది. ఆరు వరుసల్లో 71 యుద్ధ నౌకలు పరేడ్‌ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పాల్గొని ఐఎన్‌ఎస్‌ సుమేధపై ప్రయాణించారు. నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, కోస్ట్‌గార్డ్, మర్చంట్‌ నేవీ, పరిశోధన నౌకలు 7 ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొన్నాయి.
  • విశాఖలో ఐఎన్‌ఎస్‌ సుమేధపై ప్రయాణించిన రాష్ట్రపతి, సీఎం విశాఖ తీరంలో ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌) కొనసాగుతోంది. ఆరు వరుసల్లో 71 యుద్ధ నౌకలు పరేడ్‌ నిర్వహించాయి.
  • బాలికపై హత్యాచారం.. చెరువులో నిందితుడు కులవర్ధన్‌ మృతదేహం అన్నమయ్య జిల్లా కనసానివారిపల్లె చెరువులో యువకుడి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది.
  • విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు.
  • రాంబిల్లిలో మెగా ఔషధ కంపెనీ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో మెగా ఔషధ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు సాగుతున్నాయి.
  • విలేజ్‌ టు విరాట్‌ మీరు క్రికెట్‌ బాగా ఆడతారా..? మీ ప్రతిభకు తగిన గుర్తింపు, వేదిక కోసం చూస్తున్నారా..? అయితే.. మీ కోసమే ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ‘విలేజ్‌ టు విరాట్‌’ ట్యాగ్‌తో ‘రూరల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ప్రోగ్రాం’కు రూపకల్పన చేస్తోంది.
  • ‘ఆరెంజ్‌ ఎకానమీ’ అభివృద్ధికి త్వరలో వర్క్‌షాపులు సాంస్కృతిక, పర్యాటక, ఫిల్మ్‌ టూరిజం విభాగాల్ని సమన్వయం చేస్తూ ‘ఆరెంజ్‌ ఎకానమీ’ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. ఇందుకోసం జూన్‌ లేదా జులై నెలల్లో ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహిస్తామని తెలిపారు.
  • పర్యాటకానికి ‘స్వర్ణ’ కళ! వైకాపా హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర పర్యాటక రంగం తిరిగి గాడిలో పడుతోంది. కూటమి ప్రభుత్వం దానికి పారిశ్రామిక హోదా కల్పించి ప్రోత్సాహకాలు ప్రకటించడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులొస్తున్నాయి.
  • వైద్యులకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు ‘వైద్యరంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులు తెస్తోంది. వ్యాధుల నిర్ధారణ, ఆరోగ్య సేవల్లో క్లిష్ట సమస్యలకు ఏఐ టూల్స్‌ పరిష్కారాలు చూపిస్తున్నాయి.
  • వైభవంగా నూకతాత జాతర అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో మంగళవారం నూకతాత జాతర వైభవంగా సాగింది. నూకతాత ప్రతిమకు పూజారులు, భక్తులు బోయపాడు తీరంలో ఉదయం స్నానం చేయించి పూజలు నిర్వహించారు.
  • నందీశ్వరుడిపై సర్వాంతర్యామి సర్వాంతర్యామి అయిన సోమస్కందమూర్తి ఆయనకు ప్రియమైన నందీశ్వరుడిపై, జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు కామధేనువుపై కొలువుదీరి శ్రీకాళహస్తి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
  • శ్రీశైలంలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పూర్ణాహుతి, చండీశ్వరునికి అవబృధ స్నానం, వసంతోత్సవ క్రతువులు ఘనంగా నిర్వహించారు.
  • తుది దశలో మూలపేట పోర్టు నిర్మాణం ఉత్తరాంధ్రకు గేమ్‌ ఛేంజర్‌గా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణ పనులు 75 శాతం మేర పూర్తయినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
  • 12వ పీఆర్సీ ప్రకటించకపోతే ‘చలో సచివాలయం’ వేతన సవరణ కోసం 12వ పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించి, ఐఆర్‌ను 29 శాతం ప్రకటించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కె.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.
  • అమరావతిలో క్యాట్‌ శాశ్వత బెంచ్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అమరావతిలో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ సర్క్యూట్‌(క్యాట్‌) శాశ్వత బెంచ్‌ ఏర్పాటుకు భూ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని ఆ సంస్థ తెలిపింది.
  • బిల్‌గేట్స్‌ పర్యటన.. సీఎం విజన్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు గేట్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ అమరావతి పర్యటన.. సీఎం చంద్రబాబు విజన్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
  • 21 రోజుల్లో జనన మరణాల నమోదు తప్పనిసరి రాష్ట్రంలో జనన మరణాల నమోదుకు కొత్త నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 21 రోజుల్లో నమోదు తప్పనిసరి చేసింది.
  • అమర్‌నాథ్‌ బృందాన్ని కలవని అంబటి! రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు తమ పార్టీకే చెందిన కొందరు నేతలను ములాఖత్‌లో కలిసేందుకు ఇష్టపడలేదు.