Pawan Kalyan NTR: పవన్‌ కల్యాణ్‌, ఎన్టీఆర్‌ పిటిషన్లు.. దిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

Eenadu icon
By Entertainment Team Published : 23 Dec 2025 00:07 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

దిల్లీ: సామాజిక మాధ్యమాలు, వాణిజ్య వెబ్‌సైట్‌లలో చేస్తున్న పోస్టుల కారణంగా దెబ్బతింటున్న తమ వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతూ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ( Pawan Kalyan), మరో నటుడు ఎన్టీఆర్‌ ( NTR) వేర్వేరుగా దిల్లీ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్‌ మన్‌ప్రీత్‌ ప్రీతమ్‌ సింగ్‌ అరోడా ఈ పిటిషన్లపై సోమవారం విచారణ జరిపారు. పవన్‌ కల్యాణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫొటోగ్రాఫ్‌లు, వీడియోలు, పేర్లను వాణిజ్య అవసరాలు, తప్పుడు ప్రచారం కోసం సామాజిక మాధ్యమాల్లో దుర్వినియోగం చేస్తున్నందున వాటిని అడ్డుకోవాలని వారి తరఫున వాదనలు వినిపించిన సాయి దీపక్‌ న్యాయమూర్తిని కోరారు. పలు సామాజిక మాధ్యమ పోస్టుల్లో తప్పుడు సమాచారం, మార్ఫింగ్‌ చేసిన ఫొటోలు, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల ఫ్లిప్‌క్టార్, అమెజాన్, ఎక్స్, గూగుల్‌ వేదికల్లో ఉన్న ఇలాంటి పోస్టులను తొలగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

  • ఆ సినిమాలకు మరింత సహకారం.. ఉగాది నాటికి నంది అవార్డులు: మంత్రి కందుల దుర్గేష్‌

దీనిపై ప్రతివాదుల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. కోర్టు ఇది వరకు జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి ఇప్పటికే వివాదాస్పద లింక్‌లు తొలగించినట్లు ధర్మాసనానికి తెలిపారు. అయితే ఇదే సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. ఏదైనా లింక్‌లను తొలగించాలని ఆదేశాలిచ్చేటప్పుడు వాటిని పోస్ట్‌ చేసిన వినియోగదారుల వాదనలూ వినాల్సి ఉంటుందన్నారు. అభిమానులు చేసిన పోస్ట్‌లపై ఇన్‌స్టాగ్రామ్‌ స్పష్టంగా డిస్‌క్లైమర్‌ అని ముద్రించాలని సూచించారు. అలాగే సెలెబ్రిటీల వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తే జరిగే పరిణామాల గురించి గూగుల్‌ తమ వినియోగదారులకు చెప్పాలని, ఆ తర్వాత కూడా ఎవరైనా అలా నడుచుకుంటే వారి ఖాతాలను సస్పెండ్‌ చేయాలని న్యాయమూర్తి నిర్దేశించారు. ప్రస్తుత పిటిషన్లలో పేర్కొన్న వివాదాస్పద పోస్టులకు సంబంధించిన ఐపీ లాగిన్‌ వివరాలను మూడు వారాల్లో సమర్పించాలని ప్రతి వాదులకు ఆదేశించారు. తదుపరి విచారణను మే 12కి వాయిదా వేశారు.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • దోషులను అయ్యప్పస్వామి వదలి పెట్టడు: నటుడు జయరాం శబరిమల బంగారు తాపడాల అదృశ్యం కేసులో (Sabarimala gold theft case) నిజాన్ని బయటకు తీసుకురావడానికి అధికారులకు తాను అన్ని విధాలా సహకరిస్తున్నానని సినీ నటుడు జయరాం (Jayaram) అన్నారు.
  • ‘లైకా’ కేసు.. విశాల్ పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్‌ హైకోర్టు ప్రముఖ నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్షన్స్‌’కు సంబంధించిన కేసులో ఉత్తర్వులను పాటించేందుకు గడువు కోరుతూ నటుడు విశాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
  • సర్‌ప్రైజ్‌.. 2026లో నెట్‌ఫ్లిక్స్‌లో అలరించే సినిమాలు/సిరీస్‌లివే! 2026లో వరుస చిత్రాలతో అలరించేందుకు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ సిద్ధమైంది.
  • 24 ఏళ్లుగా నరకం.. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా కానీ..: ప్రత్యూష తల్లి తన కుమార్తె, నటి ప్రత్యూష (Prathyusha) మృతి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై సరోజినీదేవి (Prathyusha Mother) స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నానని, కానీ తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని అన్నారు.
  • మరో చీకటి కోణం.. ‘ది కేరళ స్టోరీ2’ ట్రైలర్‌ చూశారా? న్నో వివాదాలు, విమర్శల మధ్య విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను సొంతం చేసుకుంది ‘ది కేరళ స్టోరీ’. ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌గా ‘ది కేరళ స్టోరీ 2’ రాబోతోంది.
  • అకౌంట్‌లో రూ.లక్ష చూస్తే చాలనుకున్నా..: విశ్వక్‌ సేన్‌ ఒకప్పుడు తన అకౌంట్‌లో రూ.50వేలు చూడటం కల అని విశ్వక్‌ సేన్‌ అన్నారు. ‘హిట్‌’ సినిమాకు అడ్వాన్స్‌ బ్యాంక్‌లో పడే వరకూ తన అకౌంట్‌లో అంత డబ్బు ఎప్పుడూ చూడలేదని గుర్తుచేసుకున్నారు.
  • అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 రూల్స్.. క్షమాపణలు చెప్పిన కావేరి స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ను (Allu Arjun) కలవాలంటే 42 నిబంధనలు తప్పకుండా పాటించాలంటూ బ్రాండ్‌ స్ట్రాటజర్‌ కావేరి బరూవా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.
  • 4 ఏళ్లలో 12 సినిమాలు.. కెరీర్‌ పీక్‌లో ‘సూసైడ్‌’: నటి ప్రత్యూష కథ ఇది..! Actress Prathyusha: గ్లామర్‌ వెలుగుల సినీ ప్రపంచంలో తెర వెనుక చీకటి రహస్యాలెన్నో..!  స్క్రీన్ మీద నవ్వులు చిందిస్తూ అభిమానులను అలరించే నటీనటుల జీవితాల్లో.. ఎవరికీ తెలియని విషాదగాథలు దాగి ఉంటాయి.
  • మేకప్‌ వేసుకుని ఐదు గంటలకే బీచ్‌కు వెళ్తే.. తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన చిత్రాలను అందించి ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటులు ఎన్టీఆర్‌ (NTR), ఏయన్నార్‌ (ANR). ఇరువురు తమదైన నటనతో అన్ని జానర్‌ల సినిమాల్లోనూ నటించి
  • చిక్కుల్లో ‘ధురంధర్ 2’.. అక్కడ షూటింగ్‌పై బ్యాన్‌! ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘ధురంధర్‌ 2’ చిక్కుల్లో పడింది.
  • నటి ప్రత్యూష మృతి కేసు.. సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలి: సుప్రీం Actress Prathyusha Case: రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. సినీ నటి ప్రత్యూష్‌ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని ఆదేశించింది.
  • విడుదలకు ముందు ‘పేరు’ మార్పు.. మేకర్స్‌ నిట్టూర్పు! సినిమా పేరు మార్పు ఇటీవల ఎక్కువగా కనిపిస్తోంది. ఆ చిత్రాల వివరాలివీ..
  • ఆ పాటలు వాడొద్దు.. ఇళయరాజాకు దిల్లీ హైకోర్టు ఆదేశాలు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా చట్టపరమైన ఇబ్బందుల్లో పడ్డారు.
  • నేనూ వాళ్ల బాటలోనే...! సుహాస్‌ - శివానీ నాగారం జంటగా నటించిన ‘హే భగవాన్‌’ చిత్రం పేరు మార్చుకుంది. సెన్సార్‌ బోర్డు సూచనల మేరకు ఈ టైటిల్‌ని ‘హే బల్‌వంత్‌’గా మార్చినట్లు చిత్ర బృందం ప్రకటించింది.
  • అట్లూరి జీవితం నేటి తరానికో పాఠం కష్టేఫలి అనే సూత్రానికి ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు నిలువెత్తు నిదర్శనమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
  • ఏఐ.. నిశ్శబ్దంగా సినిమా భాషని తిరగరాస్తోంది చిత్రపరిశ్రమలో తదుపరి పెద్ద విభజన.. ఏఐ(కృత్రిమ మేధ)ని స్వీకరించేవారికి, వ్యతిరేకించేవారికి మధ్య ఉండదని, ఆ సాధనాలతో మేధో సంపత్తిని నిర్మించేవారికి, వాటిని ఉపయోగించేవారికి మధ్య ఉంటుందని అంటున్నారు హీరో రానా.
  • ఓటీటీలో ఈ వారం కొత్త వారం మొదలైంది.. వినోదాల జాతరకి కూడా సమయం ఆసన్నమైంది. అదేనండీ.. ఓటీటీలో వచ్చే కొత్త కథల గురించే ఇదంతా. ఎప్పటిలాగే ఈ వారం కూడా నాన్‌స్టాప్‌గా ఎంటర్‌టైన్‌ చేయడానికి వైవిధ్యమైన సిరీస్‌లు, సినిమాల్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి ఓటీటీలు. 
  • సూపర్‌ డీలక్స్‌ తర్వాత పాకెట్‌ నావెల్‌ నలుగురు వ్యక్తుల జీవితాల్లోని సంఘటనలతో రూపొంది ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న చిత్రం ‘సూపర్‌ డీలక్స్‌’. విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి, దర్శకుడు త్యాగరాజన్‌ కుమార రాజా కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రమిది.
  • కథ ఇంకా పూర్తి కాలేదు ‘దల్దాల్‌’ సిరీస్‌లో డీసీపీ రీటా ఫెరీరా పాత్రలో కనిపించి నిందితుల్ని పరుగులు పెట్టించింది బాలీవుడ్‌ కథానాయిక భూమి పెడ్నేకర్‌. అమ్రిత్‌ రాజ్‌ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు సురేశ్‌ త్రివేణి సృష్టికర్త.
  • ‘జై హనుమాన్‌’ సన్నాహాలు ‘హను-మాన్‌’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ఇప్పుడాయన ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.