కత్తితో దాడి.. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన సీఐ

- A
- A+
- A++

కమలానగర్: అనంతపురంలో సీఐపై కత్తితో దాడి చేసిన దేవరకొండ అజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి మద్యం మత్తులో నిందితుడు అజయ్.. రాజా అనే యువకుడిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో సోమవారం ఉదయం ఆకుతోటపల్లి సమీపంలో ఇద్దరు కానిస్టేబుళ్లు ఆటో డ్రైవర్‌తో కలిసి నిందితుడు అజయ్‌ను పట్టుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అతడు పోలీసులపైనా దాడికి తెగబడ్డాడు. పోలీసులు తప్పించుకోగా ఆటో డ్రైవర్ బాబాకు గాయాలయ్యాయి. దీంతో రెండో పట్టణ సీఐ శ్రీకాంత్ నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లగా..అతడిపైనా నిందితుడు దాడి చేశాడు. దీంతో సీఐ ఎడమ భుజంపై గాయమైంది. ఈ క్రమంలో నిందితుడి మోకాలిపై సీఐ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆత్మరక్షణలో భాగంగానే కాల్పులు జరపాల్సి వచ్చిందని సీఐ శ్రీకాంత్ వివరించారు. ప్రస్తుతం అనంతపురంలోని ప్రభుత్వాసుపత్రిలో వీరంతా చికిత్స పొందుతున్నారు.
► Read latest Anantapur Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.