వాహనాలు తుప్పు పడుతున్నాయి ఇలా..

Eenadu icon
By Telangana Dist. Team Published : 22 Dec 2025 20:07 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఏదులాపురం : ఆదిలాబాద్‌ జిల్లాలో కలపను అక్రమ రవాణా చేస్తూ పదుల సంఖ్యలో వాహనాలు పట్టుబడ్డాయి. జిల్లా అటవీ కార్యాలయంలో ఏళ్ల తరబడిగా ఉన్న ఆ వాహనాలు తుప్పు పట్టి ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. డీఎఫ్ఏ కార్యాలయం పక్కన ఉన్న మైదానంలో ఇలాంటి వాహనాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. వీటితో పాటు కొన్ని పాతబడిన ప్రభుత్వ వాహనాలను సైతం అక్కడే వదిలేశారు. స్వాధీనం చేసుకున్న పాత వాహనాలకు సంబంధించిన కేసులను పరిష్కరించి వాటిని వేలం వేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

► Read latest Adilabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని