
Sabarmati: సబర్మతి అప్పుడో లెక్క.. ఇప్పుడో లెక్క!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

నాడు:గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సబర్మతి నది ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురై, అడుగడుగునా ఆక్రమణలు, వ్యర్థాలతో అధ్వాన స్థితిలో కనిపించేది. పారిశ్రామిక వ్యర్థాలు భారీగా కలిసిపోయి తీవ్ర ఆరోగ్య, పర్యావరణ సమస్యలు ఉత్పన్నమయ్యేవి. వరదల కారణంగా నది కట్టలు కోతకు గురయ్యేవి.
నేడు:స్వచ్ఛమైన నదీతీరం, రెండు వైపులా పటిష్ఠ వరద రక్షణ గోడలు, గట్ల వెంబడి పరచుకున్న పచ్చదనం, అనేకచోట్ల జలసిరుల సోయగాలు, నదీతీరం వెంబడి సందడి చేసే వలస పక్షులు.. విద్యుత్తు దీపాల వెలుగుల్లో ఆకట్టుకొనే అటల్ వంతెన ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలున్నాయి.
అధ్వానం నుంచి ఆహ్లాదంగా..
అధ్వాన స్థితి నుంచి అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దడానికి అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాతికేళ్లుగా చేసిన కృషి కనిపిస్తోంది. సబర్మతి నది పునరుజ్జీవానికి కంకణం కట్టుకున్న అధికారులు 1997లో నదీ ముఖద్వార అభివృద్ధి సంస్థ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్ నగరం మధ్యలోంచి వెళుతున్న నదీ తీరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. రెండువైపులా గట్ల పరిరక్షణపై తొలుత దృష్టి పెట్టారు. 10 మీటర్ల కంటే ఎక్కువ లోతులో నదీగర్భంలో డయాఫ్రమ్ గోడలు నిర్మించారు. ఆకస్మిక వరదల నుంచి లోతట్టు ప్రాంతాలను రక్షించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. నది ప్రవాహ మార్గానికి అనుగుణంగా 263 మీటర్ల వెడల్పుతో విస్తరించారు. ఈ ప్రయత్నం వల్ల నగరంలోకి వరద వెళ్లకుండా అడ్డుకట్ట పడింది. నదిలో 4.75 లక్షల క్యూసెక్కుల నీరు కిందికి ప్రవహించేలా దోహదపడింది.
పక్కాగా మురుగునీటి మళ్లింపు
మురుగునీరు నదిలోకి రాకుండా కట్టడి చేయడం, పారిశ్రామిక వ్యర్థాలు సబర్మతిలో పడకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. మురుగునీరు ప్రవహించే కాలువలను నదికి రెండు వైపులా ఉన్న కాలువలకు అనుసంధానం చేసి 38 పాయింట్లలో మురుగునీటిని సేకరించి వాస్నా బ్యారేజీకి దక్షిణంగా ఏర్పాటు చేసిన మురుగునీటి శుద్ధి ప్లాంట్లకు తరలిస్తున్నారు. సబర్మతి నది వర్షాకాలంలోనే ప్రవహిస్తుంది. ఏడాది పొడవునా నదిలో నీటిని పారించటానికీ ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందించారు. వాస్నా బ్యారేజీ కట్టి నీరు నిల్వ ఉండేలా చేశారు. అహ్మదాబాద్‌కు దిగువన ఉన్న వాస్నా బ్యారేజ్, నగరంలో నది పొడవునా మొత్తం 15 కిలోమీటర్ల మేర నీరు నిల్వ ఉంటూ జలసిరులతో అలరారుతోంది. నీటినిల్వతో వినోద కార్యకలాపాలకు వీలు కలగడమే కాకుండా, భూగర్భ జలాలు పెరుగుతున్నాయని అక్కడి అధికారులు వివరిస్తున్నారు.
వినోదం.. వలస పక్షుల ఆవాసం
నదిలో చిన్నపాటి వ్యర్థానికీ ఆస్కారం లేకుండా ఫ్లోటింగ్ ట్రాష్ స్కిమ్మర్ మెషిన్ ద్వారా ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నారు. దీంతో ఎటుచూసినా సుందర దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. రెండువైపులా గట్ల వెంబడి విరివిగా మొక్కలు నాటడంతో పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. అక్కడకక్కడా బెంచీలు, వాకింగ్‌ట్రాక్‌లు ఏర్పాటు చేయడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో స్థానికుల రద్దీతో సందడి వాతావరణం నెలకొంటోంది. నదీతీరం నుంచి రోడ్డుకు మధ్యలో 20 మీటర్లకుపైగా వెడల్పు ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్ది, మొక్కలు పెంచి విద్యుత్తు దీపాలతో అలంకరించడంతో రాత్రివేళ అత్యంత సుందరంగా కనిపిస్తోంది. నదిపై నిర్మించిన అటల్ వంతెనపై వివిధ రంగులలో వెలిగే విద్యుత్తు దీపాలు, వంతెన ఆకృతి ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. అనేక రకాల వలస పక్షులకూ ఆవాస ప్రాంతమై జీవ వైవిధ్యానికి నెలవుగా తయారైంది.

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- కొంకణ్ తీర పర్యాటకులకు డాల్ఫిన్ల గుంపు కనువిందు మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా పరిధిలో గల కొంకణ్ తీరంలో పర్యాటకులకు డాల్ఫిన్లు గుంపుగా కనిపించి కనువిందు చేశాయి.
- వైద్యుడి ఫోన్ నంబరు కోసం గూగుల్‌లో వెదికితే.. ఖాతా ఖాళీ సైబర్ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో ప్రజల ఖాతాలను గుల్ల చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని శహడోల్ జిల్లాలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది.
- ఐఎన్‌ఎస్ కృష్ణ జలప్రవేశం తొలి స్వదేశీ కేడెట్ శిక్షణ నౌక (సీటీఎస్) ఐఎన్‌ఎస్ కృష్ణ జలప్రవేశం చేసినట్టు నేవీ వర్గాలు మంగళవారం తెలిపాయి. చెన్నైలోని కట్టుపల్లి వద్ద లార్సన్ అండ్ టుబ్రో యార్డులో ఈ కార్యక్రమం జరిగినట్లు వెల్లడించాయి.
- కర్ణాటకలో హెలికాప్టర్ అసెంబ్లింగ్ యూనిట్ కర్ణాటకలోని కోలారు జిల్లా వేమగల్‌లో భారత తొలి ప్రైవేటురంగ హెలికాప్టర్ అసెంబ్లింగ్ యూనిట్ ‘ఫైనల్ అసెంబ్లీ లైన్’ (ఎఫ్‌ఏఎల్)ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో కలిసి ముంబయి నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.
- నూరుకోట్లకు బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య దేశంలో బ్రాడ్ బ్యాండ్ వినియోగదారుల సంఖ్య గత పదేళ్లలో ఆరు కోట్ల నుంచి వంద కోట్లకు చేరిందని కేంద్ర కమ్యూనికేషన్లశాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 2014-2025 మధ్యకాలంలో ఈ గొప్ప మైలురాయిని దాటడం సాధ్యమైందని చెప్పారు.
- శ్రీపెరుంబుదూర్‌లో అతిపెద్ద కార్మిక ఆసుపత్రి తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌లో కార్మికుల కోసం దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి నిర్మించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి తంగం తెన్నరసు ప్రకటించారు. 18,720 పడకల ఈ ఆసుపత్రి నిర్మాణానికి రూ.706 కోట్లు కేటాయించారు.
- ఫ్రాన్స్‌తో భాగస్వామ్యం ఇక ప్రత్యేకం తమ మధ్య సంబంధాలను ‘ప్రత్యేక ప్రపంచవ్యాప్త వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచాలని భారత్-ఫ్రాన్స్ నిర్ణయించాయి.
- పిటిషన్లలో ఏఐ వినియోగం ఆందోళనకరం కృత్రిమ మేధ సాధనాల సాయంతో రూపొందించిన పిటిషన్లను న్యాయస్థానాలకు సమర్పించే వైఖరి న్యాయవాదుల్లో ప్రబలడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
- కాంగ్రెస్ మనుగడకు మూలం అసమ్మతే అసమ్మతిని సహించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంటే అది ఆ పార్టీ వినాశనానికే దారి తీస్తుందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు.
- అదో తుగ్లకీయ కమిషన్ ఎన్నికల సంఘం ‘‘తుగ్లకీయ కమిషన్’’లా వ్యవహరిస్తోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఆరోపించారు.
- బెంగాల్, తమిళనాడుల్లో ఏప్రిల్‌లో ఎన్నికలు! నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలను ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అధికారులు మంగళవారం వెల్లడించారు.
- రైళ్ల మరుగుదొడ్లలో జెట్ స్ప్రేలు రైలు బోగీల్లోని మరుగుదొడ్లలో కొళాయి, చైన్‌తో కూడిన స్టీలు మగ్గుల స్థానంలో జెట్ స్ప్రేలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
- ఆసక్తికరమైన ఏఐ ప్రాజెక్టులు ప్రదర్శించిన ఎల్‌పీయూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఇండియా-ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పోలో లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయ (ఎల్‌పీయూ) ప్రాజెక్టులు అందరి మన్ననలు పొందాయని వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
- మాకు పెన్షన్లు వద్దు శ్రీలంక చట్టసభ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పదవీకాలం ముగిశాక పెన్షన్లు తీసుకోరాదని నిర్ణయించారు.
- కె2 విటమిన్‌తో ఎముకలు బలోపేతం డి విటమిన్ క్రియాశీల రూపమైన కాల్సిట్రియోల్‌గా మారేందుకు మెగ్నీషియం చాలా అవసరం.
- గేట్స్ హాజరుపై సందిగ్ధం! ఏఐ సమిట్‌కు బిల్ గేట్స్ హాజరవుతారా లేదా అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఆయన హాజరుకాబోవడం లేదని తొలుత ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
- చదరపు మీటరు ఉష్ణమండల అడవితో ఏటా 240 లీటర్ల వర్షపాతం ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రతి చదరపు మీటరు అడవి వల్ల ఏటా దాదాపు 240 లీటర్ల వర్షపునీరు లభ్యమవుతోందని తాజా అధ్యయనం పేర్కొంది.
- బైకర్‌ను ఢీకొన్న కారు.. వైరల్‌గా మారిన వీడియో దేశరాజధాని దిల్లీలో ఒక మైనర్ బాలుడు(17) తన స్కార్పియో వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి బైక్‌పై ప్రయాణిస్తున్న 23 ఏళ్ల సాహిల్ ధానేశ్ర అనే వ్యక్తి మృతికి కారణమయ్యాడు.
- కేంద్ర మంత్రి పురీ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైళ్ల వ్యవహారంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ వరుసబెట్టి అబద్ధాలాడుతున్నారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండు చేసింది.
- వనవటు దేశమా.. అలాంటిదేదీ లేదే!: సుప్రీం వనవటు అనే దేశమేదీ లేదే అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.