Caning for Scammers: మోసాలకు పాల్పడితే కొరడా దెబ్బలే..!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: మోసపూరిత చర్యలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించేందుకు సింగపూర్ (Singapore) సిద్ధమవుతోంది. స్కామర్లు, వారిని నియమించుకునేవారు, ఆయా ముఠాల్లో ఉన్న వ్యక్తులను శిక్షగా కొరడా దెబ్బలు విధించనుంది. ఇందుకు సంబంధించిన చట్టంలో ఇటీవల మార్పులు చేయగా.. డిసెంబర్ 30 నుంచి ఇది అమల్లోకి రానుంది.
దేశంలో మోసపూరిత కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అరికట్టేందుకు నిబంధనల్లో మార్పులు చేసినట్లు సింగపూర్ హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. స్కామ్‌లను ఎదుర్కోవడం జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశమని, ఇటువంటి కేసులు, వీటివల్ల కలిగే ఆర్థిక నష్టాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని పేర్కొంది. స్కామర్లకు శిక్షగా కనీసం ఆరు కొరడా దెబ్బలు విధించనున్నట్లు తెలిపింది.
సిమ్ కార్డులు సమకూర్చడం లేదా సింగ్‌పాస్ ఐడీ (ప్రభుత్వ సేవలను ఉపయోగించుకునేందుకు సింగపూర్ పౌరులకు ఇచ్చే డిజిటల్ ఐడీ)లను స్కామర్లతో పంచుకునేవారికి 12 కొరడా దెబ్బలు విధించే అవకాశం ఉంది. తీవ్రతను బట్టి ఆయా మోసాలకు పాల్పడే వారికి గరిష్ఠంగా 24 కొరడా దెబ్బలు విధించనున్నట్లు తెలుస్తోంది.
నేరాల నియంత్రణలో భాగంగా క్రిమినల్ చట్టంలో సింగపూర్ ఇటీవల మార్పులు తీసుకొచ్చింది. దీనికి అక్కడి పార్లమెంట్ గత నెల ఆమోదం తెలిపింది. మోసపూరిత కార్యకలాపాలకు సంబంధించి 2020 నుంచి ఈ ఏడాది జూన్ వరకు దాదాపు 1.90లక్షల కేసులు నమోదైనట్లు అంచనా. వీటివల్ల దాదాపు 2.8 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. సింగపూర్‌లో నమోదవుతున్న నేరం కేసుల్లో మోసాలకు సంబంధించినవే 60 శాతం ఉంటున్నట్లు తెలుస్తోంది.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- చర్చలు సాగిస్తూనే.. పశ్చిమాసియాకు అమెరికా యుద్ధ విమానాలు..! Iran-USA అమెరికా- ఇరాన్‌ల మధ్య అణుఒప్పందానికి సంబంధించి ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్న క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 24 గంటల్లో అగ్రరాజ్యం దాదాపు 50 అత్యాధునిక యుద్ధ విమానాలను పశ్చిమాసియాలో మోహరించింది.
- మాకు పింఛన్లు వద్దు శ్రీలంక చట్టసభ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పదవీకాలం ముగిశాక పింఛన్లు తీసుకోరాదని వారు నిర్ణయించారు.
- అమెరికా పౌరహక్కుల నేత జెస్సీ జాక్సన్ మృతి అమెరికాలో శ్వేతజాతి దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ అనుచరుడు, రెండుసార్లు దేశాధ్యక్ష పదవికి పోటీచేసిన మానవ హక్కుల ఉద్యమ ప్రముఖుడు రెవరెండ్ జెస్సీ ఎల్.జాక్సన్ మంగళవారం మరణించారు.
- భారత్ సాయం మాకు అత్యంత కీలకం అంతర్జాతీయ సమాజ అభ్యున్నతి కోసం శాశ్వత ప్రాతిపదికన భారత్ అందిస్తున్న సాయం తమకెంతో కీలకమని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ స్పష్టం చేశారు.
- బంగ్లా ప్రధానిగా రహమాన్ ప్రమాణం బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా బీఎన్‌పీ నేత తారిఖ్ రహమాన్ (60) మంగళవారం పదవీ ప్రమాణం చేశారు.
- సౌదీలో దర్శనమిచ్చిన రంజాన్ నెలవంక సౌదీ అరేబియాతో సహా పలు గల్ఫ్ దేశాల్లో రంజాన్ నెలవంక దర్శనమిచ్చింది. దీంతో ఉపవాసాలు, భక్తిశ్రద్ధలకు ప్రత్యేకమైన పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైనట్లయింది.
- విన్యాసాలకు హర్మూజ్ జలసంధి తాత్కాలిక మూసివేత అస్త్ర ప్రయోగాలతో కూడిన సైనిక విన్యాసాలు జరగకుండా హర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
- అమెరికా ఐస్ హాకీ ప్రాంగణంలో కాల్పులు ఐస్ హాకీ క్రీడా ప్రాంగణంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందిన ఘటన ఇక్కడి పాటుకెట్‌లోని డెన్నిస్ ఎం.లించ్ ఎరీనాలో జరిగింది.
- శ్రీలంక సర్కారు కీలక నిర్ణయం.. ఎంపీల పెన్షన్లు రద్దు SriLanka: పొరుగు దేశం శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల పెన్షన్లను పూర్తిగా రద్దు చేసింది. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్‌లో మంగళవారం ఆమోదం పొందింది.
- ఆ యుద్ధ నౌకలు మునిగిపోవచ్చు! ట్రంప్‌నకు ఖమేనీ హెచ్చరికలు అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు.