ఈ ఫ్యాషన్ రూల్స్.. పాటిస్తే అదుర్స్!

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: నలుగురిలో అందంగా, ఆకట్టుకునేలా కనిపించాలని అందరూ భావిస్తారు. కానీ, ఎలా అనేది ప్రశ్న. చాలామందికి ఫ్యాషన్, స్టైల్‌పై అంతగా అవగాహన ఉండదు. నచ్చిన దుస్తులు కొనేసి ధరించేస్తుంటారు. అవి అంతగా ఆకట్టుకోకపోవచ్చు. అయితే, ఫ్యాషన్‌లో కొన్ని బేసిక్ రూల్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అయితే మిమ్మల్ని చూసినవారు అదుర్స్ అనక మానరు. ఆ రూల్స్ ఏంటంటే..
బాడీ టైప్
ఒక్కో వ్యక్తి శరీరసౌష్టవం ఒక్కోలా ఉంటుంది. కొందరు సన్నగా ఉంటే.. మరికొందరు లావుగా ఉంటారు. అందుకే, సౌకర్యవంతంగా ఉండి బాడీ టైప్‌నకు సరిపోయే దుస్తులు మాత్రమే ఎంచుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తారు. సన్నగా ఉన్న వ్యక్తులు లూజ్ దుస్తులు వేసుకున్నా.. లావుగా ఉన్న వ్యక్తులు టైట్ దుస్తులు ధరించినా చూడటానికి బాగుండదు.
బాడీ ఫిట్
మార్కెట్లోకి అనేక రకాల దుస్తులు వస్తుంటాయి. అవి ఖరీదైనవి అయినా, చౌకగా వచ్చినా ఫిట్‌గా లేకపోతే అస్సలూ బాగోవు. కొనే సమయంలోనే జాగ్రత్త వహించాలి. కొన్న దుస్తులను మీ సైజుకు పర్‌ఫెక్ట్‌గా సరిపోయేలా టైలరింగ్ చేయించుకోవాలి. మీకు నచ్చిన జీన్స్ ప్యాంటు పొడవుగా ఉంటే మీ సైజుకు అల్ట్రేషన్ చేయిస్తే సరి.
సింపుల్ లుక్
భారీ డిజైన్లు ఉంటే స్టైలిష్ ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. సింపుల్ డిజైన్‌తో ఉండే దుస్తులు మాత్రమే ఎప్పుడూ ట్రెండీగా కనిపిస్తాయి. ఎంబ్రాయిడరీ, చమ్కీలు, ఇలా హెవీవర్క్ ఉన్న దుస్తులను ఎంపిక చేసుకోకపోవడం ఉత్తమం. ఒకవేళ అలాంటి దుస్తులే ధరించాలనుకుంటే కాస్త తక్కువ డిజైన్ ఉన్నవి ఎంపిక చేసుకోవచ్చు.
కలర్ కాంబినేషన్
బ్రైట్ కలర్స్ ధరిస్తే లుక్ అంతగా బాగుండదు. మొత్తం ఒకే రంగు దుస్తుల్లో మహిళలు కొన్నిసార్లు అందంగా కనిపించొచ్చు. పురుషులకు అవి అంతగా నప్పవు. స్కిన్‌టోన్‌కు నప్పే రంగులు ఎంచుకొని.. వాటిలో మంచి కాంబినేషన్‌తో షర్ట్/టీషర్ట్, ప్యాంట్‌లు ఎంపిక చేసుకోవాలి. మహిళలు తమ దుస్తుల్లో రెండు, మూడు రంగులు మించకుండా చూసుకుంటే మంచిది.

ప్లేస్
అన్నిచోట్లా ఒకేవిధమైన దుస్తులు/స్టైల్ బాగోదు. వెళ్లే చోటును బట్టి దుస్తులు ధరిస్తేనే ఆకట్టుకునేలా కనిపిస్తారు. ఆఫీసుకు ఫార్మల్ దుస్తులు ధరించాలి. ఫంక్షన్‌ను బట్టి ట్రెడిషనల్ అయితే లాల్చీపైజామా/ కుర్తా/ పంచెకట్టు, చీరలు బాగుంటాయి. పార్టీ అయితే జీన్స్, టీషర్ట్, బ్లేజర్స్, లెహంగా, పరికిణీ వేసుకోవచ్చు. బయటకు వెళ్తే క్యాజువల్ డ్రెస్సింగ్ సరిపోతుంది.
నీట్‌నెస్
ఎంత ఖరీదైన దుస్తులు ధరించినా అవి మురికిగా, ముడతలు పడి ఉంటే లుక్ మొత్తం పోతుంది. అందుకే, ధరించేవి ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ముడతలు లేకుండా ఐరన్ చేసుకోవాలి. దుస్తులు నీట్‌గా ఉంటే.. మీరూ నీట్‌గా.. అందంగా కనిపిస్తారు.
యాక్సెసరీస్
వాచ్, బెల్ట్, చెయిన్ వంటి యాక్సెసరీస్ లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. అయితే, అవి అతిగా ఉపయోగిస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. వేసుకునే దుస్తులకు మ్యాచ్ అయ్యేలా వాటిని ఎంచుకోవాలి. ఫార్మల్ దుస్తులకు సన్నని చెయిన్, క్లాసిక్ వాచ్‌లు సూట్ అవుతాయి. మందంగా ఉండే చెయిన్స్, ట్రెండీ వాచ్‌లు నప్పవు.

ట్రెండ్
ఫ్యాషన్ రంగంలో తరచూ ట్రెండ్స్ మారుతూనే ఉంటాయి. వాటిని గుడ్డిగా నమ్మి ఫాలో అవకూడదు. మీ బాడీ టైప్, కంఫర్ట్‌కు సరిపడా దుస్తులు మార్కెట్లోకి వచ్చినప్పుడే తీసుకోవాలి. ట్రెండ్ ఉందని ధరిస్తే తర్వాత ఇబ్బందిపడాల్సి వస్తుంది. డబ్బులూ వృథానే.
కాన్ఫిడెన్స్
మీరు ఎలాంటి దుస్తులు ధరించినా, ఎక్కడికి వెళ్లినా ఆత్మవిశ్వాసంతో ఉండటం చాలా ముఖ్యం. ఆహార్యంతోపాటు ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే నలుగురిలో మీరు ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు.
► Read latest Explained Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పేరుకే పెద్దమనిషి.. భారత్ అంటే నిలువెల్లా విద్వేషమే! ఆయన చేసింది బ్యాంకు వ్యాపారం.. గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీలు ఇచ్చి అయినకాడికి వసూలు చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి.
- ప్రేమికుల రోజు సరదాలా?ఖర్చే లేకుండా రొమాంటిక్ అనుభవాలు పొందొచ్చు! ప్రేమికుల రోజు.. కేవలం ప్రేమ జంటలే కాదు, భార్యాభర్తలూ చేసుకోదగ్గ వేడుక. సాధరణంగా ఈ రోజున ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.
- టెండర్లపై ‘ఏఐ’ నిఘా.. అక్రమాలు, సిండికేట్‌లు ఇకపై కుదరవు! రహదారులు, రైల్వే ప్రాజెక్టులు సహా అభివృద్ధి పనులు.. ఇలా ప్రభుత్వంలో ప్రధాన నిర్మాణ ప్రాజెక్టులకు టెండర్లు తప్పనిసరి.
- విహారయాత్ర సరే.. బడ్జెట్ మాటేంటి? నెలవారీ ఖర్చులు, భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికల మధ్య విహారయాత్రకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించడం కష్టమే. అయితే, చేసే ఖర్చుల్లోనే కొంత మొత్తం పొదుపు చేస్తే విహారానికి బడ్జెట్ పెద్ద సమస్యే కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. మరి దానికి ఏం చేయాలంటే..
- వద్దన్నా వస్తున్నారు.. యూరప్‌లో ట్రావెల్ ఓవర్‌క్రౌడింగ్! చాలా దేశాల ప్రభుత్వాలు తమ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ.. మా దేశంలో పర్యటించాలని ప్రకటనలు, ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి.
- ‘మని’ ద్వీపకల్పం.. అక్కడ అంతా ఒకే సమూహం గ్రీసులో ఉన్న ఓ మానవ సమూహం తరతరాలుగా అనేక దాడులను ఎదుర్కొని నిలిచింది.
- పిల్లల్ని కనబోతున్నారా.. మరి వీటి గురించి ఆలోచించారా? పెళ్లి చేసుకున్న యువజంటలతో బంధువులు అనే మొదటి మాట..‘పిల్లల్ని ఎప్పుడు కంటారు? తొందరగా కనేయండి’అని. వైవాహిక జీవితానికి తల్లిదండ్రులు అనే హోదానే పరిపూర్ణత ఇస్తుందని సమాజం నమ్ముతుంది.
- మాటలెందుకు? మీమ్స్ ఉండగా.. జెన్ జీ లైఫ్‌స్టైల్ ఇదీ! ఎవరైనా బొద్దుగా ఉన్న వ్యక్తి తారసపడితే ‘ఒడియమ్మా బంటీ’ అంటున్నారు.. ఏదైనా పనిని ఆశ్చర్యపరిచేలా వేగంగా చేసినా, ఎవరూ చేయలేని పనిని చేసి చూపించినా ‘ఫ్లాష్‌మ్యాన్’ అని పిలుస్తున్నారు. ఎందుకు అంటారా? ఇటీవల సోషల్‌మీడియాలో ట్రెండ్ అయినా మీమ్స్ అవి.
- టైమ్‌కి పని అవ్వాలంటే.. ఈ టెక్నిక్స్ తెలిసుండాలి! అనుకున్న పనులు సమయానికి పూర్తి కావాలంటే సమయ పాలన చాలా ముఖ్యం. దీన్ని పట్టించుకోకపోతే పనులన్నీ గందరగోళంగా, అసంపూర్తిగా ఉంటాయి.
- జిప్ కోడింగ్.. గల్లీ దాటని ప్రేమ! గతంలో ప్రేమ కోసం సప్తసాగారాలు దాటిన కథలు విన్నాం. ఈ టెక్నాలజీ యుగంలో ఎంత దూరమున్నా మొబైల్‌లో మాట్లాడుతూ, వీడియో కాల్స్‌తో నెట్టుకొస్తున్న లాంగ్ డిస్టెన్స్ ప్రేమలనూ చూస్తున్నాం. కానీ, ఇప్పుడు కాలంతోపాటు యువత ఆలోచనలూ మారుతున్నాయి.
- గ్రీన్‌లాండ్‌లో స్థలాన్ని కొనలేం.. ఇల్లు కావాలంటే పదేళ్లు వేచి చూడాలి! గ్రీన్‌లాండ్.. డెన్మార్క్‌కు చెందిన స్వయంప్రతిపత్తి గల ప్రాంతం. ఇక్కడి భూచట్టాల ప్రకారం.. భూమి అనేది ఇక్కడి ప్రజల సామూహిక వనరు. అందుకే, వ్యక్తిగతంగా ఎవరికీ యాజమాన్య హక్కులుండవు.
- నదిలో బంగారం.. అదే వారికి జీవనాధారం! హరియాణాలోని యమునానగర్ జిల్లాలో బోలి నది ప్రవహిస్తుంటుంది. ఆ నదీతీర ప్రాంతంలో నివసించే ప్రజలకు అది కేవలం నీటి వనరే కాదు.. జీవనాధారం కూడా. ఎందుకంటే ఆ నదీలో బంగారం ఉంది.
- ఊరు మొత్తానికి ఒక్కటే వంటశాల.. వృద్ధుల కోసం వినూత్న ఆలోచన! చందంకి.. గుజరాత్‌లోని మారుమూల చిన్న గ్రామం. అన్ని ఊర్లలో ఉన్నట్టుగానే ఇరుకైన వీధులు, సాధారణ ఇళ్లు, గుడి, బడి అన్ని ఉంటాయి. కానీ, ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది.
- పొట్ట నిండినా ఆహారంపైనే ధ్యాస.. పెరుగుతోన్న ఫుడ్ నాయిస్ ఆకలి వేస్తే భోజనం చేస్తాం. ఎప్పుడైనా అనుకోకుండా మంచి ఫుడ్ కనిపిస్తే జిహ్వా కోరికని తీర్చేస్తాం. కానీ, కొంతమందికి ఆకలి తీరినా, ఎన్ని రకాల రుచులు చూసినా ఇంకా ఏం తినాలి? ఎప్పుడు తినాలి? అని ఆహారం గురించే ఆలోచిస్తుంటారు.
- ఇజ్రాయెల్ ఆర్మీలో అందమైన భామలు! Israeli Army: ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆర్మీ కలిగిన దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. అత్యాధునిక ఆయుధ, సాంకేతిక సంపత్తి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) సొంతం.
- ఇతరుల్ని అర్థం చేసుకునేవారు ఇలా ఉంటారట! మనుషులంతా ఒకేలా ఉండరు. కొందరికి ఎంత చెప్పినా అర్థం కాదు. మరికొందరు చెప్పకుండానే అర్థం చేసుకుంటారు. కానీ, చాలా కొంత మందికే ఇతరులను పూర్తిగా చదవగలిగే సామర్థ్యం ఉంటుంది.
- ఈ ఆలయంలో మొక్కుకుంటే జుట్టు రాలదట! ఏ దేవాలయానికి వెళ్లినా సుఖఃసంతోషాలు కలిగించమని, ఆరోగ్యం కాపాడమని, సంపద పెరగాలని దేవుళ్లకు ప్రార్థించడం సహజం. వాళ్లు కరుణిస్తే మొక్కులు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే, జపాన్‌లో ఓ విచిత్రమైన ఆలయం ఉంది. అక్కడ భక్తులు కేవలం తమ జుట్టు రాలిపోకూడదని, జుట్టు సమస్యలు తొలగిపోవాలని మాత్రమే ప్రార్థిస్తారు.
- ఎగిరే గాలిపటం.. మెరుగయ్యే జీవనం! గాలిపటాలు ఎగరవేయడం అనేది కేవలం సంప్రదాయం, సరదా మాత్రమే కాదు.. మనుషులకు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాదు, ఎన్నో లాభాలు చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- ఒంటరితనానికి కారణం ఇతరులు కాదు, మన అలవాట్లే! కొంత మంది ఒంటరిగా మిగిలిపోయామని మథనపడుతుంటారు. తనకంటూ ఎవరూ లేరని, చుట్టూ ఉన్నవారు దూరం చేస్తున్నారని భావిస్తారు. నిజానికి మనలోని అలవాట్లు, ఆలోచన తీరు, మనస్తత్వాలే మనుషుల్ని మనకు దూరం చేస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
- అనగనగా ఓ గ్రామం.. అక్కడ ఒకే ఒక్క ఇల్లు! నిర్మానుష్య ప్రాంతంలో కాసేపు ఉండాలంటేనే భయంతో వణుకు వచ్చేస్తుంటుంది. అలాంటిది, కనుచూపుమేరలో మనుషులే కనిపించని ఓ మారుమూల గ్రామంలో ఓ కుటుంబం కొన్నేళ్లుగా నివసిస్తోంది.