హుస్సేన్‌సాగర్ వద్ద ఎన్డీఆర్‌ఎఫ్ మాక్‌డ్రిల్

- A
- A+
- A++

ఖైరాతాబాద్: వరదలు, విపత్తుల సమయంలో బాధితులను రక్షించే తీరుపై ఎన్డీఆర్‌ఎఫ్, డీఆర్‌ఎఫ్ సిబ్బంది వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో మాక్ డ్రిల్ నిర్వహించారు. సోమవారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులోని వ్యూ పాయింట్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సలహాదారు సుధీర్ బెహరా, తెలంగాణ ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ హాజరయ్యారు. ఏర్పాట్లను పరిశీలించిన ఆయన.. అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఎన్డీఆర్‌ఎఫ్, డీఆర్‌ఎఫ్ సిబ్బంది.. నీటిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం, ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన మత్య్సకారులను రక్షించడం, బోటు అందుబాటులో లేనప్పుడు రిమోట్ కంట్రోల్ బోట్లతో బయటకు రావడం, మునిగిపోతున్న వ్యక్తిని గజ ఈతగాళ్లు తీసుకొచ్చే విధానం, సీపీఆర్ చేయడం, వైద్య సిబ్బంది ఆస్పత్రికి తరలించడం వంటి అంశాలపై ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో ఈ మాక్‌డ్రిల్ జరుగుతోంది.



గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.