Doctor Assaults Patient: చికిత్స కోసం వస్తే.. రోగిని చితకబాదిన డాక్టర్‌

Eenadu icon
By National News Team Published : 22 Dec 2025 17:55 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: చికిత్స కోసం వచ్చిన రోగిని ఓ డాక్టర్ చితకబాదాడు. మర్యాదగా మాట్లాడమన్నందుకు విచక్షణ మరచి కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని శిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. (Doctor Assaults Patient) 

శిమ్లా (Shimla) జిల్లాకు చెందిన వ్యక్తి కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం తాజాగా ఐజీఎంసీ ఆసుపత్రికి వెళ్లాడు. ‘‘ఎండోస్కోపీ కోసం ఆసుపత్రికి వెళ్లాను. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని సిబ్బంది సూచించారు. దాంతో నేను ఖాళీగా ఉన్న బెడ్‌పై పడుకున్నాను. అప్పుడు అక్కడకు వచ్చిన డాక్టర్‌ వస్తూవస్తూనే నాతో అగౌరవంగా ప్రవర్తించాడు. మర్యాదగా మాట్లాడాలని అడిగినందుకు నాపై దాడి చేయడం మొదలుపెట్టాడు’’ అని బాధిత వ్యక్తి వెల్లడించాడు. పక్కన ఉన్నవారు ఆపుతున్నా.. చికిత్స అందించాల్సిన వైద్యుడే ఇష్టం వచ్చినట్టు కొట్టగా.. బెడ్‌పై పడుకున్న రోగి కాలుతో డాక్టర్‌ను తన్నుతున్నట్టు ఆ దృశ్యాల్లో కనిపించింది.

ఈ ఘటన తర్వాత రోగి వెంట వచ్చినవారు ఆసుపత్రి బయట నిరసనకు దిగారు. ఈ ఘటనలో బాధితుడి ముక్కుకు గాయమైంది. అతడు వైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడని, ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వెల్లడించారు. ఆ వ్యక్తే తనతో అమర్యాదగా ప్రవర్తించాడని వైద్యుడు తెలిపాడు. అయితే ఈ వ్యవహారమంతా నెట్టింట్లో వైరల్ కావడంతో రాష్ట్ర ఆరోగ్యమంత్రి ధని రామ్ శాండిల్‌ తీవ్రంగా పరిగణించారు. అలాంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని డాక్టర్ ప్రవర్తనను ఖండించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.  


► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • తప్పు జరిగింది.. క్షమించండి: దిల్లీలో కారు ప్రమాదానికి కారణమైన బాలుడి తండ్రి Delhi: దిల్లీలో మైనర్‌ బాలుడు నిర్లక్ష్యంగా కారు నడిపి.. ఓ వ్యక్తి మృతికి కారణమైన సంగతి తెలిసిందే. దీనిపై బాలుడి తండ్రి స్పందిస్తూ.. మృతుని కుటుంబానికి క్షమాపణలు తెలిపారు.
  • కొంకణ్‌ తీర పర్యాటకులకు డాల్ఫిన్ల గుంపు కనువిందు మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లా పరిధిలో గల కొంకణ్‌ తీరంలో పర్యాటకులకు డాల్ఫిన్లు గుంపుగా కనిపించి కనువిందు చేశాయి.
  • వైద్యుడి ఫోన్‌ నంబరు కోసం గూగుల్‌లో వెదికితే.. ఖాతా ఖాళీ సైబర్‌ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో ప్రజల ఖాతాలను గుల్ల చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని శహడోల్‌ జిల్లాలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది.
  • ఐఎన్‌ఎస్‌ కృష్ణ జలప్రవేశం తొలి స్వదేశీ కేడెట్‌ శిక్షణ నౌక (సీటీఎస్‌) ఐఎన్‌ఎస్‌ కృష్ణ జలప్రవేశం చేసినట్టు నేవీ వర్గాలు మంగళవారం తెలిపాయి. చెన్నైలోని కట్టుపల్లి వద్ద లార్సన్‌ అండ్‌ టుబ్రో యార్డులో ఈ కార్యక్రమం జరిగినట్లు వెల్లడించాయి.
  • కర్ణాటకలో హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ కర్ణాటకలోని కోలారు జిల్లా వేమగల్‌లో భారత తొలి ప్రైవేటురంగ హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ ‘ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌’ (ఎఫ్‌ఏఎల్‌)ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో కలిసి ముంబయి నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.
  • నూరుకోట్లకు బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారుల సంఖ్య దేశంలో బ్రాడ్‌ బ్యాండ్‌ వినియోగదారుల సంఖ్య గత పదేళ్లలో ఆరు కోట్ల నుంచి వంద కోట్లకు చేరిందని కేంద్ర కమ్యూనికేషన్లశాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. 2014-2025 మధ్యకాలంలో ఈ గొప్ప మైలురాయిని దాటడం సాధ్యమైందని చెప్పారు.
  • శ్రీపెరుంబుదూర్‌లో అతిపెద్ద కార్మిక ఆసుపత్రి తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌లో కార్మికుల కోసం దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి నిర్మించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి తంగం తెన్నరసు ప్రకటించారు. 18,720 పడకల ఈ ఆసుపత్రి నిర్మాణానికి రూ.706 కోట్లు కేటాయించారు.
  • ఫ్రాన్స్‌తో భాగస్వామ్యం ఇక ప్రత్యేకం తమ మధ్య సంబంధాలను ‘ప్రత్యేక ప్రపంచవ్యాప్త వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచాలని భారత్‌-ఫ్రాన్స్‌ నిర్ణయించాయి.
  • పిటిషన్లలో ఏఐ వినియోగం ఆందోళనకరం కృత్రిమ మేధ సాధనాల సాయంతో రూపొందించిన పిటిషన్లను న్యాయస్థానాలకు సమర్పించే వైఖరి న్యాయవాదుల్లో ప్రబలడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
  • కాంగ్రెస్‌ మనుగడకు మూలం అసమ్మతే అసమ్మతిని సహించలేని పరిస్థితిలో కాంగ్రెస్‌ ఉంటే అది ఆ పార్టీ వినాశనానికే దారి తీస్తుందని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు మణిశంకర్‌ అయ్యర్‌ అభిప్రాయపడ్డారు.
  • అదో తుగ్లకీయ కమిషన్‌ ఎన్నికల సంఘం ‘‘తుగ్లకీయ కమిషన్‌’’లా వ్యవహరిస్తోందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఆరోపించారు.
  • బెంగాల్, తమిళనాడుల్లో ఏప్రిల్‌లో ఎన్నికలు! నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలను ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అధికారులు మంగళవారం వెల్లడించారు.
  • రైళ్ల మరుగుదొడ్లలో జెట్‌ స్ప్రేలు రైలు బోగీల్లోని మరుగుదొడ్లలో కొళాయి, చైన్‌తో కూడిన స్టీలు మగ్గుల స్థానంలో జెట్‌ స్ప్రేలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
  • ఆసక్తికరమైన ఏఐ ప్రాజెక్టులు ప్రదర్శించిన ఎల్‌పీయూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఇండియా-ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పోలో లవ్లీ ప్రొఫెషనల్‌ విశ్వవిద్యాలయ (ఎల్‌పీయూ) ప్రాజెక్టులు అందరి మన్ననలు పొందాయని వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
  • మాకు పెన్షన్లు వద్దు శ్రీలంక చట్టసభ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పదవీకాలం ముగిశాక పెన్షన్లు తీసుకోరాదని నిర్ణయించారు.
  • కె2 విటమిన్‌తో ఎముకలు బలోపేతం డి విటమిన్‌ క్రియాశీల రూపమైన కాల్సిట్రియోల్‌గా మారేందుకు మెగ్నీషియం చాలా అవసరం.
  • గేట్స్‌ హాజరుపై సందిగ్ధం! ఏఐ సమిట్‌కు బిల్‌ గేట్స్‌ హాజరవుతారా లేదా అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఆయన హాజరుకాబోవడం లేదని తొలుత ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
  • చదరపు మీటరు ఉష్ణమండల అడవితో ఏటా 240 లీటర్ల వర్షపాతం ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రతి చదరపు మీటరు అడవి వల్ల ఏటా దాదాపు 240 లీటర్ల వర్షపునీరు లభ్యమవుతోందని తాజా అధ్యయనం పేర్కొంది.
  • బైకర్‌ను ఢీకొన్న కారు.. వైరల్‌గా మారిన వీడియో దేశరాజధాని దిల్లీలో ఒక మైనర్‌ బాలుడు(17) తన స్కార్పియో వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి బైక్‌పై ప్రయాణిస్తున్న 23 ఏళ్ల సాహిల్‌ ధానేశ్ర అనే వ్యక్తి మృతికి కారణమయ్యాడు.
  • కేంద్ర మంత్రి పురీ రాజీనామా చేయాలి: కాంగ్రెస్‌ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ ఫైళ్ల వ్యవహారంపై కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ వరుసబెట్టి అబద్ధాలాడుతున్నారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండు చేసింది.