Asim Munir: ‘సిందూర్’ వేళ ఆ సాయమే పాక్‌ను కాపాడింది: ఆసిమ్ మునీర్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్థాన్‌కు గట్టి దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. నాటి పరిణామాలకు సంబంధించి ఇటీవల పాక్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ (Asim Munir) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ సమయంలో ‘దైవిక సాయమే’ తమ దేశాన్ని కాపాడిందంటూ మునీర్ వ్యాఖ్యానించారు.
ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన నేషనల్ ఉలెమా కాన్ఫరెన్స్‌లో ఆసిమ్ మునీర్ పాల్గొన్నారు. ఇందులో ఆయన చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోలు తాజాగా వైరల్ అయ్యాయి. ‘‘భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ ( Operation Sindoor)తో పాకిస్థాన్ ఘోరంగా దెబ్బతిన్న సమయంలో సాయుధ దళాలకు దైవిక సాయం అందింది. దాన్ని మేం ఫీల్ అయ్యాం’’ అని మునీర్ అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది.
- పాక్ ఎయిర్‌లైన్స్‌కు ఎదురుదెబ్బ.. కొనుగోలు రేసు నుంచి బిడ్డర్ నిష్ర్కమణ
ఆ కార్యక్రమంలో అఫ్గాన్‌తో ఘర్షణల గురించి కూడా మునీర్ మాట్లాడారు. ‘‘పాకిస్థాన్ ( Pakistan) చిన్నారుల రక్తాన్ని అఫ్గాన్ కళ్ల జూస్తోంది. మన దేశంలో పుట్టుకొస్తున్న తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ ముఠాల్లో 70శాతం అఫ్గాన్ పౌరులే ఉంటున్నారు. తాలిబన్ ప్రభుత్వం ఇకనైనా ఈ సీమాంతర ఉగ్ర దాడులను ప్రోత్సహించడం మానుకోవాలి’’ అంటూ వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన భీకర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా మే 7న పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’తో భీకర దాడులు చేసింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో ఉగ్ర శిబిరాలతో పాటు పాక్ సైనిక స్థావరాలను కూడా భారత్ ధ్వంసం చేసింది. దీంతో తీవ్రంగా దెబ్బతిన్న దాయాది దేశం.. కాళ్ల బేరానికి రావడంతో భారత్ వైమానిక దాడులను నిలిపివేసింది.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 10:03 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- అమెరికా పౌరహక్కుల నేత జెస్సీ జాక్సన్ మృతి అమెరికాలో శ్వేతజాతి దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ అనుచరుడు, రెండుసార్లు దేశాధ్యక్ష పదవికి పోటీచేసిన మానవ హక్కుల ఉద్యమ ప్రముఖుడు రెవరెండ్ జెస్సీ ఎల్.జాక్సన్ మంగళవారం మరణించారు.
- భారత్ సాయం మాకు అత్యంత కీలకం అంతర్జాతీయ సమాజ అభ్యున్నతి కోసం శాశ్వత ప్రాతిపదికన భారత్ అందిస్తున్న సాయం తమకెంతో కీలకమని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ స్పష్టం చేశారు.
- బంగ్లా ప్రధానిగా రహమాన్ ప్రమాణం బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా బీఎన్‌పీ నేత తారిఖ్ రహమాన్ (60) మంగళవారం పదవీ ప్రమాణం చేశారు.
- సౌదీలో దర్శనమిచ్చిన రంజాన్ నెలవంక సౌదీ అరేబియాతో సహా పలు గల్ఫ్ దేశాల్లో రంజాన్ నెలవంక దర్శనమిచ్చింది. దీంతో ఉపవాసాలు, భక్తిశ్రద్ధలకు ప్రత్యేకమైన పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైనట్లయింది.
- విన్యాసాలకు హర్మూజ్ జలసంధి తాత్కాలిక మూసివేత అస్త్ర ప్రయోగాలతో కూడిన సైనిక విన్యాసాలు జరగకుండా హర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
- అమెరికా ఐస్ హాకీ ప్రాంగణంలో కాల్పులు ఐస్ హాకీ క్రీడా ప్రాంగణంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందిన ఘటన ఇక్కడి పాటుకెట్‌లోని డెన్నిస్ ఎం.లించ్ ఎరీనాలో జరిగింది.
- శ్రీలంక సర్కారు కీలక నిర్ణయం.. ఎంపీల పెన్షన్లు రద్దు SriLanka: పొరుగు దేశం శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల పెన్షన్లను పూర్తిగా రద్దు చేసింది. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్‌లో మంగళవారం ఆమోదం పొందింది.
- ఆ యుద్ధ నౌకలు మునిగిపోవచ్చు! ట్రంప్‌నకు ఖమేనీ హెచ్చరికలు అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు.