Asim Munir: ‘సిందూర్‌’ వేళ ఆ సాయమే పాక్‌ను కాపాడింది: ఆసిమ్‌ మునీర్‌

Eenadu icon
By International News Team Updated : 22 Dec 2025 10:12 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ జరిపిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో పాకిస్థాన్‌కు గట్టి దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. నాటి పరిణామాలకు సంబంధించి ఇటీవల పాక్‌ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌, ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌ (Asim Munir) చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఆ సమయంలో ‘దైవిక సాయమే’ తమ దేశాన్ని కాపాడిందంటూ మునీర్‌ వ్యాఖ్యానించారు.

ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన నేషనల్ ఉలెమా కాన్ఫరెన్స్‌లో ఆసిమ్‌ మునీర్‌ పాల్గొన్నారు. ఇందులో ఆయన చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోలు తాజాగా వైరల్‌ అయ్యాయి. ‘‘భారత్‌ జరిపిన ఆపరేషన్‌ సిందూర్‌ ( Operation Sindoor)తో పాకిస్థాన్‌ ఘోరంగా దెబ్బతిన్న సమయంలో సాయుధ దళాలకు దైవిక సాయం అందింది. దాన్ని మేం ఫీల్‌ అయ్యాం’’ అని మునీర్‌ అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది.

  • పాక్‌ ఎయిర్‌లైన్స్‌కు ఎదురుదెబ్బ.. కొనుగోలు రేసు నుంచి బిడ్డర్‌ నిష్ర్కమణ

ఆ కార్యక్రమంలో అఫ్గాన్‌తో ఘర్షణల గురించి కూడా మునీర్‌ మాట్లాడారు. ‘‘పాకిస్థాన్‌ ( Pakistan) చిన్నారుల రక్తాన్ని అఫ్గాన్‌ కళ్ల జూస్తోంది. మన దేశంలో పుట్టుకొస్తున్న తెహ్రీక్ ఇ తాలిబన్‌ పాకిస్థాన్‌ ముఠాల్లో 70శాతం అఫ్గాన్ పౌరులే ఉంటున్నారు. తాలిబన్‌ ప్రభుత్వం ఇకనైనా ఈ సీమాంతర ఉగ్ర దాడులను ప్రోత్సహించడం మానుకోవాలి’’ అంటూ వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన భీకర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా మే 7న పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో భీకర దాడులు చేసింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో ఉగ్ర శిబిరాలతో పాటు పాక్ సైనిక స్థావరాలను కూడా భారత్‌ ధ్వంసం చేసింది. దీంతో తీవ్రంగా దెబ్బతిన్న దాయాది దేశం.. కాళ్ల బేరానికి రావడంతో భారత్‌ వైమానిక దాడులను నిలిపివేసింది.

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 10:03 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • అమెరికా పౌరహక్కుల నేత జెస్సీ జాక్సన్‌ మృతి అమెరికాలో శ్వేతజాతి దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ అనుచరుడు, రెండుసార్లు దేశాధ్యక్ష పదవికి పోటీచేసిన మానవ హక్కుల ఉద్యమ ప్రముఖుడు రెవరెండ్‌ జెస్సీ ఎల్‌.జాక్సన్‌ మంగళవారం మరణించారు.
  • భారత్‌ సాయం మాకు అత్యంత కీలకం అంతర్జాతీయ సమాజ అభ్యున్నతి కోసం శాశ్వత ప్రాతిపదికన భారత్‌ అందిస్తున్న సాయం తమకెంతో కీలకమని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ స్పష్టం చేశారు.
  • బంగ్లా ప్రధానిగా రహమాన్‌ ప్రమాణం బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రిగా బీఎన్‌పీ నేత తారిఖ్‌ రహమాన్‌ (60) మంగళవారం పదవీ ప్రమాణం చేశారు.
  • సౌదీలో దర్శనమిచ్చిన రంజాన్‌ నెలవంక సౌదీ అరేబియాతో సహా పలు గల్ఫ్‌ దేశాల్లో రంజాన్‌ నెలవంక దర్శనమిచ్చింది. దీంతో ఉపవాసాలు, భక్తిశ్రద్ధలకు ప్రత్యేకమైన పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైనట్లయింది.
  • విన్యాసాలకు హర్మూజ్‌ జలసంధి తాత్కాలిక మూసివేత అస్త్ర ప్రయోగాలతో కూడిన సైనిక విన్యాసాలు జరగకుండా హర్మూజ్‌ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది.
  • అమెరికా ఐస్‌ హాకీ ప్రాంగణంలో కాల్పులు ఐస్‌ హాకీ క్రీడా ప్రాంగణంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందిన ఘటన ఇక్కడి పాటుకెట్‌లోని డెన్నిస్‌ ఎం.లించ్‌ ఎరీనాలో జరిగింది.
  • శ్రీలంక సర్కారు కీలక నిర్ణయం.. ఎంపీల పెన్షన్లు రద్దు SriLanka: పొరుగు దేశం శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల పెన్షన్లను పూర్తిగా రద్దు చేసింది. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్‌లో మంగళవారం ఆమోదం పొందింది. 
  • ఆ యుద్ధ నౌకలు మునిగిపోవచ్చు! ట్రంప్‌నకు ఖమేనీ హెచ్చరికలు అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు.

English Translation

Asim Munir: At the time of 'Sindur' it was Saam that saved Pakistan: Asim Munir

Eenadu icon
By International News Team Updated : 22 Dec 2025 10:12 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Internet Desk: It is known that Pakistan was hit hard by 'Operation Sindoor' which was carried out by India in retaliation for the Pahalgam terror attack. Recently, the comments made by Pakistan's Chief of Defense Forces, Field Marshal Asim Munir (Asim Munir) are going viral. At that time, Munir commented that 'divine help' saved his country.

Asim Munir recently participated in the National Ulema Conference held in Islamabad. The videos of his speech in this have recently gone viral. Armed forces received divine help when Pakistan was badly hit by India's Operation Sindoor. Muneer said in the video, "We have felt it".

  • Backlash to Pak Airlines... Bidder exit from the buying race

In the program, Muneer also talked about the clashes with Afghanistan. "Pakistan ( Pakistan) is drinking the blood of Afghan girls. 70 percent of the Tehreek-e-Taliban Pakistan gangs emerging in our country are Afghan citizens. The Taliban government should stop encouraging these cross-border terrorist attacks," he said.

It is known that 26 people lost their lives in a fierce attack by terrorists in Pahalgam in Jammu and Kashmir in April this year. In response to this, on May 7, Pakistan carried out fierce attacks on terrorist bases in Pakistan-occupied Kashmir with 'Operation Sindoor'. In this war which lasted for four days, India destroyed the terrorist camps as well as the Pakistani military bases. Due to this, India has stopped the airstrikes after reaching a compromise. target="_blank" rel="noopener">Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 10:03 IST

Note:Advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Death of American civil rights leader Jesse Jackson Reverend Jesse L. Jackson, a follower of Martin Luther King who fought against white supremacy in America, and a leader of the human rights movement who ran for the post of President twice, died on Tuesday.
  • India's help is very important for us United Nations (UN) Secretary General Antonio Guterres has made it clear that India's assistance on a permanent basis is very important for the development of the international community. BNP leader Tariq Rahman (60) was sworn in as the Prime Minister of Bangladesh on Tuesday.
  • Ramadan crescent seen in Saudi Arabia Ramadan crescent has been seen in many Gulf countries including Saudi Arabia. This marks the beginning of the special holy month of Ramadan for fasting and devotion.
  • Temporary closure of Strait of Hormuz for maneuvers Iran has announced that it is temporarily closing the Strait of Hormuz to prevent military exercises involving missile launches. The incident in which three people were killed in the shooting at the ice hockey stadium took place at the Dennis M. Lynch Arena in Harukatte.
  • The key decision of the Sri Lankan government.. Cancellation of pensions of MPs SriLanka: The government of the neighboring country Sri Lanka has taken a crucial decision. Pensions of MPs have been completely cancelled. The bill in this regard was approved in Parliament on Tuesday. 
  • Those warships may sink! Khamenei's Warnings to Trump Ayatollah Ali Khamenei, the supreme leader of Iran, made important comments while the tension between America and Iran continues.